E-Paper
Advertisement

Instagram vs Youtube: యూట్యూబ్‌ను గట్టిగా దెబ్బ కొట్టబోతన్న ఇన్‌స్టాగ్రామ్.. త్వరలోనే లాంగ్ వీడియో ప్లాట్‌ఫామ్

Instagram vs Youtube: యూట్యూబ్‌ను గట్టిగా దెబ్బ కొట్టబోతన్న ఇన్‌స్టాగ్రామ్.. త్వరలోనే లాంగ్ వీడియో ప్లాట్‌ఫామ్
Advertisement

Instagram vs Youtube| యూట్యూబ్ చాలా సంవత్సరాలుగా ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు దాని ఆధిపత్యానికి పెద్ద సవాల్ విసిరింది ఇన్‌స్టాగ్రామ్. భారీ స్థాయిలో కంటెంట్ విస్తరణకు ఇన్‌స్టాగ్రామ్ సిద్ధమవుతోంది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు లాంగ్ ఫార్మ్ వీడియోలు తీసుకువచ్చేందుకు ఫోకస్ చేస్తోంది. ఈ పెద్ద మార్పు వీడియో స్ట్రీమింగ్ ఇండస్ట్రీలో ఆసక్తి కలిగిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటివరకు షార్ట్ వీడియోలపైనే దృష్టి పెట్టింది. ఇందులో రీల్స్, స్టోరీస్ యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను ఆకర్షిస్తున్నాయి. కానీ ఈ వ్యూహం త్వరలో మారవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల డెడికేటెడ్ టీవీ యాప్ లాంచ్ చేసింది. ఇది వీడియో వాచింగ్‌కు పెద్ద ప్లాన్స్ సూచిస్తోంది. నిపుణులు ఇన్‌స్టాగ్రామ్ యూట్యూబ్‌ను డైరెక్ట్‌గా ఛాలెంజ్ చేయాలని అనుకుంటోందని చెబుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ లాంగ్ ఫార్మ్ వీడియో వ్యూహం గురించి సూచనలు

ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరి ఇటీవల ముఖ్యమైన విషయాలు వెల్లడించారు. భవిష్యత్ కంటెంట్ గురించి ఆయన ఓపెన్‌గా మాట్లాడారు. ప్రస్తుతం లాంగ్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా రాణించడం లేదని అంగీకరించారు. యూజర్లు వైవిధ్యం, త్వరిత వినోదం ఇష్టపడతారని చెప్పారు. షార్ట్ వీడియోలు లాంగ్ ఫార్మాట్ కంటే బెటర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. కానీ భవిష్యత్ ట్రెండ్స్ మారవచ్చని మోస్సేరి అన్నారు. ప్రీమియం కంటెంట్ లాంగ్ వీడియోలను సపోర్ట్ చేయవచ్చని సూచించారు. ఇది క్రియేటర్లను ఎక్కువసేపు వీడియోలు పోస్ట్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఫోర్స్‌డ్ ఎంట్రీ కాదని, ప్రీమియం మోడల్ యూజర్ బిహేవియర్ మార్చవచ్చని చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మోడల్ లేదు

Advertisement

ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం యాడ్ రెవెన్యూ ద్వారానే సంపాదిస్తోంది. ప్రీమియం మెంబర్‌షిప్ లేదు. యూట్యూబ్ ప్రీమియం యాడ్-ఫ్రీ వ్యూయింగ్, ఎక్స్‌క్లూసివ్ కంటెంట్ ఇస్తుంది. ఇది యూట్యూబ్‌కు బలమైన అడ్వాంటేజ్. లాంగ్ వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కావాల్సి ఉంటుంది. ప్రీమియం యాక్సెస్ క్రియేటర్ సంపాదనకు హెల్ప్ అవుతుంది. సబ్‌స్క్రిప్షన్లు లేకుండా లాంగ్ వీడియోలు ఆర్థికంగా కష్టపడవచ్చు. భవిష్యత్ ప్లాన్స్ పరిశీలనలో ఉన్నాయని మోస్సేరి సూచించారు.

IGTVతో లాంగ్ వీడియోలు ప్రయత్నించిన ఇన్‌స్టాగ్రామ్

ఇన్‌స్టాగ్రామ్ ఇంతకుముందు కూడా లాంగ్ వీడియో స్ట్రీమింగ్ ని ప్రయత్నించింది. 2018లో IGTV లాంచ్ చేసింది. ఇందులో లాంగ్ ఫార్మ్ వర్టికల్ వీడియోలపై ఫోకస్. కానీ యూజర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. క్రియేటర్లు కూడా ఎక్కువ ఎంగేజ్‌మెంట్ చూపలేదు. అందుకే 2022లో IGTV మూసివేయబడింది. ఫెయిల్యూర్ ఉన్నా ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంది. షార్ట్ ఫార్మ్ రీల్స్ బెస్ట్ సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ లాంగ్ వీడియోలు ప్రయత్నించబోతోంది.

ఇన్‌స్టాగ్రామ్ అమెరికాలో కొత్త టీవీ యాప్ టెస్ట్ చేస్తోంది

Advertisement

ఇన్‌స్టాగ్రామ్ కొత్త టీవీ యాప్ టెస్టింగ్ మొదలుపెట్టింది. అమెజాన్ ఫైర్ టీవీ డివైస్‌లలో లభిస్తోంది. ఇది పైలట్ ప్రాజెక్ట్. యాప్‌లో ఆర్గనైజ్డ్ వీడియో ఛానల్స్ ఉన్నాయి. మ్యూజిక్, స్పోర్ట్స్ హైలైట్స్, ట్రావెల్ కేటగిరీలు. ట్రెండింగ్ మూమెంట్స్ విడిగా ఉంటాయి. పెద్ద స్క్రీన్‌లో క్యూరేటెడ్ రీల్స్ చూడవచ్చు. ఐదు యాకౌంట్లు లాగిన్ చేయవచ్చు. ఫ్యామిలీ షేరింగ్‌కు సూట్.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

ఇన్‌స్టాగ్రామ్ నిజంగా యూట్యూబ్‌ను ఛాలెంజ్ చేయగలదా?

యూట్యూబ్ ఇప్పటికీ లాంగ్ ఫార్మ్ కంటెంట్‌లో లీడర్. బలమైన క్రియేటర్ టూల్స్, మానిటైజేషన్ ఉన్నాయి. క్రియేటర్లు యూట్యూబ్‌పై నమ్మకంగా సంపాదిస్తారు. ఇన్‌స్టాగ్రామ్ ఇంకా షార్ట్ కంటెంట్‌పైనే ఫోకస్. యూజర్ అలవాట్లు మార్చడానికి టైమ్ పడుతుంది. ప్రీమియం కంటెంట్ భవిష్యత్ మార్పులు తెస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫార్మాట్ లో యూజర్లను ఆకర్షించ గలిగితే విజయం సాధించినట్లే. కానీ అప్పుడు యూట్యూబ్‌తో పోటీ మరింత తీవ్రమవుతుంది. వీడియో స్ట్రీమింగ్ బ్యాటిల్ వేడెక్కుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×