E-Paper
Advertisement

భారత మార్కెట్ లోకి హ్యుందాయ్ కొత్త ఈవీ.. నెక్సాన్ ఈవీకి పోటీ తప్పదా?

భారత మార్కెట్ లోకి హ్యుందాయ్ కొత్త ఈవీ.. నెక్సాన్ ఈవీకి పోటీ తప్పదా?
Advertisement

Hyundai Upcomeing Compact Electric SUV: ఆటో దిగ్గజం హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని రెడీ చేస్తోంది. ఈ కొత్త EV ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడుతోంది. దేశీయంగా తయారు చేయబడే మోడల్ కావడంతో ధర కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ SUV మార్కెట్లోకి వచ్చిన తర్వాత టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO లాంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

రెండు ఈవీలను తీసుకురానున్నట్లు ప్రకటన

హ్యుందాయ్ ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు కొత్త SUVలను తీసుకురానున్నట్లు ప్రకటించింది. అందులో ఒకటి మిడ్‌ సైజ్ SUV కాగా, మరొకటి ఈ కొత్త కాంపాక్ట్ EV. కొత్త ఎలక్ట్రిక్ SUV ప్రస్తుతం HE1i అనే కోడ్‌ నేమ్‌ తో డెవలప్ చేస్తున్నారు. ఈ EV కోసం హ్యుందాయ్ కొత్త E-GMP(K) ప్లాట్‌ ఫారమ్‌ ను ఉపయోగించనుంది. ఇది కంపెనీ సరసమైన ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించిన లేటెస్ట్ ప్లాట్‌ ఫారమ్. ఇందులో 800V ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. దీని వల్ల తక్కువ సమయంలో బ్యాటరీ ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాట్‌ ఫారమ్ ప్రత్యేకత ఏమిటంటే, బ్యాటరీ ప్యాక్‌ ను కారు ఫ్లోర్ కింది భాగంలో అమర్చేలా డిజైన్ చేశారు. దీంతో క్యాబిన్‌ లో ఎక్కువ స్థలం లభించే అవకాశం ఉంది. కుటుంబ వినియోగానికి కూడా ఉపయోగకరంగా మారుతుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVని శ్రీపెరుంబుదూర్ ప్లాంట్‌ లో తయారు చేయనుంది. ఖర్చులను తగ్గించేందుకు ఎక్సైడ్‌తో కలిసి పనిచేయనుంది.

బ్యాటరీ, రేంజ్ గురించి..

Advertisement

బ్యాటరీ, రేంజ్ గురించి కంపెనీ ఇంకా అధికారిక వివరాలు ప్రకటించలేదు. యూరోప్ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఇన్‌ స్టర్ EV ఆధారంగా ఈ మోడల్ ఉండొచ్చని సమాచారం. ఇందులో 42kWh, 49kWh బ్యాటరీ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. స్టాండర్డ్ బ్యాటరీ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్ 355 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. సిటీ ప్రయాణాలతో పాటు హైవే డ్రైవింగ్‌కు కూడా సరిపడే రేంజ్‌ గా చెప్పొచ్చు.

అత్యాధునిక ఫీచర్లు

ఫీచర్ల పరంగా కూడా ఈ EV చాలా ప్రీమియంగా ఉండనుంది. ఇందులో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్‌ ప్లేలు, పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, OTA అప్‌ డేట్లు, లెవెల్ 2 ADAS లాంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు కూడా ఉంటాయి. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉండనున్నాయి.

ధర ఎంత ఉంటుందంటే?

Advertisement

ధర విషయానికి వస్తే, బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 10 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.14 నుంచి రూ. 15 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

Read Also: భారత మార్కెట్లోకి విన్‌ ఫాస్ట్ VF5 ఈవీ, టాటా పంచ్ ఈవీకి పోటీ తప్పదా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×