E-Paper
Advertisement

ఎస్సీఈఆర్టీ కీలక ఉత్తర్వులు.. టీచర్లకు స్పెషల్ వర్క్‌షాప్.. ఎందుకంటే?

ఎస్సీఈఆర్టీ కీలక ఉత్తర్వులు.. టీచర్లకు స్పెషల్ వర్క్‌షాప్.. ఎందుకంటే?
Advertisement

Telangana SCERT: తెలంగాణలో ఉపాధ్యాయ శిక్షణ కరదీపికలు, ట్రైనర్స్ ప్యాకేజీల తయారీ కోసం ఈనెల 29 నుంచి జూలై 1 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డీ వేదికగా ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌నకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఎంపిక చేసిన రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్స్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు హాజరుకావాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Also Read: సింగపూర్ ‘వధువు’.. హైదరాబాద్ ‘వరుడు’.. కట్ చేస్తే రూ.కోటిన్నర హాంఫట్!

Advertisement

తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఉర్దూ, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగాలకు చెందిన నిపుణులను ఇందుకోసం నియమించినట్లు పేర్కొన్నారు. సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు తమ జిల్లాల పరిధిలోని రిసోర్స్ పర్సన్లను తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఎంపికైన ప్రతినిధులు జూన్ 29వ తేదీ ఉదయం 9 గంటల కల్లా తమ సొంత ల్యాప్‌టాప్‌లతో వర్క్‌షాప్‌నకు తప్పనిసరిగా హాజరుకావాలని డైరెక్టర్ స్పష్టం చేశారు.

Also Read: అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×