E-Paper
Advertisement

Robots Border Security: దేశ సరిహద్దులను కాపాడేందుకు రోబో సైనికులు.. స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాయి

Robots Border Security: దేశ సరిహద్దులను కాపాడేందుకు రోబో సైనికులు.. స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాయి
Advertisement

Robots Border Security| టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మానవులు చేయాల్సిన పనులు క్రమంగా రోబోలు, ఏఐ పరికరాలు చేస్తున్నాయి. ఇదంతా ఎవరూ ఊహించని కీలక రంగాల్లో కూడా విస్తరిస్తోంది. తాజాగా రోబోలను సైనికులుగా దేశ సరిహద్దులను కాపాలా కాసేందుకు వినియోగించాలని చైనా నిర్ణయించింది. ఈ నెల అంటే డిసెంబర్ 2025 నుంచి గువాంగ్జీ ప్రాంతం సరిహద్దులో “Walker S2” అనే హ్యూమనాయిడ్ రోబోలు బార్డర్ పాట్రోల్ డ్యూటీలోకి దిగుతాయి. ఈ ప్రాజెక్ట్ కోసం చైనాకు చెందిన యుబి టెక్ రోబోటిక్స్ (UBTech Robotics) కంపెనీ దాదాపు 300 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ సంపాదించింది.

రోబోలు ఏ పనులు చేస్తాయి?

వాకర్ S2 (Walker S2) రోబోలు బార్డర్ చెక్‌పోస్టుల్లో ప్రయాణికులకు మార్గదర్శకంగా ఉంటాయి. క్యూ లైన్‌లో నిలబడమని చెబుతాయి, శాంతి భద్రతలను, ఆర్డర్‌ను కాపాడతాయి. రోజూ సరిహద్దు పక్కన పెట్రోలింగ్ చేస్తాయి. ప్రయాణికుల లగేజి, అవసరమైన సరుకులు కూడా మోస్తాయి. షాపింగ్, ఇతర వాణిజ్య సేవల్లోనూ సహాయం చేస్తాయి.

ఫ్యాక్టరీల్లోనూ ఉపయోగం

Advertisement

ఈ రోబోలు బార్డర్‌తో పాటు ఫ్యాక్టరీల్లో కూడా పనిచేస్తాయి. ఉక్కు, రాగి, అల్యూమినియం తయారీ ప్లాంట్లలో క్వాలిటీ చెకింగ్ (నాణ్యత తనిఖీలు) చేస్తాయి. ఒకే రోబోను రెండు రంగాల్లో ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గుతుంది.

వాకర్ S2 రోబో ఎలా ఉంటుంది?

Walker S2 ఎత్తు 1.76 మీటర్లు. అంటే సగటు మనిషి ఎత్తుతో సమానంగా ఉంటుంది. ఒక చేత్తో 15 కిలోల వరకు ఎత్తగలదు. చేతులకు 11 డిగ్రీల ఫ్లెక్సిబులిటీ ఉంటుంది కాబట్టి చాలా పనులు సులువుగా చేస్తుంది. 1.8 మీటర్ల ఎత్తులో ఉన్న వస్తువులు కూడా తీయగలదు. కూర్చోవడం, లేవడం, గంటకు 7.2 కి.మీ వేగంతో నడవడం అన్నీ వాకర్ రోబోకు సాధ్యమే.

బ్యాటరీని తానే మార్చుకుంటుంది!

Advertisement

ఈ రోబోకి అతి పెద్ద ప్రత్యేకత ఏంటంటే.. బ్యాటరీ అయిపోతే మనుషుల సాయం లేకుండా తానే మార్చుకుంటుంది. కేవలం 3 నిమిషాల్లో పాత బ్యాటరీ తీసి కొత్తది పెట్టేస్తుంది. రెండు బ్యాటరీలు ఉంటాయి కాబట్టి ఒకటి ఛార్జింగ్‌లో ఉన్నా మరొకటితో పని ఆగదు. రోజుకు 24 గంటలూ ఎడతెరిపి లేకుండా పనిచేయగలదు.

స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలదు

Walker S2లో Brainnet 2.0 అనే అత్యాధునిక AI ఉంది. సాధారణ కెమెరాలతోనే చుట్టూ ఏం జరుగుతోందో అర్థం చేసుకుని తనంతట తాను నడుస్తుంది, పనులు చేస్తుంది. కొత్త ప్రదేశానికి వెళ్లినా త్వరగా అలవాటు పడుతుంది.

చైనాలో గతంలో కూడా రోబోల ఉపయోగం

చైనా ఎయిర్‌పోర్టులు, పోలీస్ స్టేషన్లు, పెద్ద ఈవెంట్లలో ఇప్పటికే రోబోలు పనిచేస్తున్నాయి. షాంఘై, షెన్‌జెన్, చెంగ్డూ నగరాల్లో రోబోలు పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు బార్డర్‌లో కూడా రోబో యుగం మొదలవుతోంది. మనుషులు చేయలేనంత కష్టమైన, నిరంతరం కావాల్సిన పనుల్ని రోబోలు సులువుగా చేస్తున్నాయి. వాకర్ S2 బార్డర్ పెట్రోల్ నిర్ణయంతో రోబోటిక్స్ రంగంలో చైనా మరో అడుగు ముందుకేసింది!

Also Read: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×