// // Mouli Movie: పాన్ ఇండియా బ్యానర్లో మౌళి నెక్స్ట్ సినిమా!.. -->
E-Paper
Advertisement

Mouli Movie: పాన్ ఇండియా బ్యానర్లో ‘లిటిల్ హార్ట్స్’ మౌళి నెక్స్ట్ సినిమా!.. దర్శకుడు ఎవరంటే?

Mouli Movie: పాన్ ఇండియా బ్యానర్లో ‘లిటిల్ హార్ట్స్’ మౌళి నెక్స్ట్ సినిమా!.. దర్శకుడు ఎవరంటే?
Advertisement

Mouli Movie: యూట్యూబ్ సెన్సేషన్, నటుడు దర్శకుడు మౌళి తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది. ఈ సినిమా ద్వారా మురళి అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ఇది ఒక వినూత్నమైన క్రైమ్ కామెడీ అని సమాచారం. మౌళి మార్క్ కామెడీకి, క్రైమ్ ఎలిమెంట్స్ తోడైతే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నారు. డెబ్యూటెంట్ దర్శకుడు మురళి ఈ కథను సిద్ధం చేశారు. క్రైమ్ కామెడీ జానర్‌లో కొత్త తరహా ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో, ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మౌళి తనదైన శైలిలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ సినిమాల్లో రాణిస్తున్న వేళ, ఈ క్రైమ్ కామెడీ ఆయన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read also-Aura of Ustaad: పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆ సాంగ్ అసలు లేదా?

Advertisement

మౌళి నటించిన గత చిత్రాలు తక్కువ బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఆయన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా దాదాపు రూ.40 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన సహజమైన నటన, కామెడీ టైమింగ్‌తో యువతలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రైమ్ కామెడీ సినిమా ఆయన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే లిటిల్ హార్స్ట్ విజయంతో మంచి జోష్ మీద ఉన్న మౌళి ఈ సార్ పాన్ ఇండియా నిర్మాతలతో ప్రాజెక్ట్ మొదలు పెట్టడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత మౌళి ఇప్పటి వరకూ సినిమా ప్రకటించలేదు ఈ సినిమా ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కామెడీ టైమింగ్ లో మంచి  ట్రెండ్ సెట్ చేసిన మౌళి రాబోయే సినిమాలకు బాగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read also-Devara 2 Shooting Update: దేవర 2 షూటింగ్ షురూ.. కిక్ ఇచ్చే మరో న్యూస్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×