// // Instagram Voice Change| ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. వాయిస్ మార్చి మెసేజ్ పంపవచ్చు.. ఎలాగంటే? -->
E-Paper
Advertisement

Instagram Voice Change: ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ ఫీచర్.. వాయిస్ మార్చి మెసేజ్ పంపవచ్చు.. ఎలాగంటే?

Instagram Voice Change: ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ ఫీచర్.. వాయిస్ మార్చి మెసేజ్ పంపవచ్చు.. ఎలాగంటే?
Advertisement

Instagram Voice Change| ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌లకు(DM) కొత్త ఫీచర్ జోడించింది. ఇప్పుడు వాయిస్ నోట్స్‌లో AI వాయిస్ ఎఫెక్ట్స్ ఉపయోగించవచ్చు. వాయిస్ మెసేజ్ పంపే ముందు అందులో మీ వాయిస్‌కి బదులు ఏఐ వాయిస్‌ని మార్చుకోవచ్చు. దీంతో చాట్‌లు మరింత ఆసక్తికరంగా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారతాయి.

AI వాయిస్ ఎఫెక్ట్స్ ఎలా పనిచేస్తాయి?

మీరు రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్‌ను AI ఆటోమాటిక్‌గా మారుస్తుంది. వివిధ ఆడియో స్టైల్స్, ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. వాయిస్ టోన్, రిథమ్, భావోద్వేగాలు అలాగే ఉంటాయి. కేవలం వాయిస్ స్టైల్ మాత్రమే మారుతుంది. మెసేజ్‌లో అర్థం మారదు. అప్పటికప్పుడు రియల్-టైమ్‌లో AI.. ఆడియో ప్రాసెస్ చేస్తుంది.

ఇంటరాక్టివ్ చాట్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

ఈ ఫీచర్‌లో ఇంటరెస్టింగ్ ట్విస్ట్ ఉంది. రిసీవర్‌కు ఏ ఎఫెక్ట్ ఉపయోగించారో కనిపిస్తుంది. మీరు ఎంచుకున్న ఎఫెక్ట్ పేరు కూడా వాయిస్ మెసేజ్ పక్కనే చూపిస్తుంది. రిసీవర్ ఆ ఎఫెక్ట్‌పై ట్యాప్ చేస్తే అదే ఎఫెక్ట్‌ను తన రిప్లైలో ఉపయోగించవచ్చు. ఇలా ఒకరికొకరు ఫన్‌గా రిప్లై చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను యువత చాలా ఇష్టపడే అవకాశాలున్నాయి.

ఎలా ఉపయోగించాలి?

చాలా సులభం. ఇన్‌స్టాగ్రామ్‌లో DM ఓపెన్ చేయండి. వాయిస్ మెసేజ్ రికార్డ్ చేయడం మొదలుపెట్టండి. రికార్డింగ్ సమయంలో ‘Voice Effects’ ఆప్షన్ కనిపిస్తుంది. రియల్-టైమ్‌లో వివిధ ఎఫెక్ట్స్ ప్రివ్యూ చూడవచ్చు. ఇష్టమైనది సెలెక్ట్ చేసి సెండ్ చేయండి. రిసీవర్ ఆ ఎఫెక్ట్‌తోనే వినగలరు.

యూజర్ ఎంగేజ్‌మెంట్ పెంచే లక్ష్యం

Advertisement

మెటా కంపెనీ మెసేజింగ్‌ను మరింత క్రియేటివ్‌గా, ఎక్స్‌ప్రెసివ్‌గా మార్చాలని చూస్తోంది. వాయిస్ ఎఫెక్ట్స్‌తో చాట్‌లు ఆటపాటలా మారతాయి. యూజర్లు తమ స్టైల్‌ను సులభంగా పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఇది యువతకు బాగా నచ్చే ఫీచర్. చాలా ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు AI ఫీచర్లపై ఫోకస్ చేస్తున్నాయి.

మెసేజ్ ప్రైవసీలో పెద్ద మార్పు

ఈ ఫీచర్‌తో పాటు మరో ముఖ్యమైన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే మెటా కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌ డైరెక్ట్ మెసేజ్‌లలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆపివేయవచ్చని రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం కొన్ని చాట్‌లకు మాత్రమే ఈ ఎన్‌క్రిప్షన్ ఉంది. ఈ మార్పు పూర్తిగా అమలు చేసిన తర్వాత మెటా మెసేజ్ కంటెంట్‌ను సులభంగా చూడగలదు.

ఎందుకు ఈ మార్పు?

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, చైల్డ్ సేఫ్టీ సంస్థలు ఎన్‌క్రిప్షన్ వల్ల హానికర కార్యకలాపాలు దాగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఒత్తిడి వల్ల మెటా పాలసీ మార్చవచ్చు. అయితే ఇది యూజర్లలో ప్రైవసీ ఆందోళనలు పెంచవచ్చు.

Also Read: లగ్జరీ కార్లు తయారు చేస్తున్న రోబోలు.. జర్మన్ కంపెనీ ప్రయోగం

అప్‌డేట్స్ ఎలా వస్తాయి?

ఈ మార్పులు దశలవారీగా రోల్ అవుట్ అవుతాయి. కొన్ని ప్రాంతాల్లో ముందుగా, మిగతా చోట్ల తర్వాత వస్తాయి. పూర్తి గ్లోబల్ రోల్‌అవుట్ గురించి మెటా ఇంకా స్పష్టంగా చెప్పలేదు. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ వస్తాయి.

ఇన్‌స్టాగ్రామ్ మెసేజింగ్ ఫీచర్లను నిరంతరం మెరుగుపరుస్తోంది. AI వాయిస్ ఎఫెక్ట్స్ వాయిస్ మెసేజ్‌లకు కొత్త ఆనందాన్ని ఇస్తున్నాయి. అదే సమయంలో ప్రైవసీ మార్పులు యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌పై ప్రభావం చూపవచ్చు. ఈ మార్పుల గురించి అప్‌డేటెడ్‌గా ఉండటం మంచిది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×