E-Paper
Advertisement

S26 Ultra vs iPhone camera: గెలాక్సీ S26 అల్ట్రా కంటే ఈ ఐఫోన్ బెటర్.. కెమెరా పరంగా ది బెస్ట్

S26 Ultra vs iPhone camera: గెలాక్సీ S26 అల్ట్రా కంటే ఈ ఐఫోన్ బెటర్.. కెమెరా పరంగా ది బెస్ట్
Advertisement

S26 Ultra vs iPhone camera| 2026లో కొరియా దిగ్గజ టెక్ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో కొత్త గెలాక్సీ S26 సిరీస్ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో హై ఎండ్ మోడల్ గెలాక్సీ S26 అల్ట్రా (Galaxy S26 Ultra). ఈ కొత్త మోడల్‌లో కెమెరా ఫీచర్లు గత ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌తో పోలిస్తే చాలా మెరుగుపడ్డాయి. కానీ ఇతర బ్రాండ్స్ ప్రీమియం ఫోన్ల కంటే ర్యాంకింగ్‌లో వెనకబడింది. లేటెస్ట్ కెమెరా బెంచ్‌మార్క్ రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్ కేవలం 157 పాయింట్లు సాధించింది. దీంతో ర్యాంకింగ్స్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ 18వ స్థానంలో నిలిచింది. ఆపిల్, గూగుల్ వంటి బ్రాండ్ల ఫోన్లు దీనికంటే ముందున్నాయి.

S26 అల్ట్రా కలర్ అక్యురసీ, ఇమేజ్ ప్రాసెసింగ్‌లో సూపర్

Galaxy S26 Ultra పాత మోడల్ S25 అల్ట్రాతో పోలిస్తే చాలా మెరుగుపడింది. కలర్ అక్యురసీ, స్కిన్ టోన్ రెండరింగ్ ఫీచర్స్ బాగున్నాయి. ఫోటోల్లో టెక్స్‌చర్ మరింత నేచురల్‌గా కనిపిస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్‌లో ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్స్ తగ్గాయి. పాత మోడల్స్‌లో ఎక్కువ షార్ప్‌నెస్ ఉండేది. ఇప్పుడు అలాంటి సమస్యలు తగ్గాయి. నైట్ ఫోటోగ్రఫీలో కూడా మెరుగుదల కనిపిస్తోంది. తక్కువ లైటింగ్‌లో కలర్ రెండరింగ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది.

హార్డ్‌వేర్ మార్పులతో లో-లైట్ పెర్ఫామెన్స్

Advertisement

శాంసంగ్ ఈ ఫ్లాగ్‌షిప్‌లో కొన్ని హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ చేసింది. మెయిన్ కెమెరా సెన్సార్‌కు వైడ్ అపర్చర్ సెట్ చేసింది. 5x టెలిఫోటో లెన్స్‌కు కూడా వైడ్ అపర్చర్ అప్‌గ్రేడ్ ఇచ్చారు. దీంతో ఎక్కువ లైటింగ్ సెన్సార్‌కు చేరుతుంది. డార్క్ కండిషన్స్‌లో ఇమేజ్ క్వాలిటీ మెరుగుపడింది. అడ్వాన్స్‌డ్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ ఉపయోగించారు. Pro Scaler టెక్నాలజీతో ఇమేజ్ డీటెయిల్స్ మెరుగుపడ్డాయి. చాలా కష్టమైన లైటింగ్‌లో కూడా ఫోటోలు క్లియర్‌గా వస్తాయి.

బలమైన జూమ్ పెర్ఫామెన్స్.. కానీ గ్యాప్ తగ్గుతోంది

జూమ్ పెర్ఫామెన్స్ Galaxy S26 Ultra బలమైన పాయింట్‌గా ఉంది. చాలా ఎక్కువ జూమ్ లెవల్స్‌లో బాగా పనిచేస్తుంది. టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం.. లాంగ్ డిస్టెన్స్ జూమ్‌లో iPhone 17 Pro కంటే మెరుగ్గా ఉంది. శాంసంగ్ జూమ్ కెపాసిటీకి ఎక్కువ ప్రధాన్యం ఇచ్చింది. అయితే ఆపిల్‌తో ఉన్న గ్యాప్ ఏటా తగ్గుతోంది. Apple కూడా ప్రతి సంవత్సరం జూమ్ టెక్నాలజీ మెరుగుపరుస్తోంది.

కెమెరా ర్యాంకింగ్‌లో తీవ్ర పోటీ

Advertisement

కెమెరా ఫీచర్స్ పరంగా మెరుగుదలలు ఉన్నప్పటికీ S26 అల్ట్రా కెమెరా టెస్ట్‌లలో వెనకబడింది. బెంచ్‌మార్క్ రిపోర్ట్‌లో 157 పాయింట్లు సాధించింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మోడల్‌కు 168 పాయింట్లు లభించాయి. ఆచర్యమేమిటంటే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ కూడా 161 పాయింట్లు సాధించింది. అలాగే గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL కూడా శాంసంగ్ S26 అల్ట్రా కంటే ముందుంది. లో-లైట్ ఫోటోగ్రఫీలో శాంసంగ్ ఇంకా వెనకబడి ఉంది.

లో-లైట్ పెర్ఫామెన్స్ ఇంకా మెరుగుపరచాలి

డార్క్ ఎన్విరాన్‌మెంట్‌లో Galaxy S26 Ultra బలహీనంగా ఉంది. ఫోటో, వీడియో క్వాలిటీ Apple Pro మోడల్స్ కంటే తక్కువగా ఉన్నాయి. చాలా డార్క్ లేదా కాంప్లెక్స్ HDR సీన్స్‌లో ఆటోఫోకస్ సమస్యలు ఉన్నాయి. ఫేస్ ఎక్స్‌పోజర్ కొన్నిసార్లు తక్కువగా వస్తుంది. పోర్ట్రెయిట్ షాట్స్‌లో ఫైన్ డీటెయిల్స్ కోల్పోతాయి.

పోర్ట్రెయిట్ మోడ్ పెర్ఫామెన్స్‌లో వెనుకంజ

పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీలో కూడా మెరుగుదల అవసరం. కలర్ పెర్ఫామెన్స్ మెరుగుపడింది. కానీ ఇమేజ్ క్లారిటీ, నాయిస్ కంట్రోల్ ఇతర ఫోన్ల కంటే తక్కువగా ఉన్నాయి. సబ్జెక్ట్ సెగ్మెంటేషన్ మరింత అక్యురేట్‌గా ఉండాలి. టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో పోర్ట్రెయిట్ పెర్ఫామెన్స్ బెటర్‌గా ఉంది.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

ఇతర ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లకు కూడా మంచి స్కోర్స్

స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని మోటోరోలా ఫ్లాగ్‌షిప్ మోడల్స్ 164 పాయింట్లు సాధించాయి. 2x, 3x జూమ్ ఫోటోగ్రఫీలో బాగా పనిచేస్తున్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×