E-Paper
Advertisement

రోల్స్ రాయిస్ To ఫెరారీ.. ప్రపంచంలో 7000 లగ్జరీ కార్లు ఉన్న ఏకైక వ్యక్తి ఇతడే!

రోల్స్ రాయిస్ To ఫెరారీ.. ప్రపంచంలో 7000 లగ్జరీ కార్లు ఉన్న ఏకైక వ్యక్తి ఇతడే!
Advertisement

World’s MosLifestyle: ప్రపంచంలో చాలా మంది ధనవంతులు ఉంటారు. వారి దగ్గర ఎన్నో భవంతులు, లగ్జరీ కార్లు ఉంటాయి. కానీ, బ్రూనే సుల్తాన్ హసనాల్ బోల్కియా లైఫ్ స్టైల్ ముందు వాళ్లంతా దిగదుడుపే అని చెప్పుకోక తప్పదు. ఆయన లావిష్ జీవితాన్ని చూస్తూ ఎవ్వరికైనా మతిపోక తప్పదు. బ్రూనే దేశానికి చెందిన ఈ సుల్తాన్ ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తుల్లో ఒకరుగు గుర్తింపు తెచ్చుకున్నారు.

ఏకంగా 7 వేల లగ్జరీ కార్లు 

సుల్తాన్ బోల్కియా లగ్జరీ గురించి చెప్పాలంటే, ముందుగా ఆయన కార్ల గురించి మాట్లాడుకోవాలి. ఆయన దగ్గర ఏకంగా 7,000 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో 600కి పైగా రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. 450 ఫెరారీ కార్లు,  380 బెంట్లీ కార్లు కూడా ఆయన కలెక్షన్‌ లో ఉన్నాయి. లాంబోర్గిని, పోర్షే, బీఎండబ్ల్యూ లాంటి టాప్ లగ్జరీ బ్రాండ్లకు చెందిన కార్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ కార్ల మొత్తం విలువ సుమారు 5 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

ప్రపంచంలోనే ప్రత్యేకమైన కార్లు

Advertisement

హసనాల్ బోల్కియా దగ్గర ఉన్న కార్లలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన రోల్స్ రాయిస్ కార్లు, కస్టమ్ డిజైన్‌ తో చేసిన వాహనాలు ఉన్నాయి. ఆయన లగ్జరీ ప్రయాణానికి ఈ కార్లను వాడుతారు. న కుమార్తె పెళ్లి కోసం గోల్డ్ కోటింగ్ ఉన్న కారును కొనుగోలు చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్‌

ఇక నివాసం విషయానికి వస్తే, సుల్తాన్ నివసించే ఇస్తానా నురుల్ ఇమాన్ ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ భవంతి సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 1700 గదులు, 257 బాత్‌ రూమ్‌ లు, 5 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కార్ల కోసం 110 గ్యారేజీలు కూడా ఉన్నాయి. ఈ భవనాన్ని 22 క్యారెట్ల బంగారంతో అలంకరించడం విశేషం.

ఎగిరే రాజభవనం లాంటి బోయింగ్ విమానం 

Advertisement

సుల్తాన్ లగ్జరీ ఇక్కడితో ఆగిపోదు. ఆయన దగ్గర కస్టమ్ డిజైన్ చేసిన Boeing 747 ప్రైవేట్ జెట్ ఉంది. ఇందులో బెడ్‌ రూమ్ సూట్‌ తో పాటు బంగారం పూతతో చేసిన ఫర్నీచర్, వాష్‌ బేసిన్లు ఉన్నాయి. అందుకే ఈ విమానాన్ని  ఎగిరే రాజభవనంగా అభివర్ణిస్తారు. అదే కాకుండా, తన హెయిర్ కట్ కోసం ప్రత్యేకంగా లండన్ నుంచి బార్బర్‌ ను ప్రైవేట్ జెట్‌ లో తీసుకురావడం ఆయన లైఫ్ స్టైల్ ను మరింత ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది.

సుల్తాన్ కు అంత సంపద ఎలా వచ్చింది?

బోల్కియా సంపదకు ప్రధాన కారణం బ్రూనే దేశంలోని చమురు, సహజ వాయువు బిజినెస్ లు. ఈ రంగాల్లో ఆయన ఆధిపత్యం కొనసాగుతోంది. భారీగా సంపద పోగేశారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ సుమారు 30 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 2.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒకప్పుడు 1980లలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కూడా గుర్తింపు పొందారు.

Read Also: స్మార్ట్ టెక్నాలజీతో కారు కవర్, ఇక మీ వెహికల్ భద్రతకు ఢోకా లేదు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×