E-Paper
Advertisement

Smart Phone Privacy Tips: హోలీ వేడుకల్లో ఫోన్ డ్యామేజ్.. రిపేర్ కు ముందు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Smart Phone Privacy Tips: హోలీ వేడుకల్లో ఫోన్ డ్యామేజ్..  రిపేర్ కు ముందు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Advertisement

Smart Phone Privacy Tips: హోలీ అంటే రంగుల పండుగ. చిన్నా పెద్ద అంతా వీధుల్లో రంగులు చిమ్ముకుంటూ సందడి చేస్తారు. హోలీ సంబరాల్లో పొరపాటును మీ స్మార్ట్ ఫోన్ తడిచిపోతే? రీపేర్ కు ఇచ్చే ముందు, కొన్ని ప్రైవసీ టిప్స్ పాటించండి. ఈ రోజుల్లో ఫోన్ అంటే సీక్రెట్ దాచుకునే బాక్స్ లాంటిది. వ్యక్తిగత ఫొటోలు, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ యాప్‌లు, సోషల్ మీడియా అకౌంట్స్, పాస్‌వర్డ్‌లు ఇలా అన్నింటినీ ఫోన్ లో స్టోర్ చేసుకుంటున్నాం. రిపేర్ చేసినప్పుడు ఇవేవీ పోకుండా, వ్యక్తిగత డేటా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే.. డేటాను క్లౌడ్ స్టోరేజ్ లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకోవాలి. సిమ్ కార్డ్, మెమరీ కార్డ్‌ను తీసేసి యాప్‌లను లాగ్ అవుట్ చేయాలి.

ప్రైవసీ టిప్స్

రిపేర్ చేయడానికి వ్యక్తిగత డేటా అవసరం లేకపోతే, ఫోన్ ను రీసెట్ చేయండి. అలాగే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలో మాత్రమే రిపేర్ చేయించడం బెటర్. అలాగే ఫోన్ రిపేర్ కు ఇచ్చిన వారి వద్ద నుంచి సరైన రిసీట్ తీసుకోవాలి. మీ ఫోన్‌ను రిపేర్ కు ఇచ్చే ముందు డేటా బ్యాకప్ పెట్టుకోండి. కాంటాక్ట్‌లు, ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన ఫైల్‌లను క్లౌడ్ స్టోరేజ్ లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకోండి. రిపేర్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే, మీ డేటాను కోల్పోయే అవకాశం ఉంది.

వ్యక్తిగత డేటా దుర్వినియోగం కాకుండా

Advertisement

సిమ్ కార్డ్, మెమరీ కార్డ్‌ను తీసేయండి. వీటిల్లోని వ్యక్తిగత తేడా వేరొకరి చేతిలో పడితే దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాంకింగ్ యాప్‌లు, ఈ-మెయిల్, సోషల్ మీడియా, పేమెంట్ యాప్‌ల నుండి సైన్ అవుట్ అవ్వండి. అలాగే యాప్ లో ఆటో-లాగిన్ ఫీచర్‌లను స్టాప్ చేయండి. కొన్ని రిపేర్లకు స్క్రీన్ యాక్సెస్ అవసరం. అలాంటప్పుడు స్క్రీన్ లాక్‌ను తీసివేసి, రిపేర్ పూర్తైన తర్వాత స్క్రీన్ లాక్ చేయండి.

Also Read:  ఐఫోన్ బడ్జెట్ మోడల్ ఇండియాలో లాంచ్.. 48MP కెమెరా, A19 చిప్‌తో ధర ఎంతంటే

రీసెట్ చేయండి

Advertisement

రిపేర్ కు ముందుగా మీ డేటాను బ్యాకప్ పెట్టుకుని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. దీంతో మీ ఫోన్ లో వ్యక్తిగత డేటా తొలగిపోతుంది. ఫోన్ రిపేర్ కు ఇచ్చిన బిల్లులు జాగ్రత్త పెట్టుకోండి. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తే అవి ఉపయోగపడతాయి. సహాయపడతాయి. అలాగే ఫోన్ లో ఏం రిపేర్ చేశారో, రాత పూర్వకంగా రసీదు తీసుకోండి. అలాగే ఫోన్ తీసుకున్న తర్వాత, షాపులో ఉండగానే.. కెమెరా, స్పీకర్లు, ఛార్జింగ్, డిస్ప్లే చెక్ చేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×