// // Infrared Cooktop vs Induction Stove: ఇండక్షన్ స్టౌవ్‌ స్టాక్ అవుటా ? -->
E-Paper
Advertisement

Infrared Cooktop vs Induction Stove: ఇండక్షన్ స్టౌవ్‌ స్టాక్ అవుటా? అయితే ఈ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ పై ఓ లుక్కేయండి

Infrared Cooktop vs Induction Stove: ఇండక్షన్ స్టౌవ్‌ స్టాక్ అవుటా? అయితే ఈ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ పై ఓ లుక్కేయండి
Advertisement

Infrared Cooktop vs Induction Stove: ఇండక్షన్ స్టౌవ్‌లు మార్కెట్‌లో దొరకడం కష్టంగా మారిన పరిస్థితిలో చాలా మంది ఇప్పుడు ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ వైపు చూస్తున్నారు.ఎల్పీజీ గ్యాస్ సమస్యలు, అధిక డిమాండ్ కారణంగా ఇండక్షన్ స్టౌవ్‌లు కొన్నిచోట్ల స్టాక్‌లో లేకపోవడం కూడా చూస్తున్నాం. అయితే.. చాలా మందికి ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ , ఇండక్షన్ స్టౌవ్ మధ్య తేడా ఏంటి? ఏది మంచిది? అనే సందేహం ఉంటుంది. ఈ రెండు స్టౌవ్‌లు కరెంట్ తోనే పనిచేస్తాయి కానీ వాటి పని విధానం, కరెంట్ వినియోగం వంటి అంశాల్లో తేడాలు ఉంటాయి.

Infrared Cooktop vs Induction Stove – తేడాలు ఏంటి?

Advertisement

ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ అంటే ఏంటి?

ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ అనేది కరెంట్‌తో పని చేసే స్టౌవ్. ఇందులో ఉన్న హీటింగ్ ఎలిమెంట్ వేడిని ఉత్పత్తి చేసి గ్లాస్ సర్ఫేస్ ద్వారా పాత్రను వేడి చేస్తుంది. ఇది పని చేసేటప్పుడు రెడ్ కలర్‌లో కింద భాగం వేడిగా కనిపిస్తుంది. ఈ స్టౌవ్‌లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ రకం పాత్రలైనా దీనిపై ఉపయోగించవచ్చు. అల్యూమినియం, స్టీల్, కాపర్, ఐరన్ పాత్రలు అన్నీ పని చేస్తాయి.

Advertisement

ఇండక్షన్ స్టౌవ్ అంటే ఏంటి?

ఇండక్షన్ స్టౌవ్ కూడా కరెంట్‌తోనే పని చేస్తుంది. కానీ ఇది ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా పాత్రను నేరుగా వేడి చేస్తుంది. అందుకే స్టౌవ్‌పై గ్లాస్ భాగం ఎక్కువగా వేడి కాకుండా ఉంటుంది. దీనికి మాత్రం ఇండక్షన్‌కు సరి పోయే ప్రత్యేకమైన పాత్రలు ఉండాలి. సాధారణ గిన్నెలు దీనిపై పనిచేయవు.

ఏది ఎలా పనిచేస్తుంది ?
1.ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్‌లో ముందుగా హీటింగ్ ఎలిమెంట్ వేడి అవుతుంది. ఆ తర్వాత.. ఆ వేడి గ్లాస్ ద్వారా పాత్రకు చేరుతుంది.

2.ఇండక్షన్ స్టౌవ్‌లో మాత్రం పాత్రే వేడి ఉత్పత్తి చేసేలా పని చేస్తుంది. అందుకే త్వరగా వంట అవుతుంది. అందుకే ఇండక్షన్ స్టౌవ్‌లు వేగంగా వంట చేయగలవు.

కరెంట్:
1.ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ కొంచెం ఎక్కువ కరెంట్ వినియోగిస్తుంది. ఎందుకంటే ముందుగా హీటింగ్ ఎలిమెంట్ వేడి అవ్వాలి కాబట్టి.

2.ఇండక్షన్ స్టౌవ్‌లో వేడి నేరుగా గిన్నెలోనే ఉత్పత్తి అవుతుంది కాబట్టి కరెంట్ వినియోగం తక్కువగా ఉంటుంది. అందుకే.. ఎక్కువగా వంట చేసే వారికి ఇండక్షన్ స్టౌవ్ ఖర్చు తక్కువగా ఉంటుంది.

పాత్రల విషయంలో తేడా.. ?

1.ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే దీనిపై ఏ పాత్రైనా వాడుకోవచ్చు.

2.ఇండక్షన్ స్టౌ‌లో మాత్రం మాగ్నెటిక్ బేస్ ఉన్న పాత్రలు మాత్రమే పని చేస్తాయి. ఉదాహరణకు స్టీల్ లేదా ఐరన్ పాత్రలు. అందుకే కొత్త పాత్రలు కొనాల్సి వచ్చే అవకాశం ఉంటుంది.

భద్రత:

1.ఇండక్షన్ స్టౌవ్‌‌లో స్టౌవ్ సర్ఫేస్ ఎక్కువగా వేడి కాకపోవడం వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుంది.

2.ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్‌లో మాత్రం గ్లాస్ సర్ఫేస్ బాగా వేడి అవుతుంది. స్టౌవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంతసేపు వేడి ఉంటుంది. అందుకే చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో వీటిని జాగ్రత్తగా వాడాలి.

Also Read: గ్యాస్ కంటే చౌకగా ఇండక్షన్‌పై వంట.. గంట వాడితే ఎంత ఖర్చవుతుందంటే ?

ధర:
సాధారణంగా ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ ధర ఇండక్షన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కరెంట్ వినియోగం ఎక్కువ కావడం వల్ల ఖర్చు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏది కొనాలి?

1. మీ దగ్గర ఇప్పటికే ఉన్న పాత్రలతోనే వంట చేయాలంటే ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ బెస్ట్.

2. కానీ కరెంట్ ఖర్చు తక్కువగా ఉండాలి.. వేగంగా వంట కావాలి అనుకుంటే ఇండక్షన్ స్టౌవ్‌ బెస్ట్ ఆప్షన్. ఇండక్షన్ స్టౌవ్ మార్కెట్‌లో దొరకని పరిస్థితుల్లో మాత్రం ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ మంచి ప్రత్యామ్నాయం.

Also Read: సిలిండర్ అయిపోయినా నో టెన్షన్.. ఈ గ్యాస్ ప్రత్యామ్నాయాలతో వంట చేసేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×