E-Paper
Advertisement

iPhone 17 Pro Floods: వరదలో కొట్టుకుపోయిన ఐఫోన్.. 3 రోజుల తరువాత బురదలో నుంచి తీయగా అందులో

iPhone 17 Pro Floods: వరదలో కొట్టుకుపోయిన ఐఫోన్.. 3 రోజుల తరువాత బురదలో నుంచి తీయగా అందులో
Advertisement

iPhone 17 Pro Floods| ఐఫోన్ అంటే మామూలు ఫోన్ కాదని ఇటీవలే జరిగిన ఒక ఆసక్తికర ఘటన నిరూపించింది. తుఫాను ధాటికి భారీ వర్షపాతం జరిగి.. దాని వల్ల భయంకర వరదలు వచ్చాయి. ఈ వరదల్లో ఒక కొత్త ఐఫోన్ మోడల్ కొట్టుకుపోయింది. అయితే ఆ తరువాత ఒక అద్భుతం జరిగింది. ఆ కథ గురించి రెడ్డిట్ ప్లాట్‌ఫామ్‌లో ఒక యూజర్ షేర్ చేసుకున్నాడు.

రెడ్డిట్లో వెల్లడైన సంఘటన

ఒక రెడ్డిట్ యూజర్ తన ఐఫోన్ 17 ప్రో గురించి పోస్ట్ చేశారు. నెల రోజుల క్రితం కొత్త ఐఫోన్ 17 ప్రో మోడల్ ని కొనుగోలు చేసిన ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఈ యూజర్ నివసిస్తున్న ప్రాంతంలో టైఫూన్ కల్మేగి అనే భయంకర తుపాను వచ్చింది. ఆ తుపాను అతని ఐఫోన్ 17 ప్రో కొట్టుకుపోయింది. ఆ ఫోన్ బురదలో మూడు రోజుల పాటు పడి ఉండిపోయింది. ఆ తరువాత అనూహ్యంగా యూజర్ దాన్ని బురదలో చూసి ఎంతో సంతోషించాడు. ఫోన్ బురద నుంచి బయటకు తీసి శుభ్రం చేశాడు. చాలా ఖరీదైన ఈ ఐఫోన్ తిరిగి సామాన్యంగా పనిచేయాలని అతను భగవంతుడిని ప్రార్థిస్తూ ఛార్జింగ్ కోసం పెట్టాడు.

తుపాను వల్ల భయంకర పరిస్థితులు

Advertisement

రెడ్డిట్ లో యూజర్ ఇలా వివరించాడు. టైఫూన్ తుపాను వల్ల భారీ నాశనం సంభవించింది. యూజర్ ఇల్లంతా నేలమట్టం అయింది. ” కూలిపోయిన ఇంటి కింద నుంచి నా ప్రాణాన్ని కాపాడుకుంటూ బయటికి వచ్చాను. అందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. ” అని రెడ్డిట్ పోస్ట్లో ఉంది. ‘ఆ భయంకర క్షణంలో, ఫోన్ నా జేబు నుంచి జారి వరద నీటిలోకి పడిపోయింది. ఆ సమయంలో, ఫోన్ గురించి ఆలోచించడానికి నాకు అవకాశం లేదు’ అని వివరించాడు.

మూడు రోజుల తర్వాత దొరికిన ఐఫోన్

టైఫూన్ తుపాను ప్రభావం కాస్త తగ్గిన తర్వాత, వరద నీటి లెవెల్స్ కూడా తగ్గాయి. ఆ తరువాత కూలిపోయిన ఇంట్లో ఏదైనా ఉపయోగపడే వస్తువుల కోసం యూజర్ వెతకడం ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా మూడు రోజుల తర్వాత, అతనికి బురదలో కూరుకుపోయిన అతని ఐఫోన్ కనిపించింది. అంతా చెత్తగా ఉంటుందని ఊహిస్తూ, యూజర్ దాన్ని శుభ్రం చేసి ఛార్జ్ చేయడానికి ప్లగ్ చేశారు. అంతే ఫోన్ ఒక్కసారిగా ఛార్జ్ కావడం ప్రారంభించింది. ఫోన్ ఛార్జింగ్ అయిన తరువాత తక్షణం ఆన్ అయ్యింది. ఫోన్ ఏ విధంగానూ డ్యామేజ్ కాలేదు. ఫోన్ పనితీరులో సమస్యలు ఏమీ కన్పించలేదు.

ఐఫోన్ 17 ప్రో మన్నిక ఎలాంటిది?

Advertisement

ఐఫోన్ 17 ప్రోకు IP68 రేటింగ్ ఉంది. దీని అర్థం అది నీరు, దుమ్ము ను తట్టుకునే భద్రతా ఫీచర్స్ తో రూపొందించబడింది. ఐఈసీ ప్రమాణం 60529 ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో.. 6 మీటర్ల లోతు వరకు నీటిలో 30 నిమిషాలు మునిగి ఉండగలదు. అయితే, నీటి నిరోధకత శాశ్వతంగా ఉండదు. సాధారణ తరుగుదల కారణంగా కాలక్రమేణా తగ్గవచ్చని ఆపిల్ సూచించింది. వాస్తవిక పరిస్థితులు నియంత్రిత ల్యాబ్ పరీక్షలకు భిన్నంగా ఉంటాయి కాబట్టి, ఫోన్ లో ద్రవ నష్టానికి వారంటీ కవరేజీలో ఉండదు.

అయితే ఆపిల్ ప్రకటించిన భద్రతా ఫీచర్స్ కంటే ఇప్పుడు తుపాను వరదలో మునిగిన ఐఫోన్ మరింత ఎక్కువ భయంకర వాతావరణాన్ని తట్టకోగలదని నిరూపితమైంది.

Also Read: మానవుల ఆదేశాలను ధిక్కరించిన ఏఐ మోడల్స్.. తిరుగుబాటు ప్రారంభమేనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×