E-Paper
Advertisement

Project Rhodium Omega: పుమా లాంటి బైక్.. దీన్ని తయారు చేసేందుకు ఏకంగా 30 నెలలు పట్టింది!

Project Rhodium Omega: పుమా లాంటి బైక్.. దీన్ని తయారు చేసేందుకు ఏకంగా 30 నెలలు పట్టింది!
Advertisement

Stunning Custom Yamaha GTS 1000: యమహా బైక్స్ చూడ్డానికి క్రేజీగా ఉంటాయి. JSK మోటో కో కంపెనీ ప్రాజెక్ట్ రోడియం ఒమేగా అనే ఆసక్తికర ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఇందులో భాగంగా30 నెలల పాటు కష్టపడి ఓ బైక్ తయారు చేశారు. ఈస్టమ్ బైక్ పేరు 1993 యమహా GTS 1000. ఇది ఫ్యూచరిస్టిక్ లుక్ లో పెంటాగోనల్ బాడీ, మెటాలిక్ రోడియం పెయింట్ ఫినిషింగ్‌ ను కలిగి ఉంది. ఈ బైక్ నిర్మాణం, అసలైన స్పోర్ట్స్ టూరింగ్ బైక్ ప్రత్యేకమైన, హబ్ సెంటర్‌డ్ స్టీరింగ్‌ ను కలిగి ఉంటుంది. దీనిని సింగిల్ సైడెడ్ స్వింగ్‌ ఆర్మ్, కస్టమ్ ఫైబర్‌ గ్లాస్ బాడీవర్క్‌ తో  నియో రేసర్ గా రీ క్రియేట్ చేశారు.

రోడియం ఒమేగా నిర్మాణం గురించి..

Advertisement

⦿ డిజైన్ కాన్సెప్ట్: దీనిని GTS ​​1000 ను రీ క్రియేట్ చేసి రోడియం ఒమేగా అనే పేరు పెట్టారు. ఈ బైక్ GTS ​​1000 మెటల్ ఫినిష్, ఒమేగా ఆకారపు ఫ్రేమ్ ఉంటుంది. ఇన్‌ టేక్, ప్యానెల్స్ తో సహా మొత్తం డిజైన్, పెంటాగోనల్ థీమ్ తో ఆకట్టుకుంటుంది.

⦿ ఇంజనీరింగ్, బాడీవర్క్: ఈ బైక్ ఫ్యూచరిస్టిక్ లుక్ లో ఉంటుంది.  ఫైబర్‌ గ్లాస్ ప్యానెళ్లను రూపొందించారు. వాటి ముందు భాగంలో ఆరు LED హెడ్‌ లైట్లను ఏర్పాటు చేశారు.

Advertisement

⦿ స్టీరింగ్, సస్పెన్షన్: మొదట్లో ఒక కొత్త, కస్టమ్ స్టీరింగ్ సిస్టమ్‌ను ప్లాన్ చేసినప్పటికీ, రవాణాలో 8,000 డాలర్ల విలువైన ఫైబర్‌ గ్లాస్ అచ్చు దెబ్బతినడంతో, ఈ ప్రాజెక్ట్ స్టాక్, RADD-డిజైన్ చేసిన, హబ్ సెంటర్‌డ్ స్టీరింగ్ (HCS)నే కొనసాగింది.

⦿ ఇంజిన్, పనితీరు: ఇది 1993 యమహా GTS1000లోని 1002cc జెనెసిస్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఇది దాని నో ఫోర్క్స్ గివెన్ హ్యాండ్లింగ్‌ కు ప్రసిద్ధి చెందింది. అదనపుస్థలం కోసం ABS వ్యవస్థను తొలగించారు.

Read Also: ఇది బైక్ కాదు కారు.. లోపల ఎలా ఉందో చూస్తే మతిపోద్ది భయ్యా!

⦿ అప్పియరెన్స్: ఈ బైక్‌లో ఎరుపు రంగు లెదర్ తో కూడిన ఒకే సీటు ఉంటుంది. వంగి ఉన్న పుమా లాంటి యాంగిల్ ఆకట్టుకుంటుంది.

JSK మోటో కో చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌ ను జేమ్స్ చెన్ లీడ్ చేశారు. అరుదైన GTS ​​1000 సామర్థ్యాన్ని 21వ శతాబ్దపు కస్టమ్ మోటార్‌ సైకిల్‌ గా ప్రదర్శించడానికి దీనిని రూపొందించారు. అప్పట్లో ఈ బైక్ టూ వీలర్ మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: ఏథర్ 450 అపెక్స్ vs సుజుకి ఇ-యాక్సెస్, రెండింటిలో ఏది బెస్ట్?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×