E-Paper
Advertisement

iPhone 14 Plus Price Dropped: ఇదే మొదటిసారి.. ఐఫోన్ 14 ప్లస్‌పై మరీ ఇంత భారీ డిస్కౌంటా..? నమ్మలేకపోతున్నా..

iPhone 14 Plus Price Dropped: ఇదే మొదటిసారి.. ఐఫోన్ 14 ప్లస్‌పై మరీ ఇంత భారీ డిస్కౌంటా..? నమ్మలేకపోతున్నా..
Advertisement

iPhone 14 Plus Price Dropped: ఐఫోన్.. ఈ పేరు వినగానే అందరిలోనూ ఏదో తెలియని పులకరింత. అయితే ఈ ఫోన్‌ను కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ అధిక ధర కారణంగా తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు. ఎప్పుడైనా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌పార్మ్‌లలో ఐఫోన్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటే అప్పుడు కొనుక్కుందాంలే అని అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ డిస్కౌంట్ ఆఫర్లతో ఐఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14ప్లస్ ను డిస్కౌంట్‌లతో రూ.55 వేల కంటే తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అయితే ఈ ఫోన్ రూ.60 వేల కంటే తక్కువకు అందుబాటులోకి రావడం ఇదే ఫస్ట్ టైమ్ అనే చెప్పాలి. దీనిపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్ రూ.79,900లకి అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు దీనిపై 29 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ రూ.55,999లకే లిస్ట్ అయింది. అయితే ఇది 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. బ్యాంక్ కార్డుపై రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపుతో ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.54,999కి అందుబాటులో ఉంటుంది.

Also Read: బిగ్ అప్‌డేట్.. ఐఫోన్ 16 ప్లస్ ధర, ఫీచర్లు లీక్.. ఏముంది రా నాయనా!

Advertisement

అంతేకాకుండా ఐఫోన్ 12, ఐఫోన్ 13 వంటి పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.26,000 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే ఐఫోన్ 14 ప్లస్‌ను రూ.30,000 కంటే తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

ఇది ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. 6.7అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 1200 నీట్‌ల బ్రైట్‌నెస్ అందుబాటులో ఉంది. ఫోన్ వెనుకభాగంలో రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు, సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉన్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×