E-Paper
Advertisement

ఎండిన ఆకులతో వంట గ్యాస్.. సరైన సమయానికి.. అద్భుతమైన ఆవిష్కరణ భయ్యా!

ఎండిన ఆకులతో వంట గ్యాస్.. సరైన సమయానికి.. అద్భుతమైన ఆవిష్కరణ భయ్యా!
Advertisement

Biomass Gasification: దేశంలో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరత, ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇరాన్ యుద్ధం.. భారత ఎల్ పీజీ దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఐటీ బాంబే ఐఐటీ బాంబే (IIT Bombay) శాస్త్రవేత్తలు అద్భుతమైన స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. రాలిపోయిన ఎండుటాకుల నుండి వంట గ్యాస్‌ను తయారు చేసే విధానాన్ని వారు కనిపెట్టారు. ఇంతకీ దీనిని ఎలా అభివృద్ధి చేశారు? ఈ ప్రయోగం ఎలా పనిచేస్తుంది? వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూద్దాం.

ఇది ఎలా పనిచేస్తుంది?

ఎండిన ఆకులు నుంచి గ్యాస్ ను వెలికితీసే టెక్నాలజీని ‘బయోమాస్ గ్యాసిఫికేషన్’ (Biomass Gasification) అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో ఎండుటాకులను సేకరించి.. వాటిని చిన్న చిన్న ‘పెల్లెట్స్’ (బిళ్లలు)గా మారుస్తారు. ఈ పెల్లెట్స్‌ను ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రత్యేక గ్యాసిఫైయర్ యూనిట్‌లో వేడి చేస్తారు. దీనివల్ల ‘ప్రొడ్యూసర్ గ్యాస్’ (Producer Gas) విడుదలవుతుంది. ఇందులో కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ ఉండటం వల్ల ఆ గ్యాస్ ఎల్ పీజీ తరహాలోనే మండే గుణం కలిగి ఉంటుందని పరిశోధకలు తెలిపారు. ఈ గ్యాస్ ను ఉపయోగించుకొని ఈజీగా వంట చేసుకోవచ్చని తెలియజేశారు.

ఆ ఇద్దరిది కీలక పాత్ర..

Advertisement

ఐఐటీ బాంబే ప్రొఫెసర్.. సంజయ్ మహాజని ఆధ్వర్యంలో బయోమాస్ గ్యాసిఫికేషన్ మెుదలైంది. కెమికల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 2014లో ఈ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్రొఫెసర్ సందీప్ కుమార్.. 2017లో ఈ ప్రాజెక్టులో చేరి సమర్థవంతమైన ‘బర్నర్’ను డిజైన్ చేసి దీనికి పేటెంట్ రావడంలో కీలక పాత్ర పోషించారు.

ప్రొఫెసర్ సంజయ్ ఏమన్నారంటే?

ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక విషయాలను ప్రొఫెసర్ సంజయ్ మహాజని పంచుకున్నారు. ‘ఎండిన ఆకులు, కొమ్మలను నేరుగా కాల్చితే అవి శక్తిని ఇస్తాయి. ఐఐటీ బాంబేలో పచ్చదనం ఎక్కువ. కాబట్టి నేలపై దారిపొడవునా రాలిపడ్డ ఆకులు, కొమ్మలను సేకరించి వాటిలో ఈ ప్రయోగం ప్రారంభించాం’ అని ఆయన తెలిపారు. వ్యర్థాలను ఇంధన వనరుగా వినియోగించుకుంటే.. భవిష్యత్తులో అన్ని సమస్యలు తీరినట్లేనని ప్రొఫెసర్ పేర్కొన్నారు.

స్టాఫ్ క్యాంటీన్ లో వినియోగం

Advertisement

ఐఐటీ బాంబే క్యాంపస్‌లోని స్టాఫ్ క్యాంటీన్‌లో ఇప్పటికే ఈ టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల అక్కడ ఎల్‌పీజీ వినియోగం 30% నుండి 40% వరకు తగ్గిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ టెక్నాలజీ వల్ల పర్యావరణ పరమైన ప్రయోజనాలు సైతం ఉన్నాయి. ఎండుటాకులను తగలబెట్టడం వల్ల వచ్చే కాలుష్యం తగ్గుతుంది. ఈ విధానం ద్వారా ఏడాదికి దాదాపు 300 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. ఈ టెక్నాలజీని హాస్టళ్లలో కూడా అమలు చేస్తే ఏడాదికి సుమారు రూ.50 లక్షల వరకు ఆదా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: ఇంట్లో ఫ్రిజ్ లేకున్నా కొత్తిమీర, పుదీనా 15 రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది.. ఈ వేసవి చిట్కాలు తెలుసా

త్వరలో అందుబాటులోకి..

ఈ సాంకేతికతను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఐఐటీ బాంబే ఇప్పటికే ‘Infixen Energy’ అనే సంస్థకు లైసెన్స్ ఇచ్చింది. తద్వారా ఈ పరికరాలు పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఐఐటీ బాంబే పరిశోధకులు.. ఎండుటాకులను వంట గ్యాస్ గా ఎలా మార్చుతున్నారో ఈ కింద ఉన్న వీడియోలో పరిశీలించండి.

Also Read: ఆఫ్రికన్ నమూనాతో.. దేశంలో ఎల్‌పీజీ సమస్యకు చెక్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×