E-Paper
Advertisement

India AI Clinic: దేశంలో మొట్టమొదటి ఏఐ క్లినిక్.. ప్రభుత్వ ఆస్పత్రిలో వేగవంతంగా డయాగ్నసిస్

India AI Clinic: దేశంలో మొట్టమొదటి ఏఐ క్లినిక్.. ప్రభుత్వ ఆస్పత్రిలో వేగవంతంగా డయాగ్నసిస్
Advertisement

India Govt AI Clinic | భారతదేశం ప్రభుత్వ ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే మొదటి కృత్రిమ మేధస్సు (ఏఐ) క్లినిక్‌‌ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్లినిక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో ఈ క్లినిక్ సేవలు ప్రారంభమయ్యాయి. రోగ నిర్ధారణను మెరుగుపరచడం, చికిత్సను వేగవంతం చేయడం, రోగ నిర్ధారణలో కచ్చితత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఐ క్లినిక్ పనిచేస్తుంది. అధికారులు దీన్ని దేశవ్యాప్తంగా ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు మోడల్‌గా చూస్తున్నారు.

ఏఐ క్లినిక్ తో వైద్యరంగానికి టెక్నాలజీ అందుబాటు

Advertisement

ఈ ఏఐ క్లినిక్ జిమ్స్ సెంటర్ ఫర్ మెడికల్ ఇన్నోవేషన్ పరిధిలో పనిచేస్తుంది. డాక్టర్లు, రోగులు ఇప్పుడు నేరుగా ఏఐ టెక్నాలజీ సహాయంతో చికిత్స పొందవచ్చు. ఏఐ సిస్టమ్‌లు వ్యాధులను ముందుగానే గుర్తించడంలో, రోగ నిర్ధారణలో కచ్చితత్వం పెంచడంలో సహాయపడతాయి. ఈ క్లినిక్ స్వయంగా డాక్టర్లకు బదులు పనిచేయదు. పైగా వారు త్వరగా నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుంది. దీని ద్వారా రోగులకు మెరుగైన సంరక్షణ అందించడమే లక్ష్యం. రక్త పరీక్షలు, ఇమేజింగ్ స్కాన్‌లు, జన్యు పరీక్షలు విశ్లేషించడంలో ఏఐ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

స్టార్టప్‌లు, వైద్య ఆవిష్కరణలకు మద్దతు

ఈ క్లినిక్ ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. హెల్త్‌కేర్ స్టార్టప్‌లు తమ ఏఐ సాధనాలను ఆసుపత్రి వాతావరణంలో పరీక్షించవచ్చు. నిజమైన రోగుల డేటా ఉపయోగించి కొత్త ఏఐ టూల్స్ అభివృద్ధి చేయవచ్చు, పరీక్షించవచ్చు. ఇది ఆవిష్కరణలు త్వరగా ఆసుపత్రులకు చేరేలా చేస్తుంది. నిపుణులు, వైద్యుల మధ్య ఉన్న గ్యాప్‌ని ఈ టెక్నాలజీ తగ్గిస్తుంది.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచ నిపుణులు

Advertisement

క్లినిక్ ప్రారంభోత్సవం ఆన్‌లైన్‌లో జరిగింది. భారతదేశం నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా 100 మందికి పైగా నిపుణులు పాల్గొన్నారు. డాక్టర్లు, పరిశోధకులు, లండన్ ఎసెక్స్ ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్ వైద్యులు కూడా చేరారు. ఏఐ నైతిక ఉపయోగం, బాధ్యతాయుత ఆవిష్కరణలపై చర్చించారు.

బలమైన అకాడమిక్, టెక్నాలజీ సపోర్ట్

ఈ క్లినిక్‌కు ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐఐటీ లక్నో వంటి ప్రముఖ సంస్థల మద్దతు ఉంది. ఇది పరిశోధన క్వాలిటీని పెంచుతుంది. వైద్య ఇమేజింగ్, రోగ నిర్ధారణ మోడళ్లు, క్లినికల్ నిర్ణయ మద్దతు వ్యవస్థలపై ఏఐ ద్వారా వైద్యులు దృష్టి సారిస్తారు. డేటా ఆధారిత ఆరోగ్య సేవలు ఇందులో కీలకం.

భౌతిక ప్రారంభం, భవిష్యత్ ప్రణాళికలు

క్లినిక్ పూర్తిస్థాయిలో జనవరి 6న ప్రారంభమవుతుంది. డాక్టర్లు ఏఐ టూల్స్‌ని రోజువారీ చికిత్సలో ఉపయోగిస్తారు. రోగులకు వేగవంతమైన రోగ నిర్ధారణ, మెరుగైన సంరక్షణ లభిస్తుంది. ఈ మోడల్‌ను ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించే అవకాశం ఉంది.. రోగ నిర్ధారణలో ఆలస్యం తగ్గి, చికిత్స ఫలితాలు మెరుగవుతాయి. దూరపు ప్రాంతాల్లోని ప్రజలకు కూడా మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయి.

Also Read: బ్లాక్‌బెర్రీ లాంటి డిజైన్.. ఐఫోన్ లాంటి ఫీచర్స్.. కొత్త ఫోన్ చూశారా?

వైద్యరంగంలో ఏఐ స్టార్టప్స్

జిమ్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ రాకేష్ కుమార్ గుప్తా ఈ క్లినిక్ అడ్వాన్స్ హెల్త్‌కేర్ కు చాలా అవసరమని చెప్పారు. డాక్టర్లను ఏఐ బలోపేతం చేస్తుందని, సంక్లిష్ట నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుందని అన్నారు. స్టార్టప్‌లకు కొత్త అవకాశాలతో పాటు డాక్టర్లకు భవిష్యత్ సాంకేతిక శిక్షణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు కొత్త అధ్యాయం

ఈ ఏఐ క్లినిక్ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ఆవిష్కరణకు చిహ్నం. టెక్నాలజీతో ప్రభుత్వ సేవలు మెరుగుపడతాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×