E-Paper
Advertisement

IPhone 18 Pro Mobile: ఐఫోన్ 18 ప్రో డిజైన్ లీక్, వారెవ్వా.. ఫీచర్లు, కెమెరా గురించి తెలిస్తే మీ మతిపోతుంది !

IPhone 18 Pro Mobile: ఐఫోన్ 18 ప్రో డిజైన్ లీక్, వారెవ్వా.. ఫీచర్లు, కెమెరా గురించి తెలిస్తే మీ మతిపోతుంది !
Advertisement

IPhone 18 Pro Mobile: ఆపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే iPhone 18 Pro గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. సాధారణంగా ఆపిల్ తన ఐఫోన్లలో చేసే మార్పులు ప్రస్తుత ప్రపంచంలో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తాయి. రాబోయే ఐఫోన్ 18 ప్రో మోడల్‌లో డిజైన్ పరంగా.. కెమెరా పరంగా ఊహించని మార్పులు ఉండబోతున్నాయని సమాచారం. ఈ సారి ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిజైన్ మార్పులు, కెమెరా అప్‌గ్రేడ్స్, లాంచ్ డేట్ వివరాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IPhone 18 Pro ఎలా ఉండబోతోంది ?

Advertisement

1. డిజైన్ మార్పులు:
ఐఫోన్ 18 ప్రోలో యాపిల్ తన డిజైన్ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.

అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడీ: డైనమిక్ ఐలాండ్ స్థానంలో స్క్రీన్ లోపలే ఫేస్ ఐడీ సెన్సార్లను అమర్చే దిశగా యాపిల్ అడుగులు వేస్తోంది. దీని వల్ల డిస్‌ప్లే మరింత పెద్దదిగా, అందంగా కనిపిస్తుంది.

Advertisement

బటన్-లెస్ డిజైన్: గత కొన్ని కాలంగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. బటన్లకు బదులుగా ‘హ్యాప్టిక్ టచ్’ బటన్లను ఈ ఫోన్‌ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కొత్త టైటానియం ఫినిషింగ్: ఐఫోన్ 15 ప్రోలో పరిచయం చేసిన టైటానియం ఫ్రేమ్‌ను మరింత దృఢంగా.. స్క్రాచ్-రెసిస్టెంట్ కోటింగ్‌తో అప్‌గ్రేడ్ చేయనున్నారు.

2. కెమెరా :
ఐఫోన్ 18 ప్రోలో కెమెరా అత్యంత ఆకర్షణీయంగా ఉండబోతోంది.

వేరియబుల్ అపెర్చర్ : ప్రొఫెషనల్ కెమెరాల తరహాలో కాంతికి అనుగుణంగా లెన్స్ అపెర్చర్‌ను మార్చుకునే వెసులుబాటును యాపిల్ తీసుకురానుంది.దీని వల్ల తక్కువ కాంతిలో అద్భుతమైన ఫోటోలు,స్పెషల్ ఎఫెక్ట్‌తో కూడిన వీడియోలు తీసుకోవచ్చు.

పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్: జూమింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు 10x ఆప్టికల్ జూమ్ లెన్స్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

48MP అల్ట్రావైడ్ & టెలిఫోటో: కేవలం మెయిన్ కెమెరానే కాకుండా.. మిగిలిన రెండు కెమెరాలను కూడా 48 మెగాపిక్సెల్‌కు పెంచి, రిజల్యూషన్‌లో రాజీ లేకుండా ఫోటోలు తీసేలా మార్పులు చేయనున్నారు.

3. పర్ఫార్మెన్స్ & చిప్‌సెట్:
ఐఫోన్ 18 ప్రోలో A20 ప్రో చిప్‌సెట్ ఉండబోతోంది. ఇది 2-నానోమీటర్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. దీని వల్ల ఫోన్ వేగం పెరగడమే కాకుండా.. బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఈ చిప్‌సెట్‌తో మరింత వేగంగా పనిచేస్తాయి.

Also Read: రఫ్ అండ్ టఫ్ కావాలా ? క్లాసీ లుక్ కావాలా? రెండూ కలిసిన ఉన్న కాసియో బెస్ట్ వాచ్‌లు ఇవే!

4. ఎక్స్‌పెక్టెడ్ లాంచ్ డేట్ :
ఆపిల్ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో కొత్త ఐఫోన్లను విడుదల చేస్తుంది.

లాంచ్ తేదీ: సెప్టెంబర్ 2026 మధ్య వారంలో ఐఫోన్ 18 సిరీస్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

విడుదల: ప్రకటన వెలువడిన 10 రోజుల్లోనే గ్లోబల్ మార్కెట్లోకి, అదే సమయంలో ఇండియాలోకి కూడా అందుబాటులోకి వస్తుంది.

ఐఫోన్ 18 ప్రో కేవలం ఒక స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదు.. అదొక పవర్‌ఫుల్ కంప్యూటింగ్ డివైజ్. ముఖ్యంగా కెమెరాలో రాబోతున్న ‘వేరియబుల్ అపెర్చర్’ టెక్నాలజీ మొబైల్ ఫోటోగ్రఫీని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తుంది. అయితే.. ఇవన్నీ ప్రస్తుతం అందుతున్న అంచనాలు మాత్రమే. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×