E-Paper
Advertisement

హీరో మహేష్ బాబుకి భారీ షాక్..AMB తోపాటు మరో 5 థియేటర్ల పై భారీ వేటు!

హీరో మహేష్ బాబుకి భారీ షాక్..AMB తోపాటు మరో 5 థియేటర్ల పై భారీ వేటు!
Advertisement

Tollywood:సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఒకవైపు సినిమాలు.. మరొకవైపు వ్యాపారాలతో బిజీగా గడిపేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏఎంబి థియేటర్ తో పాటు మరికొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో తన బిజినెస్ ను సవ్యంగా కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాంటి ఈయనకు తాజాగా భారీ షాక్ తగిలింది. తన థియేటర్ ద్వారా ప్రజలకు దక్కాల్సిన బెనిఫిట్స్ ను అందించకుండా నొక్కేసారనే నేపథ్యంలో GSTAT తీసుకున్న నిర్ణయం మహేష్ బాబుకు భారీ షాక్ కలిగించింది అని చెప్పాలి.

మహేష్ బాబుకి భారీ షాక్..

అసలు విషయంలోకి వెళ్తే.. ముఖ్యంగా మూవీ టికెట్లపై జీఎస్టీ రేట్లు తగ్గించినా.. ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు వర్తింప చేయకుండా లాభ పడినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏ ఎం బి సినిమాస్ తో పాటు తెలంగాణలోని ఏకంగా 5 థియేటర్లపై వస్తు సేవల పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (GSTAT) ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జీఎస్టీ చట్టంలోని యాంటీ ప్రాఫిటీరింగ్ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో మొత్తం 6 థియేటర్లకు గానూ రూ.1.7 కోట్లను వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలి అంటూ థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించింది.

ప్రజలకు దక్కాల్సిన బెనిఫిట్స్ ఎక్కడ?

Advertisement

ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఇంత పెద్ద మొత్తాన్ని జరిమానాగా విధించడం వెనుక కారణాల విషయానికి వస్తే.. 2019 జనవరి 1 నుంచి మూవీ టికెట్లపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే. అయితే సదరు థియేటర్లు మాత్రం బేస్ టికెట్ ధరలను పెంచి.. తుది ధరను యధాతధంగా ఉంచాయి. దీంతో ప్రేక్షకులకు దక్కాల్సిన లాభాలు థియేటర్లే పొందుతున్నాయని జిఎస్టిఏటి నిర్ధారించింది. అయితే ఇదే సమయంలో ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని చెప్పిన ఏఎంబీ వాదనలను కూడా జిఎస్టిఏటి తోసిపుచ్చింది.

also read:రామాయణ ట్రైలర్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్..ఇండియాలో మాత్రం కాదండోయ్!

ఏఎంబి వాదనలను తోసిపుచ్చిన జీఎస్టీఏటి..

Advertisement

ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉన్నా… కేంద్ర జిఎస్టి నిబంధనల నుంచి మినహాయింపు ఎప్పటికీ లభించదు అని మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏఎంబి సినిమాస్ వాటాగా రూ.1.7కోట్లలో ప్రస్తుతం రూ.35 లక్షలు సంక్షేమ నిధికి జమ చేయాలి అని జిఎస్టిఏటి ఆదేశాలు జారీ చేసింది అలాగే నిబంధనలను ఉల్లంఘించినందుకు జ్యోతి థియేటర్, భ్రమరాంబ సినిమాస్, కుమార్ 70mm, విశ్వనాథ 70mm, ఏ ఎస్ ఆర్ సినిమా థియేటర్లకు జూన్ 28 2019 నుంచి 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

మొత్తం జరిమానా ఎంతంటే?

ఈ మేరకు ఏఎంబి సినిమాస్ రూ.35 లక్షలు , జ్యోతి థియేటర్ రూ.19.8 లక్షలు, భ్రమరాంబ సినిమాస్ రూ.11.8 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. ఏఎస్ఆర్ సినిమా రూ.9.6 లక్షలు , కుమార్ 70 ఎంఎం రూ. 2.5 లక్షలు. విశ్వనాథ్ సినిమా రూ.9లక్షల తో పాటూ 18% వడ్డీతో కలిపి ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ఉల్లంఘనలు జనవరి 1 2020 కంటే ముందే జరిగినందున సాంకేతిక కారణాల వల్ల థియేటర్ లపై ఎలాంటి అదనపు జరిమాణాలు విధించలేదు. ఏది ఏమైనా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×