E-Paper
Advertisement

iPhone 16e Price Drop: ఐఫోన్ 16eపై భారీ డిస్కౌంట్.. రూ.50000 కంటే తక్కువ.. ఎక్కడంటే

iPhone 16e Price Drop: ఐఫోన్ 16eపై భారీ డిస్కౌంట్.. రూ.50000 కంటే తక్కువ.. ఎక్కడంటే
Advertisement

iPhone 16e Discount| డిసెంబర్ 2025 దాదాపు ముగిసిపోతోంది. సంవత్సరం చివరి రోజుల్లో స్పెషల్ సేల్, స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ వస్తున్నాయి. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ లో అత్యంత తక్కువ ధర ఫోన్ ఐఫోన్ 16e. ఇప్పుడు ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరకు దొరుకుతోంది. ఈ ఫోన్ ఇంత తక్కువ ధరకు ఇదివరకు ఎప్పుడూ లభించలేదు. ఈ సడన్ ధర తగ్గింపు ఈ ఏడాది బెస్ట్ ఆపిల్ డీల్‌గా మారింది. ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లకు ఇది సరైన టైమ్. విజయ్ సేల్స్‌లో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వీటితో కలిపిన డీల్స్ ఎఫెక్టివ్ ధరను గణనీయంగా తగ్గిస్తాయి.

విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16e డీల్ వివరాలు

విజయ్ సేల్స్‌లో 128GB ఐఫోన్ 16e రూ.51,490కు లిస్ట్ అయింది. ఫిబ్రవరి 2025లో ఈ ఫోన్ రూ.59,900కు లాంచ్ అయింది. ఇప్పుడు రూ.8,000కు పైగా తక్కువ అయింది. ఈఎంఐ (ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్) ఆప్షన్ ఉంది. మినిమం ఈఎంఐ రూ.2,303 నుంచి ప్రారంభం. బడ్జెట్ యూజర్లకు మరింత అఫోర్డబుల్ అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు రూ.3,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ యాప్లై చేస్తే ఎఫెక్టివ్ ధర రూ.47,990కు వస్తుంది. లాంచ్ ధర కంటే దాదాపు రూ.11,910 తక్కువ అవుతుంది. కొత్త ఐఫోన్ మోడల్‌పై ఇంత పెద్ద డిస్కౌంట్ లభించడం అరుదు.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు ఏమిటి?

Advertisement

ఐఫోన్ 16eలో 6.1 అంగుళాల ఓఎల్‌ఇడీ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2532×1170 పిక్సెల్స్. ఆపిల్ ప్రకారం పీక్ బ్రైట్‌నెస్ 1200 నిట్స్ వరకు వస్తుంది. షార్ప్ విజువల్స్, ఎక్సలెంట్ కలర్ యాక్యురసీ ఇస్తుంది. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, డైలీ బ్రౌజింగ్‌కు బెస్ట్.

కెమెరా కెపాబిలిటీ

రియర్ (వెనుకవైపు) కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఎఫ్/1.6 అపర్చర్ లో లైట్ ఫోటోగ్రఫీకి బెటర్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఎఫ్/1.9 అపర్చర్ క్లియర్ ఇమేజెస్ ఇస్తుంది. రెండు కెమెరాలు హై క్వాలిటీ ఫోటోలు, స్టేబుల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.

పర్ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

Advertisement

ఇందులో ఆపిల్ A18 ప్రాసెసర్‌తో ఐఫోన్ 16eను పవర్ ఇస్తోంది. ఫాస్ట్ పర్ఫామెన్స్, ఇంప్రూవ్డ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇస్తుంది. డివైస్ iOS 26పై రన్ అవుతుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, లాంగ్ టర్మ్ అప్‌డేట్స్ దక్కుతాయి.

Also Read: 2025లో బెస్ట్ కెమెరా ఫోన్స్ ర్యాంకింగ్.. అగ్రస్థానం కోల్పోయిన ఐఫోన్‌.. టాప్ ఎవరంటే

ప్రొటెక్షన్, కనెక్టివిటీ ఏమిటి?

ఐఫోన్ 16eలో IP68 రేటింగ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. యాక్సిడెంటల్ స్ప్లాషెస్, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కనెక్టివిటీలో 5జీ సపోర్ట్, డ్యూయల్ సిమ్ ఉన్నాయి. వై-ఫై 6, బ్లూటూత్ 5.3 కూడా ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇప్పుడు ఐఫోన్ 16e కొనడం కరెక్టేనా?

ప్రస్తుత డీల్ ఐఫోన్ 16eను చాలా ఆకర్షణీయం చేస్తోంది. మోడర్న్ ఫీచర్లు, స్ట్రాంగ్ పర్ఫామెన్స్, ఆపిల్ రిలయబిలిటీ దక్కుతాయి. డిసెంబర్ డిస్కౌంట్ ఇప్పటివరకు లోయెస్ట్ ధర ఇస్తోంది. రూ.50,000 లోపు కొత్త ఐఫోన్ కావాలంటే ఇదే బెస్ట్ డీల్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×