E-Paper
Advertisement

Solar Cooking System: గ్యాస్, కరెంట్ ఏదీ అవసరం లేకుండానే వంట చేసేయండి.. కొత్త స్టవ్ చూశారా?

Solar Cooking System: గ్యాస్, కరెంట్ ఏదీ అవసరం లేకుండానే వంట చేసేయండి.. కొత్త స్టవ్ చూశారా?
Advertisement

Solar Cooking System| అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో అనిశ్చితి నెలకొంది. ఈ కారణంగా ప్రపంచదేశాలన్నీ గ్యాస్, ఆయిల్ సరఫరాలో అంతరాయం ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో కూడా చాలా నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ కొరత కనిపిస్తోంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ఇంట్లో వంట కోసం ఒక గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవడానికి వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే గ్యాస్ సిలిండర్ లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా చాలా మంది ఇండక్షన్ కుక్‌టాప్‌, స్టవ్లు కొనుగోలు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఇండక్షన్ స్టవ్‌లతో పాటు వాటికి సరిపడే కుకర్లకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. అందుకే ఇండక్షన్ స్టవ్‌లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మార్కెట్‌లో ఇండక్షన్ స్టవ్‌లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిలో సోలార్ ఎనర్జీ (సూర్యరశ్మి) ఆధారిత స్టవ్‌లు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. ఈ స్పెషల్ స్టవ్‌ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు అభివృద్ధి చేసింది. దీని పేరు సూర్య నూతన్ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్.

సూర్య నూతన్ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్

Advertisement

ఈ సిస్టమ్ ద్వారా సూర్యరశ్మి (ఎండ)ని ఉపయోగించి ఇంటి లోపలే వంట చేసుకోవచ్చు. సాధారణ సోలార్ కుకర్లలా బయట నిలబడి ఎండలో వండాల్సిన అవసరం లేదు. సోలార్ ఎనర్జీని ఇంటి లోపలికి తీసుకొస్తుంది. దీంతో ప్రతి రోజు చేసుకునే వంట సౌకర్యవంతంగా, సులభంగా పూర్తి చేసేయవచ్చు.

Also Read: వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా ఇంటికి చేరలేదా? సులభంగా ఇలా ఫిర్యాదు చేయండి

ఇండోర్ సోలార్ స్టవ్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ ప్యానెల్స్ సూర్యరశ్మిని సేకరించి థర్మల్ ఎనర్జీగా మారుస్తాయి. ఈ ఎనర్జీని ప్రత్యేక కేబుల్ ద్వారా ఇంటి లోపలి స్టవ్‌కు తీసుకువస్తాయి. లోపలి యూనిట్ సాధారణ కుక్‌టాప్‌లా కనిపిస్తుంది. గ్యాస్ సిలిండర్లు, ఇండక్షన్ లేదా విద్యుత్ అవసరం లేదు. సోలార్ ఎనర్జీతోనే వంట జరుగుతుంది. ఈ ప్రత్యేక స్టవ్.. పర్యావరణ హితంగా, ఖర్చు తక్కువగా ఉంటుంది.

సోలార్ కుకింగ్ సిస్టమ్ లాభాలు

ఈ సోలార్ కుకింగ్ సిస్టమ్ ఎల్‌పీజీ సిలిండర్లపై ఆధారపడటం తగ్గిస్తుంది. విద్యుత్ వినియోగించాల్సిన అవసరం కూడా లేదు. సోలార్ ఎనర్జీ పునరుత్పాదకమైనది, దీన్ని వినియోగించడం ద్వారా ఖర్చు ఉండదు, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. అంటే పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. ఇంధన కొరత సమయాల్లో వంట సమస్యలు తగ్గుతాయి. దీర్ఘకాలంలో వంట ఖర్చులు చాలా తగ్గుతాయి.

సూర్య నూతన్ సిస్టమ్ ఎలా పొందాలి?

ఈ సోలార్ కుకింగ్ సిస్టమ్ సాధారణ షాపుల్లో లభించవు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఇన్‌క్వైరీ ఫామ్ పూరించాలి. కంపెనీ అభ్యర్థనను సమీక్షించి సమాచారం ఇస్తుంది. ఆమోదం లభించిన తర్వాత ఇన్‌స్టాలేషన్, కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

సూర్య నూతన్ సిస్టమ్ ధరలు

ఈ సిస్టమ్ మూడు మోడల్స్‌లో లభిస్తుంది.
సూర్య నూతన్ L: రూ.12,000 నుంచి రూ.15,000
సూర్య నూతన్ LD: రూ.18,000 నుంచి రూ.22,000
సూర్య నూతన్ LDB: సుమారు రూ.23,000
ఇన్‌స్టాలేషన్ అవసరాల ఆధారంగా ధరలు మారవచ్చు.

వంట గ్యాస్ ఇంధన కొరత సమయంలో మంచి పరిష్కారం

భవిష్యత్తులో సోలార్ కుకింగ్ టెక్నాలజీ మరింత ముఖ్యమవుతుంది. ఇంధన సరఫరా అంతరాయాలు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సోలార్ ఇండోర్ స్టవ్‌లు.. ఆధునిక కిచెన్ అవసరాలను సౌకర్యంతో కలిపి ఇస్తాయి. ఎక్కువ మంది ఉపయోగిస్తే ఎల్‌పీజీ సరఫరా ఒత్తిడి తగ్గుతుంది. చాలా కుటుంబాలకు ఇది విశ్వసనీయ బ్యాకప్ సొల్యూషన్ అవుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×