E-Paper
Advertisement

దేశీ మార్కెట్ లోకి క్రేజీ విన్ ఫాస్ట్ ఈవీ ఎంట్రీ, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

దేశీ మార్కెట్ లోకి క్రేజీ విన్ ఫాస్ట్ ఈవీ ఎంట్రీ, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

VinFast VF 9 India Entry:  వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ విన్ ఫాస్ట్ ఇండియన్ ఈవీ మార్కెట్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని మోడళ్లను పరిశీలిస్తున్న ఈ కంపెనీ, ఇప్పుడు తన ఫ్లాగ్‌ షిప్ ఎలక్ట్రిక్ SUV అయిన విన్ ఫాస్ట్ VF 9ను కూడా భారత్‌ లోకి ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కారు కంపెనీ లైనప్‌ లో ఉన్న ఇతర మోడళ్ల కంటే పెద్దదిగా, మరింత ప్రీమియం ఫీచర్లతో కూడి ఉంటుంది.

ఏడుగురు హ్యాపీగా వెళ్లేలా..

VF 9ని ఫ్యామిలీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది మూడు వరుసల సీటింగ్‌ తో వస్తుంది.  సుమారు ఏడుగురు హ్యాపీగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. VF 7తో పోలిస్తే.. ఈ కారు ఎక్కువ స్పేస్, మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఆరు సీట్ల వేరియంట్‌ లో రెండవ వరుసలో లాంజ్ సీట్లు ఉండే అవకాశం ఉంది. ఇవి  లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.

ఒకే ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం

Advertisement

పనితీరు విషయానికి వస్తే..  VF 9లో పెద్ద 123 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఎకో వేరియంట్ ఒక సారి పూర్తి ఛార్జ్‌ తో సుమారు 531 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ప్లస్ వేరియంట్ కొంచెం తక్కువగా, దాదాపు 468 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. సుదూర ప్రయాణాలకు ఈ ఎలక్ట్రిక్ SUV అనుకూలంగా ఉంటుంది.

ఇందులో డ్యూయల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ తో వస్తుంది. ఈ కారు సుమారు 402 bhp పవర్,  620 Nm టార్క్ ను అందిస్తుంది. ఇది పెద్ద SUV అయినప్పటికీ, కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 200 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో బ్యాటరీని 10% నుంచి 70% వరకు కేవలం 35 నిమిషాల్లో ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది సుదూర ప్రయాణాల్లో ఉపయోగకరంగా ఉంటుంది.

VF 9 ఇంటీరియర్ గురించి..

Advertisement

VF 9 పూర్తి స్థాయి లగ్జరీ ఇంటీరియర్ ను కలిగి ఉంటుంది. ముందు, రెండవ వరుస సీట్లలో హీటింగ్, వెంటిలేషన్ ఫీచర్లు ఉంటాయి. సీట్లు ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్‌ తో వస్తాయి. డాష్‌ బోర్డ్ మధ్యలో పెద్ద 15.6 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఉంటుంది.  దీని ద్వారా కారు పలు ఫంక్షన్లను కంట్రోల్ చేస్తుంది.  భద్రత పరంగానూ చాలా అడ్వాన్స్ డ్ గా ఉంటుంది. లెవెల్ 2 ADAS టెక్నాలజీతో పాటు, పలు డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇది డ్రైవింగ్‌ ను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. విన్ ఫాస్ట్ VF 9 భారత మార్కెట్లో అడుగు పెడితే, లగ్జరీ ఎలక్ట్రిక్ SUV విభాగంలో  బలమైన పోటీదారుగా మారే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీ, మంచి రేంజ్, అంతకు మించి పనితీరు, ప్రీమియం ఫీచర్లతో మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది.

Read Also: తొలిసారి ఈవీ కారు కొంటున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×