E-Paper
Advertisement

జియో గేమ్ ఛేంజర్ ఆఫర్.. అన్ని బ్రాండ్ల కీప్యాడ్ ఫోన్లకూ రోజుకు రూ.4కే ప్లాన్!

జియో గేమ్ ఛేంజర్ ఆఫర్.. అన్ని బ్రాండ్ల కీప్యాడ్ ఫోన్లకూ రోజుకు రూ.4కే ప్లాన్!
Advertisement

Jio Cheapest Recharge Plans: దేశవ్యాప్తంగా 5G సేవలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. గ్రామాలు, చిన్న టౌన్లలో ఇప్పటికీ లక్షలాది మంది 4G ఫీచర్ (కీప్యాడ్) ఫోన్లనే వాడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, తక్కువ బడ్జెట్ ఉన్నవారికి ఇవే దిక్కు. ఇప్పటివరకు జియో తమ అత్యంత చౌకైన లాంగ్ వాలిడిటీ ప్లాన్లను కేవలం జియోఫోన్, జియో భారత్ వినియోగదారులకే పరిమితం చేసింది. కానీ ఇప్పుడు లావా, నోకియా, ఐటెల్, హెచ్ఎండీ వంటి ఇతర బ్రాండ్ల 4G కీప్యాడ్ ఫోన్ వినియోగదారులకు కూడా ఈ చౌక ప్లాన్లను అందుబాటులోకి తెచ్చి జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

రూ.123 బడ్జెట్ ప్లాన్:

సాధారణ కనెక్టివిటీ కోరుకునే వారి కోసం రూ.123 ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజూ 0.5GB 4G డేటా, 300 SMSలు లభిస్తాయి. రోజువారీ బ్రౌజింగ్ అవసరాలకు ఇది సరిపోతుంది.

Advertisement

Also Read: నెలనెలా రీఛార్జ్ తిప్పలు వద్దు బాబోయ్.. Jio, Airtel, Viలలో రూ.500 లోపే 84 రోజుల వ్యాలిడిటీ బెస్ట్ ప్లాన్స్ ఇవే!

రెండు నెలల ప్లాన్:

పదే పదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా 56 రోజుల వాలిడిటీ కావాలనుకునే వారి కోసం రూ.234 ప్లాన్ అందుబాటులో ఉంది. దీనిలో కూడా వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 0.5GB డేటాను, ఉచిత SMS ప్రయోజనాలను పొందొచ్చు.

మూడు నెలల కాలపరిమితి:

Advertisement

మరో ఆకర్షణీయమైన ఆఫర్ రూ.369 ప్లాన్. ఇది పూర్తి 84 రోజుల వాలిడిటీని అందిస్తుంది. రోజుకు 0.5GB చొప్పున మొత్తం వాలిడిటీ కాలానికి 42జీబీ డేటా లభిస్తుంది. సుదీర్ఘకాలం ఎలాంటి అంతరాయం లేకుండా ఉచిత కాల్స్ మాట్లాడుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఏడాది ప్లాన్.. రోజుకు రూ.4 మాత్రమే:

ఇక అన్నిటికంటే పెద్ద ఆఫర్ రూ.1234 ప్లాన్. ఇది ఏకంగా 336 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంటే రోజుకు దాదాపు రూ.4 ఖర్చుతో ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 0.5GB డేటా (మొత్తం 168GB) వాడుకోవచ్చు. దీనితో పాటు జియోటీవీ, జియోసావన్ వంటి వినోద సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి.

Also Read: ఫోన్ పాడైతే ఇంటికొచ్చి మరీ రిపేర్ చేస్తారు.. రూ.10వేల బడ్జెట్‌లో మేడ్ ఇన్ ఇండియా ఫోన్ వచ్చేస్తోంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×