// // Instagram Ends End To End Encryption: ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ కు ఇన్ స్టా గ్రామ్ గుడ్ బాయ్.. మీ చాటింగ్ ను ఎవరైనా చదవొచ్చు! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Instagram Ends End To End Encryption: ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ కు ఇన్ స్టా గ్రామ్ గుడ్ బాయ్.. మీ మెసేజ్ భద్రంగా ఉండాలంటే?

Instagram Ends End To End Encryption: ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ కు ఇన్ స్టా గ్రామ్  గుడ్ బాయ్.. మీ మెసేజ్ భద్రంగా ఉండాలంటే?
Advertisement

Instagram Ends End To End Encryption: టెక్ కంపెనీ మెటా షాకింగ్ న్యూస్ చెప్పింది. మే8, 2026 నుంచి ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజెస్ లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. చాలా తక్కువ మంది యూజర్లు ఈ ఫీచర్ ను వాడుతున్నారని, అందుకే దీనిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెటా తెలిపింది. ఈ నిర్ణయంతో ఇన్ స్టా గ్రామ్ లో ప్రైవేట్ చాట్‌ల తీరు మారుతుందని నిపుణులు అంటున్నారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీ ఫీచర్ తో మెసేజ్ లను పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారు మాత్రమే చదవగలరు. ప్లాట్‌ఫామ్ కూడా ఆ మెసేజ్ లను యాక్సెస్ చేయలేదు. ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్ ను మెటా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఒక్కొక్కొటిగా తొలగిస్తుంది.

మే 8 లోపు డౌన్ లోడ్

ఇన్‌స్టాగ్రామ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ఫీచర్‌ను డిసెంబర్ 2023లో ప్రవేశపెట్టింది. తమ యాప్‌లలో గోప్యతను మెరుగుపరిచేందుకు మెటా ఈ ఫీచర్ తీసుకొచ్చింది. దీనిని తొలగించిన తర్వాత, ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన మెసేజ్ లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీ ఉండదు. అంటే కంటెంట్ మోడరేషన్ లేదా ఇతర కారణాలతో మెటా మీ మెసేజ్ లను చదవగలదు. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. యూజర్లు తమ పాత మెసేజ్ లు లేదా మీడియా ఫైల్స్ ను సేవ్ చేసుకోవాలనుకుంటే.. మే 8 లోపు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

యూజర్ల భద్రతపై ఆందోళన

Advertisement

మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఇన్ స్టా గ్రామ్ భద్రతపై చర్చను లేవనెత్తింది. ఆన్‌లైన్ లో సంభాషణలకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ పటిష్టంగా పనిచేస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు లేదా ఇతరుల చేతిలో పడకుండా కాపాడుతుంది. అయితే పిల్లల ఆన్‌లైన్ భద్రతపై పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలకు ఎన్‌క్రిప్టెడ్ చాట్‌ల వల్ల చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించడం కష్టమవుతుంది. మెటా ఇప్పటికే వాట్సాప్‌లో డిఫాల్ట్‌గా ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తోంది. తమ మెసేజ్ లపై సీక్రెసీ కోరుకునే వారు వాట్సాప్‌లో చాటింగ్ చేసేలా ప్రోత్సహిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ చర్యతో మెటా తన మెసేజింగ్ ప్లానింగ్ ను మారుస్తోందంటున్నారు. మెటా నిర్ణయంతో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మెసేజింగ్ పై ఆందోళనలు మొదలయ్యాయి.

చట్టాలు అమలుకే

చట్టాలు అమలు, బాలల భద్రతపై సంస్థల నుంచి వస్తున్న ఒత్తిడితో ఇన్‌స్టాగ్రామ్ మే నెల నుంచి ఎన్‌క్రిప్ట్ ఫీచర్ ను నిలిపివేయనున్నట్లు మెటా ప్రతినిధి తెలిపారు. అయితే వాట్సాప్ లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ మెసేజింగ్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వాడే పిల్లల భద్రత, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం.. విషయంలో FBI, ఇంటర్‌పోల్, భారత ప్రభుత్వ సంస్థలతో నుంచి మెటా విమర్శలను ఎదుర్కొంటుంది. మెటా బహుశా యూజర్ల సందేశాలను ఉపయోగించి ప్రకటనలను నిర్ణయించడం, చాట్‌బాట్‌లకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఇలా చేయకపోవచ్చు కానీ వ్యాపారపర ఒత్తిడితో భవిష్యత్తులో తప్పకుండా యూజర్ల డేటాను మెటా రీడ్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. త్వరలో ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు తొలగించవచ్చని తెలి పారు.

Advertisement

Also Read: ఇన్‌స్టా రీల్స్ వైరల్ అయ్యే సీక్రెట్ హ్యాక్స్.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ సెట్టింగ్స్ ఇవే!

సెక్యూరిటీ కోసం

యూజర్లు తమ వ్యక్తిగత విషయాలను ఇన్ స్టాగ్రామ్ లో మెసేజింగ్ చేసే సమయంలో ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మెసేజింగ్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉన్న ప్లాట్ ఫామ్ లను వినియోగిం చుకోవాలని సూచిస్తున్నారు. వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి మెసేంజర్ యాప్ లను ఉపయోగించాలని అంటున్నారు. దీంతో పాటు పిల్లలు ఇన్ స్టా గ్రామ్ వాడుతున్న సమయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారు తెలియని వ్యక్తులకు మెసేజ్ లు చేయకుండా జాగ్రత్త వహించాలంటున్నారు. డేటా సెక్యూరిటీకి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఒక కీలకమైనదే కానీ అది పూర్తి హామీ కాదు. వాట్సాప్ లో ఎన్‌క్రిప్షన్ కేవలం మెసేజ్ కంటెంట్‌కు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి మన వ్యక్తిగత, వృత్తిపరమైన లేదా ఆర్థికపరమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో యాప్స్ లో పెట్టడం అంత సురక్షితం కాదు. ఎన్ క్రిప్ట్ ఆప్షన్ ఉన్న సరే.. అవి కొన్నింటికే పరిమితం అవుతాయి. ఫైనల్ గా నిపుణులు చెప్పేదేంటంటే..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×