E-Paper
Advertisement

EPFO Insurance: ఈపీఎఫ్ ఉద్యోగికి ఉచిత బీమా.. రూ.7 లక్షల వరకూ కవరేజీ.. పూర్తి వివరాలు ఇలా

EPFO Insurance: ఈపీఎఫ్ ఉద్యోగికి ఉచిత బీమా.. రూ.7 లక్షల వరకూ కవరేజీ.. పూర్తి వివరాలు ఇలా
Advertisement

EPFO Insurance: మీరు ఆర్గనైజ్డ్ సెక్టర్ లో పనిచేస్తున్నారా? ఈపీఎఫ్ఓలో చందాదారుడిగా ఉంచే రూ.7 లక్షల బీమా కవరేజీకి మీరు అర్హులు. ఈపీఎఫ్ ఖాతా కలిగి ఉండే ఉద్యోగులకు ఈ బీమా అందుబాటులో ఉంటుంది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976 కింద ప్రతి ఈపీఎఫ్ ఖాతాదారుడు ఈ బీమా కవరేజీకి అర్హుడు. ఈ పథకం కింద్ ఉద్యోగి మరణానికి ముందు 12 నెలల్లో ఒకటి లేదా అంత కంటే ఎక్కువ కంపెనీలలో పనిచేస్తే ఉద్యోగుల కుటుంబాలకు లబ్దిపొందుతారు.

గరిష్టంగా రూ.7 లక్షల బీమా

ఉద్యోగికి అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే నామినీ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈడీఎల్ఐ పథకం కింద కనీస బీమా కవరేజీ రూ.2.5 లక్షలు కాగా, గరిష్టంగా రూ.7 లక్షలు. బీమా మొత్తాన్ని ఉద్యోగి గత 12 నెలల సరాసరి జీతం, డీఏ, పీఎఫ్ బ్యాలెన్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ పథకం కోసం ఉద్యోగి నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు. ఉద్యోగి తరఫున ఈ ప్రీమియం ను కంపెనీ చెల్లిస్తుంది. ఉద్యోగి బేసిక్ శాలరీ, డీఏలో 0.50 శాతం మాత్రమే బీమా ప్రీమియంగా చెల్లిస్తారు. ఉద్యోగి జీతం ఎంత ఉన్నా, బేసిక్ పే రూ.15,000 మేరకు చెల్లింపు ఉంటుంది. ఈడీఎల్ఐ పథకం కింద క్లెయిమ్ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు.

నామినీని చేర్చకపోతే

Advertisement

ఈ పథకం కింద ఉద్యోగి నామినీ నమోదు చేయకపోతే.. ఉద్యోగి మరణానంతరం భార్య, పెళ్లికాని కుమార్తెలు, మైనర్ కొడుకులు బీమా మొత్తం పొందేందుకు అర్హులు. అయితే ఆ ఉద్యోగి తప్పనిసరిగా ఈపీఎఫ్ ఖాతా యాక్టివ్ గా ఉండాలి. సాధారణంగా ఉద్యోగుల బేసిక్ శాలరీ, డీఏలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ కూడా 12 శాతం వాటాను చెల్లిస్తుంది. అయితే యజమాని చెల్లించే 12 శాతం వాటాలో 8.33 శాతం ఉద్యోగి పెన్షన్ పథకం (EPS)కు, మిగిలినది ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది.

ఎలా క్లెయిమ్ చేయవచ్చు?

ఈపీఎఫ్ ఖాతాదారుడు అకాల మరణం పొందితే నామినీ లేదా చట్టపరమైన వారసులు బీమా కవరేజీని క్లెయిమ్ చేయవచ్చు. క్లెయిమ్ చేసేవారికి 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, వారి తరఫున సంరక్షకుడు క్లెయిమ్ దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఉద్యోగి డెత్ సర్టిఫికెట్, వారసత్వ ధృవీకరణ పత్రం, మైనర్ నామినీ తరపున సంరక్షకుడు క్లెయిమ్ చేస్తుంటే గార్డియన్‌షిప్ సర్టిఫికేట్, బ్యాంక్ వివరాలను సమర్పించాలి. పీఎఫ్ ఖాతాకు నామినీ లేకపోతే చట్టపరమైన వారసుడు క్లెయిమ్ దాఖలు చేయవచ్చు.

Advertisement

Also Read: ప్యూచర్ విమానయాన రంగానిదే.. 30 వేల మంది పైలెట్లు అవసరం

ఈపీఎఫ్ ఖాతా నుంచి పీఎఫ్ విత్ డ్రాకు యజమానికి సమర్పించిన ఫామ్‌తో పాటు, బీమా కవర్ అయ్యే ఫామ్ 5IF ను సమర్పించాలి. ఈ ఫామ్ యజమాని ద్వారా వెరిఫై చేస్తారు. కంపెనీ సర్టిఫై చేయడం సాధ్యం కాకపోతే గెజిటెడ్ అధికారి, న్యాయమూర్తి, పోస్ట్ మాస్టర్ లేదా సబ్ పోస్ట్ మాస్టర్, ఎంపీ లేదా ఎమ్మెల్యే, గ్రామ పంచాయతీ సర్పంచ్ లేదా సీబీటీ లేదా ఈపీఎఫ్ ప్రాంతీయ కమిటీ సభ్యుడు, బ్యాంక్ మేనేజర్, మునిసిపాలిటీ లేదా జిల్లా స్థానిక బోర్డు ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుడు ఎవరైనా ఒకరు ధ్రువీకరించవచ్చు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×