// // Night Shower Benefits: ఆ టైంలో స్నానం చేస్తే ఎక్కువ కాలం జీవిస్తారట! -->
E-Paper
Advertisement

Night Shower Benefits: రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తే ఎక్కువ కాలం జీవిస్తారా? తాజా అధ్యయనంలో షాకింగ్ ఫ్యాక్ట్స్!

Night Shower Benefits: రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తే ఎక్కువ కాలం జీవిస్తారా? తాజా అధ్యయనంలో షాకింగ్ ఫ్యాక్ట్స్!
Advertisement

Night Shower Benefits: రోజంతా ఆఫీసు వర్క్, ఇంటి పనులతో అలసిపోయిన శరీరం రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవాలని కోరుకుంటుంది. కానీ కొంతమంది పడుకుందాం అని బెడ్ ఎక్కాక.. నిద్రపట్టక అటు ఇటు దొర్లుతూ ఉంటారు. ఇక ఎలాగో నిద్ర పట్టడం లేదు కదా అని గంటల తరబడి ఫోన్ చూస్తూనో లేక ఏవో ఆలోచనలతోనో తెల్లారే వరకు మేల్కొనే ఉంటారు. అయితే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టి, పడుకోగానే గాఢనిద్ర పట్టాలంటే ఓ చిన్న పని చేస్తే చాలంటున్నారు శాస్త్రవేత్తలు. రాత్రి పడుకునే ముందు ఓసారి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయమని సూచిస్తున్నారు.

మెదడుకు గ్రీన్ సిగ్నల్..

వేడి నీళ్లతో స్నానం చేస్తున్నప్పుడు మన ఒంట్లో వేడి కాస్త పెరుగుతుంది. అయితే స్నానం ముగించి బయటికి వచ్చాక మన శరీరం మెల్లగా చల్లబడటం స్టార్ట్ అవుతుంది. ఈ ఉష్ణోగ్రత తగ్గడాన్ని మన మెదడు ఒక సిగ్నల్‌లా గుర్తు పడుతుంది. ‘ఇక చాలు.. బాడీ రిలాక్స్ అవ్వాలి, పడుకునే టైమ్ వచ్చేసింది’ అని మెదడు శరీరానికి మెసేజ్ పంపిస్తుంది. దీనివల్ల మనలో నిద్రను కలిగించే ‘మెలటోనిన్’ అనే హార్మోన్ వెనువెంటనే విడుదలయ్యి, మనకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకుంటాం. సైన్స్ భాషలో దీనినే ‘థర్మల్ ట్రిగ్గర్’ అంటారు.

Advertisement

Also Read: ఫస్ట్ టైం ఓవెన్ వాడుతున్నారా? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది జాగ్రత్త!

ఆరోగ్యానికి అసలైన పెట్టుబడి..

మంచి నిద్ర అనేది మన శరీరానికి కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. అది మన ఆయుష్షును పెంచే మెడిసిన్ కూడా. రాత్రిపూట ఇలా ప్రశాంతంగా స్నానం చేసి పడుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న స్ట్రెస్ హార్మోన్లు తగ్గిపోతాయి. గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా, మనలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరం ప్రతిరోజూ తగినంత విశ్రాంతి తీసుకుంటే, ఆటోమేటిక్‌గా మన ఆరోగ్యం బాగుంటుంది. మనం ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని చాలా అధ్యయనాలు ఇప్పటికే నిరూపించాయి.

స్నానం ఒక్కటే కాదు..

Advertisement

కేవలం స్నానం చేస్తేనే సరిపోదు.. పడుకునే ముందు రూమ్‌లో లైట్లు కాస్త డిమ్ చేసి, ఆ స్మార్ట్ ఫోన్‌ను కాస్త దూరం పెడితే మన శరీరం ప్రకృతికి అనుగుణంగా స్పందిస్తుంది. పెద్ద పెద్ద డైట్లు, కష్టమైన వర్కౌట్లు చేయలేకపోయినా.. ఈ చిన్న అలవాటు మన జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. రాత్రిపూట చేసే స్నానం మన మెదడుని ప్రశాంతంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుండే మీరూ ట్రై చేసి చూడండి.. ఆ తేడా మీకే తెలుస్తుంది.

Also Read: మాల్స్, థియేటర్లలో టాయిలెట్ డోర్ల కింద ఆ గ్యాప్ ఎందుకో తెలుసా?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×