// // Srikakulam: హైవేపై గాలిలో పల్టీలు కొట్టిన ఇన్నోవా.. -->
E-Paper
Advertisement

Srikakulam: హైవేపై గాలిలో పల్టీలు కొట్టిన ఇన్నోవా.. కారులో ఓ కుటుంబం.. ఇదిగో వీడియో!

Srikakulam: హైవేపై గాలిలో పల్టీలు కొట్టిన ఇన్నోవా.. కారులో ఓ కుటుంబం.. ఇదిగో వీడియో!
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక ఇన్నోవా కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఒడిశాలోని పర్లాఖిమిండికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు జగన్నాథుడి దర్శనం కోసం పూరీ వెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

ప్రమాద సమయంలో ఒక్కసారిగా వీచిన ఈదురుగాలుల ప్రభావంతో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా గాలిలో పల్టీలు కొడుతూ అవతలి వైపు రోడ్డుపై వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆ వేగానికి కారు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి తునాతునకలైంది. ఈ భీకర దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Advertisement

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: కడపలో విషాదం.. షార్ట్ ఫిలిం తీసేందుకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×