E-Paper
Advertisement

ఐకూ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఐకూ 16 అల్ట్రా రావడం లేదు, ఎందుకో తెలుసా?

ఐకూ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఐకూ 16 అల్ట్రా రావడం లేదు, ఎందుకో తెలుసా?
Advertisement

iQOO 16 Series: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు, ముఖ్యంగా ఐకూ అభిమానులకు ఒక నిరాశపరిచే వార్త బయటకు వచ్చింది. ఈ ఏడాది మార్కెట్లోకి రాబోయే ఐకూ 16 సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన ‘ఐకూ 16 అల్ట్రా’ మోడల్ ఉండకపోవచ్చని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఐకూ 15 అల్ట్రాకు సీక్వెల్‌గా ఇది వస్తుందని అందరూ భావించినప్పటికీ.. కంపెనీ మాత్రం తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

కారణం ఇదేనట:

సాధారణంగా అన్ని కంపెనీలు ప్రతి ఏటా తమ అప్‌గ్రేడెడ్ మోడళ్లను రిలీజ్ చేస్తుంటాయి. కానీ, ఐకూ సంస్థ మాత్రం కేవలం సాంకేతిక పరంగా లేదా హార్డ్‌వేర్ పరంగా విప్లవాత్మక మార్పులు, సరికొత్త ఆవిష్కరణలు ఉన్నప్పుడే ‘అల్ట్రా’ వేరియంట్‌ను తీసుకురావాలని అంతర్గతంగా నిర్ణయించుకుందట. ఊరికే పేరు మార్చి ప్రతి సంవత్సరం అల్ట్రా ఫోన్లను విడుదల చేయడం కంపెనీకి ఇష్టం లేదని, అందుకే ఈ తరం సిరీస్‌లో అల్ట్రా మోడల్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: ఆఫర్ల వేట షురూ.. వన్‌ప్లస్ కొత్త టాబ్లెట్ కొంటే.. రూ.5,499 విలువైన గిఫ్ట్ ఉచితం!

రేసులో నిలిచే ఐకూ 16:

అల్ట్రా మోడల్ లేకపోయినా.. స్టాండర్డ్ ఐకూ 16 మోడల్‌ను సెప్టెంబర్ నాటికల్లా లాంచ్ చేయడానికి కంపెనీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కొత్త లైనప్‌లో ఐకూ 16తో పాటు ఐకూ 16T మోడళ్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ రాబోయే సరికొత్త ఐకూ 16 ఫోన్ క్వాల్కమ్ కంపెనీకి చెందిన అప్‌కమింగ్ ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో’ చిప్‌సెట్‌తో పాటు ఏకంగా 8500mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో రాబోతున్నట్లు లీకులు చెబుతున్నాయి.

గత ఐకూ 15 అల్ట్రా ముచ్చట్లు:

Advertisement

ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనాలో విడుదలైన ఐకూ 15 అల్ట్రా బేస్ వేరియంట్ ధర దాదాపు మన కరెన్సీలో రూ.74,000గా ఉంది. దీనిలో 6.85 ఇంచుల 2K శాంం‌సంగ్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, వెనుక వైపు మూడు 50MP కెమెరాలు, 7400mAh బ్యాటరీ వంటి అత్యద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మరి అల్ట్రా ఫీచర్లను తలదన్నేలా రాబోయే ఐకూ 16 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Also Read: గూగుల్ సంచలన నిర్ణయం.. Pixel Watch 5లో ఆ మోడల్స్ తీసేస్తున్నారా? వివరాలు లీక్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×