E-Paper
Advertisement

Aadhaar Metric Lock: ఆన్‌లైన్ మోసాలు నివారించడానికి ఈ సెట్టింగ్స్ మార్చండి.. ఆధార్ లాక్ ఇలా చేయండి

Aadhaar Metric Lock: ఆన్‌లైన్ మోసాలు నివారించడానికి ఈ సెట్టింగ్స్ మార్చండి.. ఆధార్ లాక్ ఇలా చేయండి
Advertisement

Aadhaar Metric Lock| దేశ వ్యాప్తంగా ఇప్పుడు యుపిఐ పేమెంట్స్ సాధారణమైపోయాయి. నగరాలతో పాటు, గ్రామాల్లో కూడా ప్రజలు డిజిటల్ బ్యాంకింగ్, యుపిఐ సేవలు వినియోగిస్తున్నారు. కిరాణా షాపులు, బిల్లులు, చెల్లింపులకు మొబైల్ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ట్రాన్సాక్షన్లను సులభం చేసింది. గూగుల్ పే, పేటీఎం, BHIM వంటి యాప్స్ ఆధార్ డేటా ఆధారంగా జరుగుతాయి. కానీ బయోమెట్రిక్ డేటా మోసగాళ్ల చేతుల్లో పడితే పెద్ద నష్టం జరుగుతుంది.

బయోమెట్రిక్ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి?

చాలా మంది ఆధార్ బయోమెట్రిక్ డేటా ఎల్లప్పుడూ సేఫ్ అని అనుకుంటారు. కానీ ఫేక్ మెషిన్లు, కాపీ చేసిన రికార్డులతో ఫింగర్‌ప్రింట్ ద్వారా  డబ్బు విత్‌డ్రా (ఉపసంహరణ) చేస్తున్నారు. కొన్ని మోసాలకు SMS లేదా OTP కూడా అవసరం లేదు. బెంగళూరు పోలీస్, SBI ఇలాంటి మోసాల గురించి హెచ్చరించాయి. ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేయడం ద్వారా ఈ మోసాలను అడ్డుకోవచ్చు.

బయోమెట్రిక్ లాక్ చేస్తే ఏమవుతుంది?

Advertisement

బయోమెట్రిక్ లాక్ చేస్తే ఫింగర్‌ప్రింట్, ఐరిస్, ఫేస్ ఆథెంటికేషన్ పనిచేయవు. బ్యాంక్, పేమెంట్ సిస్టమ్స్‌లో భద్రత పెరుగుతుంది. ఆధార్ నెంబర్ తెలిసినా ఫింగర్‌ప్రింట్ లేకుండా మోసగాళ్లు ఉపయోగించలేరు. ఇన్-పర్సన్ అనధికారిక వెరిఫికేషన్ ప్రయత్నాలను ఆపుతుంది.

ఆన్‌లైన్‌లో ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఎలా చేయాలి?

UIDAI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి “Biometric Lock” ఆప్షన్ ఎంచుకోండి. ఆధార్ నెంబర్, లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫై చేయండి. OTP వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత మీ ఫింగర్‌ప్రింట్, ఐరిస్, ఫేస్ ఆథెంటికేషన్ పనిచేయవు. అవసరమైనప్పుడు మీరే స్వయంగా తాత్కాలికంగా అన్‌లాక్ చేసుకోవచ్చు.

mAadhaar యాప్‌తో బయోమెట్రిక్ లాక్

Advertisement

mAadhaar యాప్‌లో కూడా సులభంగా బయోమెట్రిక్ లాక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి. “Biometric Settings”కి వెళ్లి లాక్ ఫీచర్ ఆన్ చేయండి. OTP లేదా యాప్ జనరేట్ చేసిన TOTPతో కన్ఫర్మ్ చేయండి. అవసరమైన పని పూర్తయ్యాక బయోమెట్రిక్ ఆటోమేటిక్‌గా మళ్లీ లాక్ అవుతుంది.

లాక్ చేస్తే ఏం మారుతుంది?

బయోమెట్రిక్ లాక్ చేస్తే ఫింగర్‌ప్రింట్ ఆధారిత ATM, AePS ట్రాన్సాక్షన్లు పనిచేయవు. కానీ SMS/OTP, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, UPI PINతో చేసే ట్రాన్సాక్షన్లు సాధారణంగా జరుగుతాయి. బయోమెట్రిక్ ఆధారిత ఆథెంటికేషన్ మాత్రమే ప్రభావితం అవుతుంది.

Also Read: నిమిషాల్లోనే ఆరోగ్య పరీక్షలు పూర్తి.. జియో ఆరోగ్య ఏఐతో గ్రామీణ ప్రాంతాలకు హైటెక్ చికిత్స

అదనపు భద్రతా టిప్స్

ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచండి. OTP, ఆధార్ వివరాలు ఎవరికీ చెప్పకండి. బ్యాంక్, ఆథెంటికేషన్ హిస్టరీ రెగ్యులర్‌గా చెక్ చేయండి. అనధికారిక చోట్ల బయోమెట్రిక్ డేటా ఇవ్వకండి. ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేయడం చాలా సింపుల్ సేఫ్టీ స్టెప్. డిజిటల్ మోసాలు పెరుగుతున్న రోజుల్లో ఇది మన గుర్తింపును రక్షిస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×