E-Paper
Advertisement

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది మావా.. ఏఐ ఫీచర్లు, ధర, లాంచ్ డేట్ వివరాలు ఇవిగో!

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది మావా.. ఏఐ ఫీచర్లు, ధర, లాంచ్ డేట్ వివరాలు ఇవిగో!
Advertisement

iPhone 18 Pro: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ బ్రాండ్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన మేక్‌బుక్ నియో, ఐఫోన్ 17e విడుదల తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి ఐఫోన్ 18 సిరీస్‌పై పడింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో iPhone 18 Pro, Pro Maxతో పాటు మొదటిసారిగా iPhone Fold కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు టెక్ నిపుణులు. ముఖ్యంగా ఐఫోన్ 18 ప్రో మోడల్ గతంలో కంటే మెరుగైన టెక్నాలజీతో ఆకట్టుకోనుంది.

కీలక స్పెసిఫికేషన్లు..

సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న iPhone 18 Pro శక్తివంతమైన ఏ20 ప్రో చిప్‌సెట్‌తో రాబోతోంది. దీనివల్ల ఫోన్ వేగం పెరగడమే కాకుండా మల్టీటాస్కింగ్ చాలా సులభమవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 5100mAh బ్యాటరీని అమర్చారు. ఇది 40W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో ఎలాంటి ఛార్జింగ్ సమస్య లేకుండా రోజంతా వాడుకోవచ్చు. అలాగే ఇది సరికొత్త ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. iPhone 18 Proలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లు హైలైట్‌గా నిలవనున్నాయి.

Advertisement

Also Read: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 ఐఫోన్లలో ఒకటి ‘మేడ్ ఇన్ ఇండియా’.. మార్కెట్లో 25% వాటా మనదే!

అద్భుతమైన కెమెరా సెటప్..

ఫొటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం యాపిల్ భారీ మార్పులు చేస్తోంది. వెనుక వైపు మూడు 48MP కెమెరాలు ఉండనున్నాయి. మెయిన్ కెమెరాతో పాటు అల్ట్రా వైడ్, పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ అన్నీ 48MP సామర్థ్యంతో వస్తుండటం విశేషం. ఇకపోతే సెల్ఫీల కోసం ముందు భాగంలో 18MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు చీకటిలో కూడా స్పష్టమైన ఫొటోలు తీసేలా కెమెరా సెన్సార్లను మెరుగుపరిచారు.

ధర వివరాలు..

Advertisement

సెప్టెంబరు 3 నుండి 10వ తేదీ మధ్యలో ఈ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో 256GB వేరియంట్ ధర సుమారు రూ.1,44,900 వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఇవి కేవలం అంచనాలు మాత్రమే. కాబట్టి.. యాపిల్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: ఈ ఇండక్షన్ స్టవ్ మీ ఇంట్లో ఉంటే.. ‘గ్యాస్’ కష్టాలే ఉండవ్, వెంటనే కొనేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×