E-Paper
Advertisement

అబ్బా ఏముంది మావా ఈ ఫోను.. బుక్కులా విచ్చుకునే Huawei Pura X Max వచ్చేసింది!

అబ్బా ఏముంది మావా ఈ ఫోను.. బుక్కులా విచ్చుకునే Huawei Pura X Max వచ్చేసింది!
Advertisement

Huawei Pura X Max: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్లంటే భలే క్రేజ్ ఏర్పడింది. ఇప్పటిదాకా ఫోల్డబుల్ అంటే మనకు శాంసంగ్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ, ఇప్పుడు చైనా దిగ్గజం హువాయ్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో Pura X Max అనే కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఇలాంటి వెడల్పుగా ఉండే ఫోన్లను తీసుకురావాలని ఆలోచిస్తుండగానే.. హువాయ్ గప్‌చుప్‌గా పని ముగించేసి మార్కెట్లోకి వదిలేసింది. టెక్నాలజీ రేసులో ఆ దిగ్గజాల కంటే ఒకడుగు ముందే ఉందన్నమాట.

7.7 ఇంచుల భారీ స్క్రీన్..

ఈ ఫోన్ స్పెషాలిటీ ఏమిటంటే.. ఇది చూడటానికి ఒక చిన్న పుస్తకంలా వెడల్పుగా ఉంటుంది. ఈ ఫోన్‌ను తెరిస్తే లోపల 7.7 ఇంచుల భారీ స్క్రీన్ కనిపిస్తుంది. దాదాపు ఒక టాబ్లెట్ వాడుతున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇక బయటి వైపు కూడా 5.4 ఇంచుల స్క్రీన్ ఇచ్చారు. సినిమా చూసినా, గేమ్స్ ఆడినా రంగులు భలే రిచ్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా మండుటెండలో బయట నిలబడి ఫోన్ చూసినా స్క్రీన్ మీద అక్షరాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. హువాయ్ సొంత చిప్‌సెట్ వాడటం వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

Advertisement

Also Read: 200MP కెమెరా, 7050mAh భారీ బ్యాటరీతో భారత్‌లోకి వచ్చేస్తోన్న Find X9 Ultra.. ఫీచర్లు కెవ్వు కేక!

కెమెరా సెటప్ సూపర్బ్..

ఈ ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు చాలా పల్చగాఉంటుంది. ఇంత సన్నగా ఉన్నా కూడా దీనిలో 5,300mAh పెద్ద బ్యాటరీని సెట్ చేశారు. ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా ఎక్కుతుంది. ఇక ఫోటోల విషయానికి వస్తే.. వెనుక 3 అదిరిపోయే కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ అన్నీ 50 ఎంపీ రేంజ్‌లో ఉన్నాయి కాబట్టి.. ఫొటోలు పీక్స్ అని చెప్పొచ్చు. రాత్రి పూట కూడా పగలు తీసినట్టుగా మంచి క్వాలిటీ ఫొటోలు వచ్చేలా ఏఐ టెక్నాలజీని వాడారు. ఫోన్ మూసినా, తెరిచినా సెల్ఫీలు తీసుకునేలా రెండు వైపులా కెమెరాలు ఇచ్చారు.

ధర వింటే షాక్ అవ్వాల్సిందే..

Advertisement

ఇన్ని ఫీచర్లు ఉన్నాయి కాబట్టి.. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంది. చైనాలో దీని బేస్ మోడల్ రూ.1.61 లక్షలు ఉంటే.. హై ఎండ్ మోడల్ ఏకంగా రూ.2 లక్షల వరకు ఉంది. చైనాలో ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్లో హువాయ్‌దే హవా. అయితే విడిభాగాల ఖర్చు పెరుగుతుండటంతో రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని కంపెనీ వాళ్లే అంటున్నారు. ప్రస్తుతం ఇది చైనాలో మాత్రమే విడుదలైది. భారత్‌లోకి ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో ఇంకా తెలియదు కానీ.. వస్తే మాత్రం మార్కెట్‌ను ఒక ఊపు ఊపేయడం ఖాయం.

Also Read: వామ్మో.. ఫొటో చూపించి ఫోన్లను అన్‌లాక్ చేయొచ్చా? ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో భారీ భద్రతా లోపం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×