E-Paper
Advertisement

kona venkat: డబ్బులు వెనకేశావా కోనా ?

kona venkat: డబ్బులు వెనకేశావా కోనా ?
Advertisement

kona venkat: కోన వెంకట్ ..డీ ,రెడీ ,దూకుడు వంటి సినిమాలతో కమర్షియల్ ఫార్ములాకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ స్టార్ రైటర్ తాజాగా ప్రొడ్యూస్ చేసిన సినిమా బ్యాండ్ మేళం.కోర్టు’ సినిమాతో ఆక‌ట్టుకొన్న జంట ఈ సినిమాలో మ‌ళ్లీ జ‌ట్టు కట్టగా లేటెస్ట్ గా థియేటర్ లలోకి వచ్చిన ఈ సినిమా వచ్చిన సంగతి తెల్సిందే.

also read:Top 10 Hill stations in India: సమ్మర్‌లో చిల్ అవ్వాలా? 2026లో మీరు మిస్ చేయకూడని 10 క్రేజీ హిల్ స్టేషన్లు ఇవే!

Advertisement

సినిమా ఆడకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు

ఇక కోన ఏకంగా ఈ సినిమా ఆడకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అంటూ నాని రేంజ్ లో బిల్డప్ ఇవ్వడంతో కొంపదీసి కోన హిట్ కొడతాడా ఏంటి అన్న డౌట్స్ కూడా వచ్చేశాయ్. ఆడియన్స్ మాత్రం అబ్బే అంత సీన్ లేదంటూ సినిమాని వచ్చిన దారిలోనే సాగనంపే పనిలో పడ్డారు.అయితే ‘కోర్టు’ సినిమా సక్సెస్ అయింది కదాని మళ్ళీ అదే కాంబోలో సినిమా అంటే సూపర్ హిట్ కొట్టొచ్చని ప్లాన్ వేసుకున్న కోన ,కథ కథనాల విషయంలో మాత్రం ఎలాంటి కేర్ తీసుకోలేదని సినిమా చూస్తేనే అర్థమవుతుంది.ముఖ్యంగా అవుట్ డేటెడ్ అయిపోయిన బోరింగ్ కామెడీ జోకుల వల్లే సినిమా మటాష్ అయిందన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయ్.

Advertisement

ఈ సినిమాకి మెయిన్ ప్రొడ్యూసర్..?

ఇక ఇదిలా ఉంటె ఈ సినిమాకి అసలు కోన మెయిన్ ప్రొడ్యూసర్ కాదట ,అవును .. దీనికి మ్యాంగో రామ్ బ్యాక్ ఎండ్ లో దాదాపు 5 కోట్లు పెట్టుబడి పెట్టాడని ,అయితే కోన తన అనుభవాన్ని అంతా రంగరించి కేవలం రెండు కోట్లలో సినిమాని చుట్టేసి మిగతా డబ్బు వెనకేశాడని ఇన్ సైడ్ టాక్.అయితే సినిమా ఇపుడు అడ్డంగా పోవడం, చీప్ గా చుట్టేశారన్న టాక్ రావడంతో ఫుల్ ఫైర్ మీద ఉన్నారట మ్యాంగో రామ్, ఇక తాజాగా  వీరి మధ్యలో ఉన్న ఈ ఇష్యూని క్లియర్ చేయడానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఎంట్రీ ఇచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతుంది. చూస్తుంటే మ్యాంగ్ రామ్ మిగతా మూడు కోట్లు ముట్ట చెప్పేదాకా ఈ వ్యవహారాన్ని అంటా ఈజీగా వదిలేలా  లేడన్న గుసగుసలు జోరుగా సాగుతున్నాయ్.

ఈ న్యూస్ పై కోన వారు ఎలా రియాక్ట్ అవుతారో

వాస్తవానికి సినిమా బాగుంటే ఇవన్ని లెక్కలోకి వచ్చేవి కావేమో..కాని సినిమా డిజాస్టర్ దిశగా సాగుతుండటంతో ఇలా బొక్కలన్ని బయటపడుతున్నాయన్న టాక్ వినిపిస్తుంది.మరి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ పై కోన వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి

also read:IPL Records: ఐపీఎల్ హిస్టరీని షేక్ చేసిన రికార్డులు.. ఇవి బ్రేక్ అవుతాయా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×