E-Paper
Advertisement

అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే గ్యాస్ సిలిండర్.. వారికి పండగే..

అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే గ్యాస్ సిలిండర్.. వారికి పండగే..
Advertisement

Indane Chhotu: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉపాధి కోసం లేదా చదువుల కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో వంట గ్యాస్ కనెక్షన్ ఒకటి. సాధారణ గ్యాస్ కనెక్షన్ పొందాలంటే అడ్రస్ ప్రూఫ్, ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం పెద్ద ప్రక్రియగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ‘ఛోటూ’ (Chhotu) పేరుతో 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పిజి (FTL) సిలిండర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Read also-గుడ్ న్యూస్.. రష్మిక ప్రెగ్నెంట్.. వైరల్ అవుతున్న పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే?

అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు

Advertisement

ఛోటూ సిలిండర్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, దీనిని పొందడానికి ఎటువంటి నివాస ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. కేవలం ఏదైనా ఒక ఫోటో గుర్తింపు కార్డు సమర్పిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలతో నిమిషాల వ్యవధిలోనే కనెక్షన్ పొందవచ్చు. ఇది ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు వలస కార్మికులకు ఎంతో మేలు చేస్తుంది.

ఎక్కడ లభిస్తుంది?

సాధారణ గ్యాస్ సిలిండర్ల కోసం డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఛోటూ సిలిండర్లు దేశవ్యాప్తంగా ఉన్న ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో పాటు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులు, ఎంపిక చేసిన కిరాణా షాపులు డిపార్ట్‌మెంటల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు నేరుగా ఈ కేంద్రాలకు వెళ్లి నగదు చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయవచ్చు.

సులభమైన రీఫిల్లింగ్ పద్ధతి

Advertisement

గ్యాస్ ఖాళీ అయినప్పుడు బుకింగ్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఖాళీ ఛోటూ సిలిండర్‌ను ఏదైనా అధీకృత విక్రయ కేంద్రంలో ఇచ్చి, గ్యాస్ ధర చెల్లించి వెంటనే భర్తీ చేసిన మరో సిలిండర్‌ను పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఏ విక్రయ కేంద్రంలోనైనా ఈ రీఫిల్లింగ్ సౌకర్యం అందుబాటులో ఉండటం దీని మరో ప్లస్ పాయింట్. ఇది కేవలం 5 కేజీల బరువు మాత్రమే ఉండటం వల్ల రూమ్ మారినప్పుడు లేదా ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లడం చాలా సులభం.

Read also-OTT Movies: మగాళ్ల మధ్య రొమాన్స్.. మూవీ లవర్స్‌కు ఈ సినిమా ఫీస్టే..

సాధారణ 14.2 కేజీల సిలిండర్ ధరతో పోలిస్తే, దీని ధర తక్కువగా ఉండటం వల్ల సామాన్యులకు భారం అనిపించదు. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలకు అనుగుణంగా తయారైనది, కాబట్టి వినియోగదారులు భద్రత విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెద్ద సిలిండర్లు వాడేవారు కూడా అత్యవసర సమయంలో బ్యాకప్ గ్యాస్ కోసం దీనిని కొనుగోలు చేయవచ్చు. ఎటువంటి కాగితాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతో వెంటనే గ్యాస్ కనెక్షన్ కావాలనుకునే వారికి ఇండేన్ ‘ఛోటూ’ ఒక అద్భుతమైన ఎంపిక.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×