E-Paper
Advertisement

Photo Location: మీ ఫోటోల్లో లొకేషన్ డేటా ఉంటుందని తెలుసా? సెండ్ చేసే ముందు ఇలా తొలగించండి

Photo Location: మీ ఫోటోల్లో లొకేషన్ డేటా ఉంటుందని తెలుసా? సెండ్ చేసే ముందు ఇలా తొలగించండి
Advertisement

Photo Location Data| చాలా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ ముఖ్యమైన ప్రైవసీ విషయం తెలియదు. మీ ఫోన్ తో ఫోటో తీసినప్పుడల్లా ఫోన్ లొకేషన్ డేటా ఆ ఫొటోలో సేవ్ అయిపోతుంది. అయితే ఇది రహస్యంగా హిడెన్ డేటా. ఈ హిడెన్ లొకేషన్ ని మెటాడేటా లేదా జియోట్యాగింగ్ అంటారు. ఫోటో ఎక్కడ తీశారో రికార్డ్ చేస్తుంది. ఈ డేటా ఇతరులకు మీ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది. మీ ఇల్లు, వర్క్‌ప్లేస్, ట్రావెల్ హిస్టరీ అంతా తెలిసిపోతుంది. చాలా యాప్స్, ప్లాట్‌ఫామ్‌లు ఈ డేటాని యాక్సెస్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మంచి విషయం ఏమిటంటే ఈ ఫీచర్‌ను సులువుగా కంట్రోల్ చేయవచ్చు. ఫోటోలకు లొకేషన్ డేటా ఆఫ్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ ఒక నిమిషం లోపు పూర్తవుతుంది.

ఫోటో లొకేషన్ డేటా అంటే ఏమిటి?

ఇమేజెస్‌లో ఫోటో లొకేషన్ డేటా జీపీఎస్ కోఆర్డినేట్స్ స్టోర్ చేస్తుంది. ఫోన్ చాలా సార్లు ఆటోమాటిక్‌గా ఈ డేటా యాడ్ చేస్తుంది. డివైస్ లొకేషన్ సర్వీసెస్ ఉపయోగించి ఫోటోలు ట్యాగ్ చేస్తుంది. ఈ ఫీచర్ ఫోటోలను ప్రాంతాలను బట్టి ఆర్గనైజ్ చేయడానికి సహాయపడుతుంది. యాప్స్ లొకేషన్ బట్టి మెమరీస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే తెలియకుండా షేర్ చేస్తే ప్రైవసీ రిస్క్ ఉంది.

ఫోటోల నుంచి లొకేషన్ డేటా ఎందుకు తొలగించాలి?

Advertisement

లొకేషన్ డేటా సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటపెట్టవచ్చు. మీరు ఫోటో సెండ్ చేస్తే రిసీవ్ చేసినవాళ్లు అందులోని దాగిన ఉన్న వివరాలు (హిడెన్ డీటెయిల్స్) చూడవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కొన్నిసార్లు మెటాడేటా ఆటోమాటిక్‌గా తొలగిస్తాయి. అయితే చాలా మెసేజింగ్ యాప్స్ ఈ డేటాని తొలగించకుండా అలాగే ఉంచుతాయి. దీంతో వీటి దుర్వినియోగం చేసే ప్రమాదం పెరుగుతుంది. లొకేషన్ ట్యాగింగ్ ఆఫ్ చేస్తే డిజిటల్ సేఫ్టీ మెరుగుపడుతుంది.

ఫోన్‌లో ఫోటో లొకేషన్ డేటా ఎలా తొలగించాలి?

గూగుల్ టూల్స్ ఉపయోగించి ఫోటో లొకేషన్ డేటా తొలగించ వచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ ఈ స్టెప్స్ పని చేస్తాయి. మీ డివైస్ బట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి.

  • ఫోటో లో లొకేషన్ డేటా తొలగించడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
  • ముందు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్ అన్‌లాక్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలి. ఆండ్రాయిడ్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఐఫోన్‌లో సఫారి బ్రౌజర్ ఓపెన్ చేయండి.
  • సెర్చ్ బార్‌లో “Google Dashboard” టైప్ చేసి సెర్చ్ చేయండి.
  • గూగుల్ డాష్‌బోర్డ్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. గూగుల్ అకౌంట్ డాష్‌బోర్డ్ యాక్సెస్ చేయండి. పేజీలో నెమ్మదిగా స్క్రోల్ చేయండి.
  • గూగుల్ ఫోటోస్ సెక్షన్ చూడండి.
  • గూగుల్ ఫోటోస్ కింద సెట్టింగ్స్ ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్లీ స్క్రోల్ చేయండి.
  • “Location” ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • “Estimate Missing Locations” అనే టాగిల్ కనిపిస్తుంది. ఈ టాగిల్ వెంటనే ఆఫ్ చేయండి.
  • డిసేబుల్ అయిన తర్వాత కొత్త ఫోటోలు లొకేషన్ డేటా సేవ్ చేయవు.
  • కెమెరా జీపీఎస్ డేటా ఫోటోల్లో అటాచ్ చేయదు.
Advertisement

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

ఈ సెట్టింగ్ ఆఫ్ చేసిన తర్వాత ఏమవుతుంది?

ఫోన్ సాధారణంగా ఫోటోలు తీస్తుంది. ఇమేజ్ క్వాలిటీ మారదు. ఫోటోలు ఎగ్జాక్ట్ లొకేషన్ రికార్డ్ చేయవు. ప్రైవసీ లెవల్ వెంటనే పెరుగుతుంది. ఈ ఫీచర్ మళ్లీ ఎప్పుడైనా ఆన్ చేయవచ్చు. మీ డేటాపై పూర్తి కంట్రోల్ మీ చేతుల్లో ఉంటుంది.

ఫోటో సేఫ్టీకి అదనపు ప్రైవసీ టిప్స్

ఫోన్‌లో యాప్ పర్మిషన్స్ రివ్యూ చేయండి. అనవసర యాప్స్‌కు లొకేషన్ యాక్సెస్ డిసేబుల్ చేయండి. ఒరిజినల్ ఫోటోలు పబ్లిక్‌గా షేర్ చేయొద్దు. ట్రస్టెడ్ ప్లాట్‌ఫామ్‌లు మాత్రమే ఫోటో షేరింగ్‌కు ఉపయోగించండి. ముఖ్యమైన ఇమేజెస్ సెండ్ చేసే ముందు డీటెయిల్స్ చెక్ చేయండి. ఈ చిన్న స్టెప్స్ ద్వారా ప్రైవసీ ప్రొటెక్షన్‌ని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×