E-Paper
Advertisement

Inverter Refrigerators: తక్కువ కరెంట్ వినియోగం, ఎక్కువ లైఫ్.. ఇన్‌వర్టర్ ఫ్రిజ్‌తో ఎన్ని లాభాలో

Inverter Refrigerators: తక్కువ కరెంట్ వినియోగం, ఎక్కువ లైఫ్.. ఇన్‌వర్టర్ ఫ్రిజ్‌తో ఎన్ని లాభాలో
Advertisement

Inverter Refrigerators| ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లు (ఫ్రిజ్‌లు) ఇప్పుడు స్టార్ట్ ఇళ్లకు మంచి ఆప్షన్. అడ్వాన్స్ కంప్రెసర్ టెక్నాలజీతో కరెంట్‌ బిల్లుని సమర్థవంతంగా ఆదా చేస్తాయి. సాధారణ రిఫ్రిజిరేటర్లలా ఆన్-ఆఫ్ కాకుండా కంప్రెసర్ స్పీడ్‌ను ఆటోమాటిక్‌గా సర్దుబాటు చేస్తాయి. ఇందులో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. సాధారణ రిఫ్రిజిరేటర్ల కంటే 30 నుంచి 50 శాతం వరకు విద్యుత్ తక్కువ వినియోగిస్తాయి. నెలవారీ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. స్థిరమైన కూలింగ్ వల్ల పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఆహారం క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది.

ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లు ఎలా పనిచేస్తాయి?

సాధారణ రిఫ్రిజిరేటర్లలో కంప్రెసర్ ఆన్-ఆఫ్‌గా పనిచేస్తుంది. దీంతో ఫ్రిజ్ లోపల టెంపరేచర్ ఆకస్మికంగా మారుతుంది. ఇన్వర్టర్ మోడల్స్‌లో వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ ఉంటుంది. కూలింగ్ అవసరం, బయటి ఉష్ణోగ్రత ఆధారంగా స్పీడ్ సర్దుబాటు అవుతుంది. దీంతో ఎనర్జీ వేస్ట్ తగ్గుతుంది. కూలింగ్ కెపాసిటీ మెరుగవుతుంది.

ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ల ముఖ్య ప్రయోజనాలు

Advertisement

ఎనర్జీ ఎఫిషియెన్సీ: 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. తక్కువ పవర్‌తో నిరంతరం పనిచేస్తాయి.
మెరుగైన కూలింగ్: లోపల ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
నిశ్శబ్దంగా పనిచేయడం: కంప్రెసర్ స్మూత్‌గా రన్ అవుతుంది. ఆన్-ఆఫ్ శబ్దాలు ఉండవు.
ఎక్కువ జీవితకాలం: కంప్రెసర్‌పై ఒత్తిడి తక్కువ. రిఫ్రిజిరేటర్ ఎక్కువ కాలం పాటు పనిచేస్తుంది. చాలా బ్రాండ్లు 10-20 సంవత్సరాల వారంటీ ఇస్తాయి.
స్టెబిలైజర్ అవసరం లేదు: వోల్టేజ్ హెచ్చుతగ్గుల్లో కూడా సురక్షితంగా పనిచేస్తాయి.

బెస్ట్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ ఆప్షన్లు

IFB 331L కన్వర్టిబుల్: పెద్ద కుటుంబాలకు (4-6 మంది) సరిపోతుంది. 12-ఇన్-1 మోడ్‌లు, వైఫై కంట్రోల్, మెటల్ బ్లాక్ డిజైన్ ఉన్నాయి.
Whirlpool 184L సింగిల్ డోర్: చిన్న కుటుంబాలకు (2-3 మంది) అనువైన మోడల్. ఇంటెలిసెన్స్ ఇన్వర్టర్, 5-స్టార్ రేటింగ్‌తో తక్కువ విద్యుత్ వాడతుంది.
Whirlpool 235L డబుల్ డోర్: మధ్య తరగతి కుటుంబాలకు బాగుంది. ఫ్రాస్ట్-ఫ్రీ, ఫాస్ట్ కూలింగ్, సులభ నిర్వహణ.
Samsung 183L సింగిల్ డోర్: స్టైలిష్ డిజైన్, డిజిటల్ ఇన్వర్టర్, బేస్ స్టాండ్ డ్రాయర్ ఉన్నాయి.
IFB 241L కన్వర్టిబుల్: మధ్యస్థ కుటుంబాలకు సరిపోతుంది. 10-ఇన్-1 మోడ్‌లు, 360° కూలింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
Voltas Beko 183L: బడ్జెట్ ఫ్రెండ్లీ, చిన్న కుటుంబాలు, బ్యాచిలర్లకు సరిపోతుంది. ఫ్రెష్ బాక్స్ టెక్నాలజీతో పండ్లు తాజాగా ఉంటాయి.
Midea 253L డబుల్ డోర్: రియల్ ఇన్వర్టర్ కంప్రెసర్, డియో ఫ్రెష్ టెక్నాలజీ, వోల్టేజ్ ఫ్లక్చువేషన్‌లో కూడా బాగా పనిచేస్తుంది.

Advertisement

Also Read: బ్యాటరీ లేకుండా నడిచే స్మార్ట్‌వాచ్.. ఎలా పని చేస్తుందంటే

ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లు ఎందుకు కొనాలి?

ఇన్వర్టర్ మోడల్స్ సాధారణ ఫ్రిజ్‌ల కంటే కొంచెం ఎక్కువ ధర. కానీ తక్కువ విద్యుత్ బిల్లుతో ఆదా అవుతుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల్లో అదనపు ఖర్చు రికవర్ అవుతుంది. మెరుగైన పనితీరు, దీర్ఘకాలిక మన్నిక ఇస్తాయి. పైసా వసూల్ మోడల్స్ కావడంతో ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×