E-Paper
Advertisement

CNAP facility: ఇక Truecaller డిలీట్ చేసేయండి.. Jio, Airtel, Vi‌లో కాలర్ నేమ్స్, ఇదిగో ఇలా!

CNAP facility: ఇక Truecaller డిలీట్ చేసేయండి.. Jio, Airtel, Vi‌లో కాలర్ నేమ్స్, ఇదిగో ఇలా!
Advertisement

CNAP facility No Truecaller| గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ముందుగానే వారి పేర్లను తెలిపేందుకు ఇంతకాలం అందరూ ట్రూకాలర్ యాప్ ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు యాప్ లేకుండానే కాలర్ నేమ్ మీకు కనిపిస్తుంది. ఈ సర్వీస్ పేరు కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP). దేశంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం కంపెనీలు ఈ సినాప సర్వీస్ ప్రారంభించాయి. మీ ఫోన్‌లో సేవ్ చేయని నంబర్‌ల నుంచి వచ్చే కాల్స్‌ రాగానే ఆ కాలర్ పేరు కనిపిస్తుంది. ఈ సర్వీస చాలా ఉపయోగకరం. ఇది స్కాం కాల్స్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం.

కొత్త నెంబర్ల నుంచి కాల్స్‌ వస్తే పేరు ఎలా కనిపిస్తోంది?

మీ ఫోన్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినా ఇప్పుడు పేరు చూపిస్తోంది కదా అని ఆశ్చర్యపోకండి. ఇది టెలికాం కంపెనీలు ప్రారంభించిన కొత్త సేవ CNAP వల్ల జరుగుతోంది. సిమ్ తీసుకున్నప్పుడు ఆధార్ లేదా ఇతర కేవైసీ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేసిన అధికారిక పేరే కనిపిస్తుంది. ఇది టెలికాం కంపెనీల డేటాబేస్ నుంచి తీసుకుంటారు.

CNAP ట్రూకాలర్ మధ్య తేడాలు ఇవే..

Advertisement

ట్రూకాలర్ వంటి యాప్స్ యూజర్లు ఇచ్చిన డేటాపై ఆధారపడతాయి. అందువల్ల తప్పుడు పేర్లు, స్పాం ట్యాగ్‌లు లేదా మోసపూరిత గుర్తింపులు కనిపించే అవకాశం ఉంటుంది. కానీ CNAP పూర్తిగా టెలికాం కంపెనీల అధికారిక, వెరిఫైడ్ డేటాబేస్‌పై ఆధారపడుతుంది. దీంతో ఫేక్ పేర్లు రావు, తప్పుగా గుర్తించే ప్రమాదం తగ్గుతుంది. కాలర్ గురించి మరింత విశ్వసనీయ సమాచారం ఉంటుంది.

CNAP సేవను ఏ టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి?

ప్రస్తుతం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) తమ కస్టమర్లకు CNAP సర్వీస్‌ని ట్రయల్ లేదా పైలట్ దశలో అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దశలవారీగా అమలు చేస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) కస్టమర్లు ఇంకా కొంతకాలం వేచి ఉండాలి. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలోనే ఈ సేవను ప్రారంభిస్తుందని ధృవీకరించింది.

ఏ రాష్ట్రాల్లో CNAP సేవ ప్రారంభమైంది?

Advertisement

జియో ఇప్పటికే బిహార్, ఉత్తర్ ప్రదేశ్ ఈస్ట్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, పంజాబ్, కేరళ, అస్సాం, జార్ఖండ్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో CNAPను ప్రారంభించింది. ఇతర కంపెనీలు కూడా ట్రాయ్ ఆదేశాల మేరకు దశలవారీగా అమలు చేస్తున్నాయి.

CNAP గురించి ట్రాయ్ ఆదేశాలు

ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలకు కాలర్ గుర్తింపు విధానం తీసుకురావాలని ఆదేశించింది. సైబర్ నేరాలు, మోసాలు, స్పాం కాల్స్ నుంచి యూజర్లను కాపాడేందుకు ఇది భాగం. CNAP ద్వారా సేవ్ చేయని నంబర్‌లకు కూడా వెరిఫైడ్ పేరు కనిపిస్తుంది. ఇది మొబైల్ కమ్యూనికేషన్‌ను మరింత సురక్షితంగా, పారదర్శకంగా చేస్తుంది.

సైలెంట్ కాల్స్ గురించి ప్రభుత్వ హెచ్చరిక ఏమిటి?

CNAPతో పాటు టెలికాం శాఖ సైలెంట్ కాల్స్ కూడా గురించి హెచ్చరిక జారీ చేసింది. కాల్ తీసిన తర్వాత ఎవరూ మాట్లాడకపోతే అది మోసగాళ్లు నంబర్ యాక్టివ్‌గా ఉందేమో చెక్ చేసే ప్రయత్నం కావచ్చు. అలాంటి నంబర్లను వెంటనే బ్లాక్ చేయండి. అనుమానాస్పద నంబర్లను సంచార్ సాథీ పోర్టల్‌లో రిపోర్ట్ చేయండి.

Also Read: బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

CNAP సేవ ఉపయోగించడం తప్పనిసరి.. నిజమేనా?

4G లేదా అంతకంటే ఎక్కువ నెట్‌వర్క్‌లలో CNAP డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది. కానీ యూజర్లు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్ (CLIR) ఆప్షన్ ఆన్ చేసినవారి పేరు మాత్రం ఇతరులకు కనిపించదు. ఈ సర్వీస్ తప్పనిసరి కాదు. కానీ యూజర్ల భద్రత దృష్ట్యా ఉపయోగించాలని ప్రభుత్వం సూచిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో CNAP ఎప్పుడు?

బీఎస్‌ఎన్‌ఎల్ అయోధ్య సర్కిల్ జనరల్ మేనేజర్ జ్ఞానేంద్ర కుమార్ ద్వివేదీ ట్రాయ్ ఆదేశం వచ్చిందని, త్వరలోనే బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు కాలర్ ఐడీ సేవ అందుబాటులోకి వస్తుందని ధృవీకరించారు.

CNAP ఎందుకు ముఖ్యం?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. CNAP తెలియని కాల్స్ పట్ల భయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వెరిఫైడ్ పేర్లు చూపించడం వల్ల కాలింగ్ మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మారుతుంది. దేశవ్యాప్తంగా ఈ సర్వీస్ విస్తరిస్తే, భారత్‌లో మొబైల్ యూజర్లు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా స్పందిస్తారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×