E-Paper
Advertisement

Phone Tapping case: రేపు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ.. ఆ తర్వాత ఏం జరుగుతోంది..?

Phone Tapping case: రేపు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ.. ఆ తర్వాత ఏం జరుగుతోంది..?
Advertisement

Phone Tapping case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ నేటితో ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితో గత వారం రోజులుగా ప్రత్యేక విచారణ బృందం (SIT) ఆయనను సుదీర్ఘంగా విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో.. సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సీట్ అధికారులు సిద్ధం చేశారు.

విచారణకు సహకరించిన ప్రభాకర్ రావు

Advertisement

గత ఏడు రోజులుగా జరిగిన విచారణలో ప్రభాకర్ రావు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? డేటా ధ్వంసం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అనే కోణంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణ ప్రక్రియను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సీట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సీపీ, కేసు పురోగతిపై చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను నివేదికలో పొందుపరిచారు.

రేపు సుప్రీంకోర్టులో విచారణ

Advertisement

ఈ కేసు రేపు (శుక్రవారం) సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాలు, సేకరించిన ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సీట్ బృందం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుంది. ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ముందుకు వెళ్లే వ్యూహం

ప్రభాకర్ రావుకు గతంలో ఉన్న ముందస్తు ఉపశమనాన్ని రద్దు చేయాలని పోలీసులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఆయన విచారణకు సహకరిస్తున్నప్పటికీ, కేసు తీవ్రత దృష్ట్యా కస్టడీ కొనసాగింపు లేదా అరెస్ట్ వంటి చర్యలకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరే అవకాశం ఉంది. రేపు సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రాతిపదికన సీట్ బృందం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ తీర్పుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ALSO READ: Pawan Kalyan – Sujeeth: సుజీత్ కు పవన్ కళ్యాణ్ కారు ఇవ్వడానికి ఇదే కారణం, సినిమా కోసం సుజీత్ అంతకు తెగించాడా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×