E-Paper
Advertisement

Iran School Airstrike Minab: యుద్ధానికి బలైపోయిన బాల్యం.. 165 మంది బాలికలకు సామూహిక అంత్యక్రియలు!

Iran School Airstrike Minab: యుద్ధానికి బలైపోయిన బాల్యం.. 165 మంది బాలికలకు సామూహిక అంత్యక్రియలు!
Advertisement

Iran School Airstrike Minab: పశ్చిమ ఆసియాలో యుద్ధం మిగిల్చిన అత్యంత విషాదకర దృశ్యం ఇరాన్‌లో వెలుగుచూసింది. మినాబ్ నగరంలోని ఒక పాఠశాల లక్ష్యంగా జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు వందలాది కుటుంబాల్లో చీకటిని నింపాయి. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 180 మంది చనిపోగా వారిలో 165 మంది అభం శుభం తెలియని బాలికలే కావడం గమనార్హం. ప్రాణాలు కోల్పోయిన ఈ చిన్నారులందరినీ ఒకే చోట సమాధి చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి సంబంధించిన హృదయ విదారక ఫోటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ సోషల్ మీడియా వేదికగా అవేద‌నతో ట్వీట్ చేశారు. “ప్రాథమిక పాఠశాలపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో మరణించిన 160 మందికి పైగా అమాయకపు బాలికల కోసం తవ్విన సమాధులు ఇవి. వారి శరీరాలు ఛిద్రమైపోయాయి. మిస్టర్ ట్రంప్ వాగ్దానం చేసిన ‘రక్షణ’ అసలు రూపం వాస్తవంలో ఇలా ఉంటుంది. గాజా నుండి మినాబ్ వరకు.. అమాయకులు దారుణంగా హత్య చేయబడుతున్నారు అని మండి ప‌డ్డారు.

Advertisement

బాలికలను సమాధి చేసేందుకు వరుసగా పెద్ద సంఖ్యలో తవ్విన గోతులు ఆ ప్రాంతంలో నెలకొన్న భీకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పాఠశాల సమీపంలోనే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) కేంద్రం ఉండటం వల్ల ఆ ప్రాంతంపై వైమానిక దాడులు జరిగాయని ఆ క్రమంలోనే స్కూల్‌పై బాంబులు పడి ఇంతటి ఘోరం జరిగినట్లు సమాచారం.

నేడు జరిగిన ఈ చిన్నారుల అంతిమయాత్రలో వేలాది మంది ఇరాన్ ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. తమ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ దాడులపై విస్మయం వ్యక్తం చేస్తోంది. యుద్ధం పేరుతో అమాయక విద్యార్థుల ప్రాణాలు తీయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకోగా మినాబ్ నగరం కన్నీటి సంద్రమైంది.

Advertisement

Read Also: Iran Earthquake: బాంబుల సెగకు తోడైన భూకంపం.. ఇరాన్‌లో ప్రకృతి ప్రకోపం.. వణుకుతున్న గెరాష్!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×