E-Paper
Advertisement

Nita Ambani-Vaibhav: నీతా అంబానీ రూ.30 కోట్ల ఆఫ‌ర్‌..ముంబైలోకి వైభ‌వ్ జంప్ ?

Nita Ambani-Vaibhav:  నీతా అంబానీ రూ.30 కోట్ల ఆఫ‌ర్‌..ముంబైలోకి వైభ‌వ్ జంప్ ?
Advertisement

Nita Ambani-Vaibhav:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) అద్భుతంగా రాణిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడితే రూ.30 కోట్లు ఇస్తామని వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Suryavanshi ) బంపర్ ఆఫర్ ఇచ్చారట ఓనర్ నీతా అంబానీ (Nita Ambani ). ఈ మేరకు బ్లాంక్ చెక్ కూడా రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రూ.30 కోట్లతో పాటు ఓ లగ్జరీ ఫ్లాట్, మాల్దీవులలో ప్రైవేట్ ఐలాండ్ కూడా ఇచ్చేందుకు అంబానీ ఫ్యామిలీ సిద్ధమైందట. ఎలాగైనా సరే వైభవ్ సూర్యవంశీని దక్కించుకునేందుకు అంబానీ ఫ్యామిలీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

నీతా అంబానీ రూ.30 కోట్ల ఆఫ‌ర్‌..ముంబైలోకి వైభ‌వ్ జంప్ ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో ఆరెంజ్ క్యాప్ అందుకున్న వైభవ్ సూర్యవంశీ, ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన కూడా బీభత్సం సృష్టించాడు. ఈ దెబ్బకు క్వాలిఫైయర్ లోకి రాజస్థాన్ రాయల్స్ దూసుకు వెళ్ళింది.. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసిన వైభవ్ సూర్య వంశీ… క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైభవ్ సూర్య వంశీ పేరు మారుమోగుతోంది. ఈ తరుణంలో వైభవ్ సూర్యవంశీ పైన ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఐపీఎల్ సమయానికి అతన్ని ముంబై ఇండియన్స్ లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హార్ధిక్ పాండ్యాను ఇచ్చేసి వైభ‌వ్ ను తీసుకునే ప్లాన్ ?

ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను రాజస్థాన్ రాయల్స్ కు ఇచ్చి… వైభవ్ ను లాగేసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు 30 కోట్లు వైభవ్ కు ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఒప్పుకోకపోతే.. వేలంలో అయిన వైభవ్ ను దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. వచ్చే సీజన్ వరకు కచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వైభవ్ వస్తాడని వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చే కోటి రూపాయలు కాదనుకొని వేలంలోకి వచ్చేందుకే నిర్ణయం తీసుకున్నాడట. రెండు కోట్ల బేస్ ప్రైస్ తో రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడట. నిజంగానే వైభవ్ వేలంలోకి వస్తే ముంబై ఒక్కటే కాదు.. లక్నో, SRH లాంటి ఎన్నో జట్లు అతడి కోసం పోటీపడతాయి. అందుకే 30 కోట్ల ఆఫర్ చేసిందట నీతా అంబానీ. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×