E-Paper
Advertisement

యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. iPhone 18 Pro Max ఫీచర్స్ లీక్.. లుక్, కెమెరా నెక్ట్స్ లెవెల్ అంతే!

యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. iPhone 18 Pro Max ఫీచర్స్ లీక్.. లుక్, కెమెరా నెక్ట్స్ లెవెల్ అంతే!
Advertisement

iPhone 18 Pro Max: యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ కొత్త సిరీస్ లైనప్ సిద్ధమవుతోంది. ఈసారి రాబోయే iPhone 18 Pro Max మోడల్‌పై ఇప్పటికే టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈసారి బేస్ మోడల్ iPhone 18 కంటే ముందే Pro మోడల్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందనేది తాజా టాక్.

కొత్త రంగులు.. సరికొత్త లుక్:

iPhone 18 Pro Max డిజైన్ పరంగా మునుపటి మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ.. ఈసారి రంగుల విషయంలో యాపిల్ కొత్త ప్రయోగం చేస్తోంది. ముఖ్యంగా డార్క్ చెర్రీ కలర్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటు లైట్ బ్లూ, సిల్వర్, డార్క్ గ్రే రంగుల్లో ఇది లభించవచ్చు. అలాగే వెనుక వైపు టూటోన్ ఫినిషింగ్‌కు బదులుగా సింగిల్ టోన్ లుక్ ఇవ్వబోతున్నారు.

డిస్‌ప్లేలో క్రేజీ మార్పులు:

Advertisement

స్క్రీన్ సైజ్ ఎప్పటిలాగే 6.9 ఇంచులు ఉన్నప్పటికీ.. డిస్‌ప్లే పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని యాపిల్ దాదాపు 35 శాతం తగ్గించనుంది. దీనివల్ల యూజర్లకు స్క్రీన్ స్పేస్ మరింత ఎక్కువగా దొరుకుతుంది. కొత్త ఎల్‌టీపీఓ ప్లస్ (LTPO+) ప్యానెల్స్ వల్ల డిస్‌ప్లే క్వాలిటీ పెరగడమే కాకుండా బ్యాటరీ కూడా తక్కువగా ఖర్చవుతుంది.

Also Read: శాంసంగ్ మోస్ట్ పవర్‌ఫుల్ ఫోన్ తక్కువలో కావాలా? అయితే అమెజాన్‌లో ఈ ఆఫర్ చూస్తే ఎగిరి గంతేస్తారు!

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్:

Advertisement

ఈ ఫోన్‌లో యాపిల్ నెక్ట్స్ జనరేషన్ A20 Pro చిప్‌సెట్‌ను ఉపయోగించనుంది. ఇది మునుపటి కంటే 15 శాతం వేగంగా, 30 శాతం ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 5,100mAh నుండి 5,200mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని అందించబోతున్నారు. దీనివల్ల బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉండనుంది.

కెమెరాలో వేరియబుల్ అపెర్చర్:

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం యాపిల్ మెయిన్ కెమెరాలో వేరియబుల్ అపెర్చర్ ఫీచర్‌ను తెస్తోంది. దీని ద్వారా లైటింగ్‌ను బట్టి అపెర్చర్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిన్, అల్ట్రావైడ్, టెలిఫోటో కెమెరాలు మూడూ 48 మెగాపిక్సెల్ సెన్సార్లతోనే రానున్నాయి. తక్కువ వెలుతురులో కూడా ఇవి అద్భుతమైన ఫోటోలను అందిస్తాయి.

లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చు?

ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ iPhone 18 Pro Max ధర విషయానికొస్తే.. మునుపటి మోడల్స్ లాగే ఉండే ఛాన్స్ ఉంది. ఇండియాలో దీని ప్రారంభ ధర సుమారు రూ.1,49,900 వరకు ఉండవచ్చని అంచనా.

Also Read: ఎవరూ ఊహించని ఆఫర్.. ఏకంగా రూ.20 వేలు తగ్గిన Galaxy S24 FE ధర.. ఎలా కొనాలంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×