E-Paper
Advertisement

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ సరికొత్త షెడ్యూల్.. రంగంలోకి ప్రభాస్, తృప్తి డిమ్రి!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ సరికొత్త షెడ్యూల్.. రంగంలోకి ప్రభాస్, తృప్తి డిమ్రి!
Advertisement

Spirit Shoot: గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’. ఇప్పటికే ప్రకటించిన భారీ నాన్‌స్టాప్ షెడ్యూల్‌లో భాగంగా, మే 23 నుండి ఈ సినిమా సరికొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా షెడ్యూల్‌లో సరికొత్త ట్విస్ట్ ఏంటంటే.. హీరో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.

Read also-‘పెద్ది’లో రామ్ చరణ్ ఫేవరెట్ అదే.. ట్విస్ట్‌ మాత్రం అదిరిపోద్దంటున్న బుచ్చిబాబు..

కీ సీన్స్ ప్లాన్ చేసిన సందీప్ వంగా

Advertisement

ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, తృప్తి దిమ్రి కాంబినేషన్‌లో వచ్చే కొన్ని అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రబృందం చిత్రీకరించనుందని సమాచారం. ‘యానిమల్’ సినిమాతో తృప్తి దిమ్రికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సందీప్ వంగా, ఇప్పుడు ‘స్పిరిట్’లో ఆమె పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు టాక్. ప్రభాస్ లీన్ అండ్ ఇంటెన్స్ లుక్‌కు, తృప్తి స్క్రీన్ ప్రెజెన్స్‌కు మధ్య వచ్చే సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Read also-‘డ్రాగన్’ లుక్ కోసం తారక్ ప్రాణం పెడితే వాళ్లు మాత్రం.. ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

పక్కా ప్లానింగ్‌తో

Advertisement

ఈ చిత్రం కోసం ప్రభాస్ మిగతా ప్రాజెక్ట్‌లను కాస్త పక్కన పెట్టి మరి బల్క్ డేట్స్ కేటాయించారు. కేవలం 95 రోజుల్లోనే టోటల్ షూటింగ్‌ను కంప్లీట్ చేయాలనే పక్కా ప్లానింగ్‌తో దర్శకుడు సందీప్ వంగా రోజువారీ షెడ్యూల్‌ను డిజైన్ చేశారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక పోలీస్ స్టేషన్ సెట్‌తో పాటు మరికొన్ని ప్రదేశాలలో ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మొట్టమొదటిసారిగా ఒక పవర్‌ఫుల్ రఫ్‌ అండ్ రెబల్ IPS ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నెగెటివ్ షేడ్ ఉన్న కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. భూషణ్ కుమార్ (T-Series), భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజా అప్‌డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌లో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×