E-Paper
Advertisement

కలా? నిజమా? రూ.1699కే టైప్-సి ఛార్జింగ్, 55 రోజుల బ్యాటరీ లైఫ్‌తో క్రేజీ ఫోన్ లాంచ్!

కలా? నిజమా? రూ.1699కే టైప్-సి ఛార్జింగ్, 55 రోజుల బ్యాటరీ లైఫ్‌తో క్రేజీ ఫోన్ లాంచ్!
Advertisement

itel Power 451: అత్యంత చౌకైన ధరలో మొబైల్స్ అందించే ప్రముఖ బ్రాండ్ ఐటెల్ (itel). ఇప్పుడీ కంపెనీ భారత మార్కెట్లోకి మరో సరికొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. itel Power 451 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ కేవలం రూ.1,699 ధరలోనే లభిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి, అలాగే సెకండరీ ఫోన్ వాడాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఈ కీప్యాడ్ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లను జోడించింది కంపెనీ.

సాధారణంగా ఫీచర్ ఫోన్లలో కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నోయిస్ ఎక్కువగా వస్తుంటుంది. కానీ ఐటెల్ పవర్ 451 ఫోన్‌లో దేశంలోనే మొదటిసారిగా ‘ఏఐ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్’ (AI ENC) టెక్నాలజీని పరిచయం చేశారు. దీంతో మనం ట్రాఫిక్‌లో లేదా మార్కెట్ లాంటి రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడా చుట్టుపక్కల వచ్చే సౌండ్ ఏమీ వినబడకుండా, అవతలి వ్యక్తితో చాలా స్పష్టంగా మాట్లాడవచ్చు.

Advertisement

Also Read: శాంసంగ్ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్.. Samsung Galaxy S24 ధర ఊహించని విధంగా తగ్గింది!

ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దీనిలో 2,500mAh బ్యాటరీని అందించారు. దీనివల్ల ప్రతిరోజూ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు. పైగా ఇందులో ఉండే ‘సూపర్ బ్యాటరీ మోడ్’ ద్వారా ఏకంగా 55 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా పాతకాలపు మైక్రో యూఎస్‌బీ కాకుండా, ఇప్పుడు వస్తున్న స్మార్ట్‌ఫోన్ల లాగే దీనికి కూడా టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం ఒక పెద్ద ప్లస్ పాయింట్.

Advertisement

itel Power 451 ఫోన్‌ 2.4 ఇంచుల డిస్‌ప్లేతో వస్తుంది. బ్లూ, గ్రీన్, పర్పుల్, బ్లాక్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. దీంట్లో వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్ రేడియోతో పాటు రికార్డింగ్ సదుపాయం, ఆటో కాల్ రికార్డింగ్, బ్లూటూత్ సపోర్ట్, వీజీఏ రేర్ కెమెరా, కింగ్ వాయిస్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 10 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అలాగే మెమొరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు.

కేవలం రూ.1,699కే లభిస్తున్న ఈ itel Power 451 ఫోన్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రీటైల్ స్టోర్లలో నేరుగా కొనుగోలు చేయవచ్చు. వినియోగదారుల నమ్మకం కోసం ఈ ఫోన్ హార్డ్‌వేర్‌లో ఏదైనా సమస్య వస్తే ఒక ఏడాది పాటు కౌంటర్ రీప్లేస్‌మెంట్ వారంటీని కూడా ఇస్తున్నారు. అంతేకాదు.. ఫోన్ బాక్స్‌తో పాటే ఉచితంగా ఒక ప్రొటెక్టివ్ బ్యాక్ కవర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

Also Read: ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ అవ్వడానికి ఈ 4 తప్పులే కారణం.. ఐదు నిమిషాల్లో ఫిక్స్ చేసుకోండిలా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×