E-Paper
Advertisement

ChatGPT Account Delete: మీ పర్సనల్ డేటా వాడుకుంటున్న ఓపెన్‌ఏఐ కంపెనీ .. చాట్‌జిపిటి అకౌంట్ శాశ్వతంగా ఇలా డెలీట్ చేయండి

ChatGPT Account Delete: మీ పర్సనల్ డేటా వాడుకుంటున్న ఓపెన్‌ఏఐ కంపెనీ .. చాట్‌జిపిటి అకౌంట్ శాశ్వతంగా ఇలా డెలీట్ చేయండి
Advertisement

ChatGPT Account Delete| ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మన రోజువారీ డిజిటల్ జీవితంలో భాగమైపోయాయి. పనులు వేగంగా పూర్తి చేయడానికి, సులభంగా నిర్వహించడానికి ఇవి సహాయపడతాయి. చాట్‌జిపిటి, గ్రోక్, జెమినిఏఐ వంటి ఏఐ టూల్స్ ఇప్పుడు చాలా పాపులర్. వీటిలో చాట్‌జిపిటి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే AI చాట్‌బాట్‌.

రాయడం, రీసెర్చ్ చేయడం, సమస్యలు పరిష్కరించడం వంటి పనుల కోసం కోట్లాది మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. కానీ ఎక్కువగా AIపై ఆధారపడితే కొన్ని దాగి ఉన్న సమస్యలు వస్తాయి. సొంతంగా ఆలోచించే సామర్థ్యం, క్రియేటివిటీ కొంచెం తగ్గవచ్చు. సమస్యల కోసం స్వతహాగా ఆలోచించకుండా ఆటోమాటిక్ సమాధానాలపై ఆధారపడటం అలవాటు అవుతుంది. దీంతో నిర్ణయాలు తీసుకోవడం, కొత్తగా నేర్చుకోవడం వంటి నైపుణ్యాలు కొంచెం తగ్గవచ్చు. పైగా చాట్‌జిపిటి మాతృక కంపెనీ ఓపెన్ఏఐ యూజర్ల వ్యక్తిగత డేటా ఇతర ప్రయోజనాల కోసం, ప్రయోగాల కోసం ఉపయోగిస్తోంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. వీటిలో కొంత వరకు నిజం కూడా ఉంది.

Advertisement

కాబట్టి AI టూల్స్ నుండి కొద్దిరోజులు బ్రేక్ తీసుకోవడం మంచిది. సొంత ఆలోచనలు, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. కొందరు చాట్‌జిపిటి అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలునుకుంటున్నారు. ఇది డిజిటల్ జీవితంలో కొత్త ప్రారంభానికి దారితీస్తుంది. ఈ గైడ్‌లో మీ చాట్‌జిపిటి అకౌంట్‌ను సురక్షితంగా ఎలా డిలీట్ చేయాలో చూద్దాం.

ల్యాప్‌టాప్ లేదా పిసి నుండి చాట్‌జిపిటి అకౌంట్ డిలీట్ చేసే ప్రక్రియ

మొదటి స్టెప్: మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో ఏదైనా బ్రౌజర్‌లో ChatGPT ఓపెన్ చేయండి. మీ రిజిస్టర్ చేసిన ఈమెయిల్‌తో లాగిన్ అవ్వండి.
రెండో స్టెప్: ఎడమవైపు కింది భాగంలో మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. మెనూలో “Settings” ఆప్షన్ ఎంచుకోండి.
మూడో స్టెప్: సెట్టింగ్స్‌లో “Account” సెక్షన్‌ను ఎంచుకోండి. కొత్త డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
నాలుగో స్టెప్: Account సెక్షన్‌లో కిందికి స్క్రోల్ చేసి “Delete Account” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే కన్ఫర్మేషన్ స్టెప్స్‌ను అనుసరించండి. మీ అకౌంట్ డిలీట్ రిక్వెస్ట్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్ నుండి ChatGPT అకౌంట్ డిలీట్ చేసే ప్రక్రియ

Advertisement

మొదటి స్టెప్: మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్‌లో ChatGPT యాప్ ఓపెన్ చేయండి. మీ ఈమెయిల్‌తో లాగిన్ అయి ఉండాలి.
రెండో స్టెప్: పై ఎడమ వైపు ఉన్న రెండు హారిజాంటల్ లైన్లపై ట్యాప్ చేయండి. నావిగేషన్ మెనూ ఓపెన్ అవుతుంది.
మూడో స్టెప్: మీ ప్రొఫైల్ పేరుపై ట్యాప్ చేసి అకౌంట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి “Data Controls” ఆప్షన్‌ను ఎంచుకోండి.
నాలుగో స్టెప్: Data Controlsలో “Delete OpenAI Account” ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. మీ ఛాయిస్‌ను కన్ఫర్మ్ చేస్తే అకౌంట్ పర్మనెంట్‌గా డిలీట్ అవుతుంది.

Also Read:  ఇప్పుడు అందరికీ ఉచితంగా జెమెని ఏఐ టూల్స్.. కానీ చిన్న కండీషన్

అకౌంట్ డిలీట్ చేయడానికి ముందు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

అకౌంట్ డిలీట్ చేసిన తర్వాత అది పర్మనెంట్‌గా తొలగిపోతుంది. తిరిగి రికవర్ చేయలేం. అదే ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్‌తో కొత్త అకౌంట్ క్రియేట్ చేయలేరు. OpenAI యాప్‌లలోని మీ అన్ని డేటా పూర్తిగా తొలగిపోతుంది. డేటా పూర్తిగా డిలీట్ అవ్వడానికి 30 రోజుల వరకు పట్టవచ్చు. Google Play ద్వారా సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే దాన్ని వేరే చోట క్యాన్సిల్ చేయాలి. అకౌంట్ డిలీట్ అయినా స్టోర్ సబ్‌స్క్రిప్షన్లు ఆటోమాటిక్‌గా నిలిచిపోవు.

ChatGPT అకౌంట్ డిలీట్ చేయడం డిజిటల్ సేవలపై మీరు ఆధారపడడం.. తగ్గించడానికి మంచి అడుగు. సొంతంగా ఆలోచించే సామర్థ్యం, క్రియేటివిటీ మళ్లీ పెరుగుతాయి. మీ డేటా కూడా సురక్షితంగా ఉంటుంది. AIని సమతుల్యంగా ఉపయోగిస్తే దీర్ఘకాలిక వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×