E-Paper
Advertisement

Private Bus Accident in Hyderabad: నార్సింగ్ ఓఆర్ఆర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా, ఒకరు మృతి..!

Private Bus Accident in Hyderabad: నార్సింగ్ ఓఆర్ఆర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా, ఒకరు మృతి..!
Advertisement

Private Bus overturns on ORR: హైదరాబాద్‌లో దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. నార్సింగి వద్ద ఓఆర్ఆర్‌పై ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కి చెందిన బస్సు ఆదివారం రాత్రి 9 గంటలకు గచ్చిబౌలిలో బయలుదేరింది. నార్సింగి నుంచి అలేఖ్య రైట్ టవర్స్ సమీపంలోని ఓఆర్ఆర్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బయలుదేరిన పావుగంటలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వర్షం పడింది. రోడ్డు అంతా తడిగా ఉంది. అయినా బస్సు మాత్రం 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని స్థానికులు చెబుతున్నమాట.

Advertisement

బస్సు మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి డివైడర్‌కు బలంగా ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒంగోలుకు చెందిన మమత అనే మహిళ మృతి చెందింది. మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా 197 వచ్చినట్టు తేలింది. డ్రైవర్ అతిగా మద్యం తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: చిరు- బండి సంజయ్ మధ్య చర్చ.. మీరొస్తే ప్రయార్టీ..

Advertisement

గాయపడిన ఇతర ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. రోడ్డుకు అడ్డంగా బస్సు బోల్తాపడడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×