E-Paper
Advertisement

iPhone 17 Pro కొనాలనుకుంటున్నారా? భారీగా ధర తగ్గింది, ఇలా కొట్టేయండి బాస్!

iPhone 17 Pro కొనాలనుకుంటున్నారా? భారీగా ధర తగ్గింది, ఇలా కొట్టేయండి బాస్!
Advertisement

iPhone 17 Pro Price Drop: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్స్ బ్రాండ్స్ అంటే నచ్చని వాళ్లంటూ ఎవరూ ఉండరు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలన్నది చాలామంది డ్రీమ్ కూడా. అలాంటి వారి కోసం యాపిల్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఎప్పటినుంచో లేటెస్ట్ iPhone 17 Proని చేతిలో పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. మీకు మంచి టైమ్ వచ్చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఫోన్‌పై ఏకంగా రూ.8,610 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు సేవ్ చేస్తూ.. స్టైలిష్ ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే కరెక్ట్ ఛాన్స్.

డిజైన్‌కు ఫిదా అవ్వాల్సిందే..

ఈసారి iPhone 17 Pro డిజైన్ విషయంలో యాపిల్ అస్సలు తగ్గలేదు. ఫోన్ చుట్టూ ఉండే అంచులను చాలా సన్నగా మార్చేసింది. దీనివల్ల స్క్రీన్ పెద్దగా, చూడటానికి చాలా రిచ్‌గా కనిపిస్తుంది. టైటానియం ఫినిషింగ్‌తో ఫోన్ చేతిలో పట్టుకుంటే ఆ గ్రిప్పే వేరు. ఇక వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా ఆ క్లారిటీ చూసి మురిసిపోవాల్సిందే.

ఆకట్టుకుంటున్న ఏఐ ఫీచర్లు..

Advertisement

ఐఫోన్ అంటేనే స్పీడ్.. మరి 17 ప్రో గురించి చెప్పాలా? ఇందులో వాడిన లేటెస్ట్ చిప్‌సెట్ వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఎన్ని యాప్స్ వాడినా స్మూత్‌గా రన్ అవుతుంది. పైగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నఆపిల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే బ్యాటరీ కూడా గట్టిగానే వస్తుంది కాబట్టి.. ఛార్జింగ్ అయిపోతుందని టెన్షన్ ఉండదు.

Also Read: రూ.10,000 లోపు బ్రాండెడ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఐదు మోడల్స్ ఫీచర్లు తెలిస్తే వావ్ అంటారు!

అద్భుతమైన కెమెరా సెటప్..

Advertisement

చీకటిలో కూడా పగలు తీసినట్టుగా ఫొటోలు కావాలనుకుంటే ఐఫోన్ 17 ప్రో బెస్ట్ ఆప్షన్. ఏదైనా ఫంక్షన్లలో వీడియోలు తీయాలన్నా, సినిమా రేంజ్ షాట్స్ కావాలన్నా దీని కెమెరా సెటప్ అద్భుతంగా పనిచేస్తుంది. కొత్త టెలిఫోటో లెన్స్‌తో దూరాన ఉన్నవాటిని కూడా చాలా క్లియర్‌గా క్లిక్ మనిపించవచ్చు. కాబట్టి.. ఇక ఫొటోగ్రాఫర్ అవసరం లేదన్నమాట.

ఈ ఆఫర్‌ను పొందడమెలా?

ఈ రూ.8,610 తగ్గింపు అనేది మెయిన్‌గా బ్యాంక్ ఆఫర్ల ద్వారా అందుబాటులో ఉంది. మీ దగ్గర HDFC లేదా ICICI లాంటి బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉంటే వెంటనే వాడేయండి. ఒకవేళ మీ పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. ఈ డిస్కౌంట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. స్టాక్ అయిపోకముందే ఓ లుక్కేయండి మరి.

Also Read: ఫోన్ కొంటే ఇలాంటిదే కొనాలి బ్రో.. పవర్ బ్యాంక్ అవసరం లేని బ్యాటరీ.. డీఎస్ఎల్ఆర్ రేంజ్ కెమెరా!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×