E-Paper
Advertisement

UPI Payments No Internet: ఇంటర్నెట్ లేకుండానే UPI పేమెంట్.. కీప్యాడ్ మొబైల్‌లోను పనిచేస్తుంది.. ఎలా చేయాలంటే

UPI Payments No Internet: ఇంటర్నెట్ లేకుండానే UPI పేమెంట్.. కీప్యాడ్ మొబైల్‌లోను పనిచేస్తుంది.. ఎలా చేయాలంటే
Advertisement

UPI Payments No Internet| భారత్‌దేశంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటిఎం వంటి UPI పేమెంట్స్ ఇప్పుడు రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కిరాణా షాపు, క్యాబ్, చిన్న టిఫిన్ సెంటర్.. ఎక్కడ చూసినా ప్రజలు QR కోడ్ స్కాన్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఇంటర్నెట్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇంటర్నెట్ లేని ప్రదేశాల్లో డిజిటల్ చెల్లింపులు కష్టమవుతాయి.

ముఖ్యంగా గ్రామాల్లో నెట్‌వర్క్ లేకపోతే పేమెంట్ ఫెయిల్ అవుతుంది. ఇక అలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇంటర్నెట్ లేకున్నా యుఎస్ఎస్‌డి కోడ్ తో పేమెంట్ చేసే సౌలభ్యం ఉంది.

Advertisement

*99# అనే సీక్రెట్ కోడ్‌తో ఇంటర్నెట్ లేకుండానే UPI పేమెంట్ చేయొచ్చు! చిన్న కీప్యాడ్ మొబైల్స్ కూడా యుపిఐ చెల్లింపులు చేయొచ్చు.

ఆఫ్‌లైన్ యుపిఐ పేమెంట్ ఎలా పనిచేస్తుంది?

ఆఫ్ లైన్ యుపిఐ అంటే ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్ చేయడం. PhonePe, GPay, Paytm లాంటి యాప్స్ కూడా అవసరం లేదు. సాధారణ కీప్యాడ్ ఫోన్‌లో కూడా పని చేస్తుంది. USSD టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. సిగ్నల్ ఉంటే చాలు, డేటా అవసరం లేదు.

పేమెంట్ చేసే ప్రక్రియ 

  • మీ UPI రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి *99# డయల్ చేయండి
  • తెరుచుకున్న మెనూలో “1” నొక్కి Send Money ఎంచుకోండి
  • డబ్బు పంపాల్సిన వ్యక్తి మొబైల్ నంబర్ లేదా UPI ID ఎంటర్ చేయండి
  • సెండ్ చేయాల్సిన అమౌంట్ టైప్ చేయండి
  • మీ 4 లేదా 6 అంకెల UPI PIN ఎంటర్ చేయండి
  • అంతే! పేమెంట్ సక్సెస్ అయిందని SMS వస్తుంది
Advertisement

పూర్తి ప్రాసెస్‌లో ఒక్క MB డేటా కూడా ఖర్చు కాదు!

గరిష్టంగా ఎంత అమౌంట్ పంపొచ్చు?

నేషనల్ పేమెంట్స్ కమిషన్ ఇండియా (NPCI) నియమాల ప్రకారం:
ఒక ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ.5,000
రోజుకు మొత్తం రూ.5,000 మాత్రమే
చిన్న చిన్న పేమెంట్స్‌కు ఇది సరిపోతుంది. భద్రత కోసం ఈ లిమిట్ పెట్టారు.

ఏ బ్యాంకులు, ఏ ఫోన్లలో పని చేస్తుంది?

ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ – దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు సపోర్ట్ చేస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్, బిఎస్ఎస్ఎల్ – అన్ని నెట్‌వర్క్‌లలో పని చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా సాధారణ కీప్యాడ్ ఫోన్‌లో కూడా పని చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు సులభంగా డిజిటల్ పేమెంట్స్ చేయగలరు.

ఈ ప్రక్రియ చాలా సేఫ్

ఆఫ్‌లైన్ యుపిఐ 100 శాతం సేఫ్. పేమెంట్స్ కోసం మీరు రెగ్యులర్ UPI PINనే ఉపయోగించాలి. బ్యాంక్ వెరిఫై చేస్తుంది. ఎన్‌క్రిప్టెడ్ చానల్ ద్వారా రిక్వెస్ట్ వెళ్తుంది. ఆన్‌లైన్ UPIలా ఇది కూడా పూర్తిగా సురక్షితమే.

ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది?

  • మెట్రో, ట్రైన్‌లో అండర్‌గ్రౌండ్ ఉన్నప్పుడు
  • హైవేల్లో నెట్‌వర్క్ లేనప్పుడు
  • బేస్‌మెంట్ పార్కింగ్‌లో నెట్‌వర్క్ సమస్య ఉన్నప్పుడు
  • గ్రామాల్లో డేటా రానప్పుడు
  • మీ డేటా అయిపోయినప్పుడు
  • ఎక్కడైనా సిగ్నల్ ఉంటే చాలు. పేమెంట్ కచ్చితంగా జరుగుతుంది.

Also Read: సైబర్ దొంగలు మీ డబ్బు దోచుకున్నారా? ఇలా చేస్తే మీ డబ్బు తిరిగి వస్తుంది

ఇప్పుడే సేవ్ చేసుకోండి

ఈ *99# కోడ్‌ను ఇప్పుడే మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో “UPI” అని సేవ్ చేసుకోండి. ఎమర్జెన్సీలో ఇది లైఫ్ సేవర్ అవుతుంది. ఇంటర్నెట్ లేకపోయినా డబ్బు పంపడం సాధ్యమే అని ఈ ట్రిక్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×