E-Paper
Advertisement

iPhone 18 Series: ఏం లుక్ మావా ఇది.. ఐఫోన్ 18 ప్రో బర్గండీ కలర్ లీక్, చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

iPhone 18 Series: ఏం లుక్ మావా ఇది.. ఐఫోన్ 18 ప్రో బర్గండీ కలర్ లీక్, చూస్తే కళ్లు తిప్పుకోలేరు!
Advertisement

iPhone 18 Series: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ప్రియులకు బిగ్ అప్డేట్. గతేడాది విడుదలైన iPhone 17 సిరీస్ తర్వాత.. ఇప్పుడు అందరి కళ్లూ iPhone 18 Pro, 18 Pro Maxపైనే ఉన్నాయి. సెప్టెంబర్‌ నెలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి యాపిల్ కేవలం ప్రో మోడల్స్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతోందని, సాధారణ iPhone 18 లాంచ్‌ను 2027కు వాయిదా వేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఇదే వేదికపై యాపిల్ తమ తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను కూడా పరిచయం అవకాశం ఉంది. దీంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

న్యూ డిజైన్‌తో ఆకట్టుకోనుంది:

ఇక డిజైన్ విషయానికి వస్తే.. iPhone 17 Pro తరహాలోనే అల్యూమినియం బాడీని యాపిల్ కొనసాగించేలా కనిపిస్తోంది. అయితే, వెనుక వైపు గ్లాస్ ఫినిషింగ్ విషయంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. డ్యూయల్ టోన్ డిజైన్ కాకుండా, ఒకే రకమైన గ్లాస్ ఫినిషింగ్‌ను పరిచయం చేయనుంది. అలాగే iPhone 18 Pro Max కొంచెం మందంగా ఉండే అవకాశం ఉంది. కలర్స్ విషయంలో యాపిల్ ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఈసారి బర్గండీ, పర్పుల్, కాఫీ బ్రౌన్ వంటి ఆకర్షణీయమైన షేడ్స్‌ను పరిశీలిస్తోంది. వీటిలో బర్గండీ కలర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

Also Read: మస్కిటో బ్యాట్‌ను టీవీ దగ్గర పెడుతున్నారా? అయితే, మీరు కొత్త టీవీ కొనుక్కోవాల్సిందే, ఎందుకంటే?

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్:

iPhone 18 Pro మోడల్ 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో, Pro Max వెర్షన్ 6.9 అంగుళాల భారీ స్క్రీన్‌తో రానున్నాయి. ఈ రెండూ 120Hz ప్రోమోషన్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. ఇక ఫోన్ స్పీడ్ కోసం దీనిలో సరికొత్త ఏ20 ప్రో చిప్‌ను వాడుతున్నారు. ఇది టీఎస్ఎమ్‌సీ 2ఎన్ఎమ్ ప్రాసెస్‌పై తయారవుతోంది. దీంతో ఫోన్ పనితీరు వేగంగా ఉండటమే కాకుండా బ్యాటరీ లైఫ్‌ కూడా ఎక్కువ సేపు వస్తుంది.

48 మెగాపిక్సల్ కెమెరా సెటప్:

Advertisement

ఫొటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం యాపిల్ దీనిలో 48 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్, టెలిఫోటో.. ఇలా మూడూ 48 మెగాపిక్సల్ సెన్సార్లతోనే రానున్నాయి. ముఖ్యంగా మెయిన్ కెమెరాలో వేరియబుల్ అపెర్చర్ ఫీచర్‌ను తీసుకురావడం వల్ల లైటింగ్‌ను బట్టి ఫొటోలను అద్భుతంగా క్లిక్ చేయొచ్చు. ఇక సెల్ఫీ కెమెరా కోసం డైనమిక్ ఐలాండ్ సైజును తగ్గించడం లేదా పూర్తిస్థాయిలో పంచ్ ‌హోల్ కెమెరాను అమర్చడం వంటి మార్పులు ఉండవచ్చని తాజా లీకులు చెబుతున్నాయి.

Also Read: సిగ్నల్ లేకున్నా కాల్స్.. పిక్సెల్ రేంజ్ లుక్.. రూ.10వేల లోపే టెక్నో సరికొత్త స్మార్ట్‌ఫోన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×