E-Paper
Advertisement

తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా!

తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా!
Advertisement

Telangana IPS promotions: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ పదోన్నతులు కల్పించింది. 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో, పోలీసు ఉన్నతాధికారుల స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

పదోన్నతి పొందిన వారిలో 1995 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అదనపు డీజీలుగా సేవలు అందిస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్, స్వాతి లక్రా, వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావులకు డీజీ హోదా కల్పించారు. అలాగే, 1996 బ్యాచ్‌కు చెందిన చారుసిన్హా, అనిల్ కుమార్, ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వి.సి. సజ్జనార్లకు కూడా డీజీ ర్యాంకులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఐపీఎస్ పే మ్యాట్రిక్స్ రూల్స్ 2016 ప్రకారం, లెవల్ 16 హోదాలో వీరికి ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

అయితే, ఈ అధికారులకు పదోన్నతి లభించినప్పటికీ, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వీరంతా ప్రస్తుతం ఏ బాధ్యతల్లో ఉన్నారో అదే స్థానాల్లో కొనసాగుతారనిప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల విధుల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా, ఉన్నత హోదాలో వారు తమ సేవలను కొనసాగించనున్నారు.

Read Also: కాళేశ్వరం పై హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు, BRS నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు: మహేష్ కుమార్ గౌడ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×