E-Paper
Advertisement

ఏసీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ WHO ఫార్ములాతో.. 70% కరెంటు బిల్లు ఆదా!

ఏసీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ WHO ఫార్ములాతో.. 70% కరెంటు బిల్లు ఆదా!
Advertisement

WHO AC Tips: ఎండలు మండిపోతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఏసీల వాడకం గణనీయంగా పెరిగిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతీ నిమిషం ఏసీలు రన్ అవుతూనే ఉన్నాయి. ఈ వాడకానికి తగ్గట్లే విద్యుత్ బిల్లులు పేలిపోతున్నాయంటూ పలువురు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన కొన్ని మార్గదర్శకాలను ఈ కథనంలో ఇవ్వడం జరుగుతోంది. వీటిని పాటిస్తే విద్యుత్ బిల్లును ఏకంగా 70 శాతం వరకు తగ్గించుకోవచ్చు. ఆ స్మార్ట్ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఏసీలో సరైన టెంపరేచర్..

చాలామంది ఏసీ ఆన్ చేయగానే గది త్వరగా చల్లబడాలని 16 లేదా 18 డిగ్రీలకు సెట్ చేస్తారు. కానీ దీనివల్ల గది త్వరగా చల్లబడదు. పైగా కంప్రెషర్‌పై లోడ్ పడి కరెంట్ బిల్లు మోత మోగుతుంది. డబ్లూహెచ్ఓ నిబంధనల ప్రకారం.. మానవ శరీరానికి 24 డిగ్రీల నుండి 26 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యంత అనుకూలమైనది. ఆరోగ్యకరమైనది కూడా. ఈ టెంపరేచర్ వద్ద ఏసీని నడపడం వల్ల ప్రతి ఒక్క డిగ్రీ పెరిగేకొద్దీ దాదాపు 6% విద్యుత్ ఆదా అవుతుంది.

ఏసీ, ఫ్యాన్ కాంబినేషన్

Advertisement

ఏసీ ఆన్ చేసినప్పుడు గదిలోని సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో (1 లేదా 2లో) తిరగనివ్వండి. ఇది ఏసీ నుండి వచ్చే చల్లటి గాలిని గదిలోని నలుమూలలకూ వేగంగా విస్తరించేలా చేస్తుంది. దీనివల్ల కంప్రెషర్‌పై ఒత్తిడి తగ్గి.. గది త్వరగా కూల్ అవుతుంది.

తలుపులు, కిటికీలు క్లోజ్..

ఏసీ ఆన్ చేయడానికి ముందు గది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి ఉన్నాయో లేదో చూసుకోండి. కిటికీలకు మందపాటి కర్టెన్లు వేయడం ద్వారా బయటి వేడి లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు. గదిలోకి వేడి గాలి రానంత కాలం ఏసీ తక్కువ విద్యుత్‌ను వాడుకుంటూనే గదిని రోజంతా చల్లగా ఉంచుతుంది.

Advertisement

Also Read: కరెంట్ బిల్లు రాదు.. ఏసీ అక్కర్లేదు.. ఈ 6 ట్రిక్స్‌తో మీ గది ‘కాశ్మీర్’ అయిపోద్ది!

టైమర్, స్లీప్ మోడ్

రాత్రి పూట పడుకునేటప్పుడు ‘స్లీప్ మోడ్’ (Sleep Mode) ఆన్ చేయడం అలవాటు చేసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఇది ప్రతి గంటకు ఒక డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రతను పెంచుతూ రాత్రి వేళల్లో గది ఓవర్ కూలింగ్ కాకుండా చూస్తుంది. అలాగే ఉదయం పూట ఏసీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా టైమర్ సెట్ చేసుకుంటే అనవసరపు కరెంటు వృథాను అడ్డుకోవచ్చు. మెుత్తంగా ఇలాంటి చిన్న మార్పులు చేయడం ద్వారా ఈ వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే.. ఏసీ వచ్చే అదనపు కరెంటు బిల్లును రూ.1000కి పరిమితం చేయవచ్చని నిపుణులు సైతం పేర్కొంటున్నారు.

Also Read: Jio Plans: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 13 ఓటీటీ యాప్స్ ఫ్రీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×