E-Paper
Advertisement

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు ప్రోస్టేట్ క్యాన్సర్.. పుకార్లకు ఫుల్ స్టాప్!

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు ప్రోస్టేట్ క్యాన్సర్.. పుకార్లకు ఫుల్ స్టాప్!
Advertisement

Israel PM Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ప్రోస్టేట్ క్యాన్సర్‌ ఉందని గతంలో పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లపై నెతన్యాహూ క్లారిటీ ఇచ్చారు. తాను ప్రోస్టేట్ క్యాన్సర్ కు చికిత్స చేయించుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇరాన్‌తో యుద్ధం కారణంగా తన చికిత్స విషయాన్ని ముందుగా వెల్లడించలేదని ఆయన తెలిపారు. తొలిదశ ప్రోస్టేట్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు.

క్యాన్సర్ గడ్డ

“ఈ రోజు నా మెడికల్ రిపోర్ట్ పబ్లిష్ అయింది. యుద్ధం ఉద్ధృతంగా ఉన్న సమయంలో నివేదిక విడుదల కాకుండా చూశాం. ఇరాన్ ఉగ్రవాద పాలన ఇజ్రాయెల్‌పై మరింత తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయకుండా అడ్డుకునేందుకు, తన మెడికల్ రిపోర్టను రెండు నెలలు ఆలస్యం చేయాలని కోరాను” అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఎక్స్ వేదికగా తెలిపారు. ఏడాదిన్నర క్రితం ప్రోస్టేట్ గ్లాండ్ శస్త్రచికిత్స జరిగిందని నెతన్యాహూ తెలిపారు. అప్పటి నుంచి తాను వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పారు. ప్రోస్టేట్‌లో ఒక సెంటీమీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఒక చిన్న గడ్డను వైద్యులు కనుగొన్నారన్నారు. వైద్యులు పరీక్షించగా, అది క్యాన్సర్ కణితి తొలి దశ అని, ఎటువంటి వ్యాప్తి లేదా మెటాస్టేసిస్ లేదని తేలిందన్నారు.

ఇస్లామాబాద్ కు ఇరాన్ విదేశాంగ మంత్రి

Advertisement

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో నెతన్యాహూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏప్రిల్ 22న కాల్పుల విరమణ ముగియాల్సి ఉంది. అయితే శాంతి ఒప్పంద ప్రతిపాదనపై ఇరాన్ స్పందించడానికి కాల్పుల విరమణను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజులు పొడిగించారు. అమెరికా ప్రతినిధి బృందంతో రెండో విడత చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శుక్రవారం సాయంత్రం ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. దీంతో చర్చలు సజావుగా సాగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

Also Read: మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది.. ఇరాన్‌‌పై అమెరికా దాడి, రంగంలోకి బీ2 బాంబర్లు

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×