E-Paper
Advertisement

వాట్సాప్ హ్యాకర్ల కొత్త స్కెచ్.. మీ చాట్స్ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ 5 సెట్టింగ్స్ మార్చండి!

వాట్సాప్ హ్యాకర్ల కొత్త స్కెచ్.. మీ చాట్స్ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ 5 సెట్టింగ్స్ మార్చండి!
Advertisement

WhatsApp Security Tips: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి మొబైల్‌లో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కచ్చితంగా ఉంటుంది. ఎక్కువగా దీని ద్వారానే మన వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, ముఖ్యమైన బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. అలాగే చాలామంది పర్సనల్ చాట్స్ విషయంలో ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వారి చాట్స్, ఫొటోలు ఎవరైనా హాకర్లు లీక్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారేమో అని. అందుకే హ్యాకర్ల కన్ను ఎప్పుడూ వాట్సప్‌పైనే ఉంటుంది. కాబట్టి.. మీ వాట్సప్ అకౌంట్ ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే కొన్ని కీలకమైన సెట్టింగ్స్ వెంటనే మార్చుకోవాలి. అవేంటంటే..

టూ స్టెప్ వెరిఫికేషన్:

వాట్సాప్‌కు రక్షణ కవచంలా పనిచేసేది ఈ టూ స్టెప్ వెరిఫికేషన్. దీనిని ఎనేబుల్ చేసుకున్నప్పుడు మీరు కచ్చితంగా 6 అంకెల పిన్ నంబర్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మీ సిమ్‌కార్డు ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినా.. ఈ పిన్ తెలియకుండా వారు ఖాతాను ఓపెన్ చేయలేరు. ఇది హ్యాకింగ్ నుంచి మిమ్మల్ని కాపాడే అత్యంత శక్తివంతమైన ఆయుధం.

Advertisement

Also Read: యాపిల్ కొత్త స్కెచ్ మాములుగా లేదుగా.. ఆండ్రాయిడ్ ఫోన్ ధరకే iPhone 16!

పాస్‌కీ, బయోమెట్రిక్ లాక్:

చాలామంది ఫోన్ లాక్ తీసి పక్కన పెడుతుంటారు. అప్పుడు ఇతరులు సులభంగా వాట్సాప్ చాట్స్ చూసే అవకాశం ఉంటుంది. దీనిని నివారించడానికి యాప్ లోపల ఉండే ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడి లాక్‌ని ఆన్ చేసుకోవాలి. అలాగే కొత్తగా వచ్చిన పాస్‌కీ ఫీచర్ ద్వారా మీ వేలిముద్ర లేదా ఫేస్ స్కాన్‌తోనే లాగిన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. తద్వారా మీ వాట్సప్ పాస్‌వర్డ్‌ను హాకర్లు దొంగిలించే ప్రమాదం ఉండదు.

ప్రైవసీ చెకప్, అనౌన్ కాల్స్:

Advertisement

వాట్సప్ సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవసీ చెకప్ ద్వారా మీ ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్ ఎవరెవరు చూడాలి అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే ఫీచర్‌ను ఆన్ చేయడం ద్వారా గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్‌ను అడ్డుకోవచ్చు. ఎందుకంటే.. హ్యాకర్లు తరచుగా ఇలాంటి కాల్స్ ద్వారానే వినియోగదారులను ట్రాప్ చేస్తుంటారు.

లింక్డ్ డివైజెస్ పట్ల జాగ్రత్త:

మీ వాట్సప్ అకౌంట్ వేరే కంప్యూటర్లలో లేదంటే వెబ్ బ్రౌజర్లలో లాగిన్ అయి ఉందో లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. లింక్డ్ డివైజెస్ సెక్షన్‌లోకి వెళ్లి మీకు తెలియని పరికరాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వాటిని లాగ్ అవుట్ చేయాలి. ఈ ఐదు జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ వాట్సప్ చాట్స్, వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే అవకాశం ఉండదు.

Also Read: భారీగా తగ్గిన ‘Samsung Galaxy Z Fold 7’ ధర.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వాడితే ఇంకా తక్కువకే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×