E-Paper
Advertisement

ఏసీ 24°Cలో పెట్టినా కరెంటు బిల్లు బాధిస్తోందా? ఈ స్మార్ట్ ట్రిక్స్ పాటిస్తే సరి!

ఏసీ 24°Cలో పెట్టినా కరెంటు బిల్లు బాధిస్తోందా? ఈ స్మార్ట్ ట్రిక్స్ పాటిస్తే సరి!
Advertisement

AC Power Saving: వేసవి కాలం వచ్చిందంటే చాలు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. భానుడి భగభగలకు తోడు, నెలాఖరున వచ్చే కరెంట్ బిల్లు చాలా మంది గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. అయితే ఏసీని 24°C వద్ద నడిపితే బిల్లు తక్కువ వస్తుందని అందరూ భావిస్తుంటారు. కానీ అలా చేసినా కూడా బిల్లులు భారీగానే వస్తున్నాయని పలువురు వాపోతున్నారు. అయితే ఏసీని కేవలం ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మాత్రమే సరిపోదని కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే ఏసీ బిల్లును ఏకంగా 30 శాతం వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

‘ఫ్యాన్’ కాంబినేషన్

చాలామంది ఏసీ ఆన్ చేయగానే గదిలోని సీలింగ్ ఫ్యాన్‌ను బంద్ చేస్తారు. కానీ ఇది సరైన పద్దతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీని 24°C లేదా 25°C వద్ద ఉంచి దాంతో పాటు ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో (1 లేదా 2) రన్ చేయడం వల్ల గదిలోని చల్లటి గాలి వేగంగా అన్ని వైపులా విస్తరిస్తుందని పేర్కొంటున్నారు. దీనివల్ల ఏసీ కంప్రెసర్‌పై భారం తగ్గి విద్యుత్ ఆదా అవుతుందని వివరిస్తున్నారు.

‘డ్రై మోడ్’ మాయాజాలం

Advertisement

ఉక్కపోత లేదా తేమ (Humidity) ఎక్కువగా ఉండే వాన, చలికాలల్లో ఏసీని నార్మల్ మోడ్‌లో కాకుండా ‘డ్రై మోడ్’ లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది గదిలోని తేమను పీల్చేసి చల్లదనాన్ని ఇస్తుందని పేర్కొంటున్నారు. ఈ మోడ్‌లో కంప్రెసర్ తక్కువ సమయం పనిచేస్తుంది కాబట్టి పవర్ బిల్లు దాదాపు 20 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

ఫిల్టర్ల శుభ్రత

ఏసీ ఫిల్టర్లలో దూళి పేరుకుపోతే గదిని చల్లబరచడానికి కంప్రెసర్ ఎక్కువ సమయం కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా కరెంట్ బిల్లు మోత మోగొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ప్రతి 15 రోజులకు ఒకసారి ఏసీ ఫిల్టర్లను తీసి ఇంట్లోనే శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలని హితవు పలుకుతున్నారు.

తలుపులు, కిటికీల లీకేజీలు

Advertisement

గది ఎంత ప్యాక్‌డ్‌గా ఉంటే పవర్ బిల్లు అంత తక్కువ వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. తలుపులు, కిటికీల సందుల నుండి చల్లటి గాలి బయటకు పోకుండా ‘డోర్ సీల్స్’ లేదా ‘ఫోమ్ టేప్స్’ వాడాలని సూచిస్తున్నారు. అలాగే పగటిపూట గదిలోకి ఎండ రాకుండా మందపాటి కర్టెన్లు వాడటం వల్ల ఏసీపై లోడ్ తగ్గుతుందని చెబుతున్నారు.

Also Read: ఫ్రిడ్జ్ అక్కర్లేదు.. పైసా ఖర్చు లేదు.. పాలు, పెరుగు ఎప్పటికీ తాజాగా!

టైమర్, స్లీప్ మోడ్ వాడకం

రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ‘స్లీప్ మోడ్’ ఆన్ చేయడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మోడ్ వల్ల ప్రతి గంటకు ఒక డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరిగి మన శరీరానికి సరిపడా చల్లదనాన్ని ఇస్తూనే పవర్‌ను సేవ్ చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే తెల్లవారుజామున ఏసీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా Timer సెట్ చేసుకోవడం వల్ల కూడా అనవసరపు బిల్లును అరికట్టవచ్చని హితవు పలుకుతున్నారు.

Also Read: iPhone Fold Leaks.. యాపిల్ తొలి మడత ఫోన్ ఇలా ఉండబోతుందా? డిజైన్ చూస్తే ఆశ్చర్యపోతారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×